Rashmika : రష్మిక డీప్ ఫేక్ వీడియో నిందితుడు అరెస్ట్…

Rashmika  సరిగ్గా ఓ రెండు నెలల క్రితం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున డీప్ ఫేక్ వీడియోలు వైరల్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. మరి ముఖ్యంగా పాన్ ఇండియా హీరోయిన్ రష్మికకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ కావడంతో ఈ వీడియోలపై చాలామంది ప్రముఖులు కూడా స్పందించడం జరిగింది. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరు ఆదేశించారు. అయితే తాజాగా ఈ వీడియోని రూపొందించిన వ్యక్తిని ఢిల్లీ […]

  • Published On:
Rashmika : రష్మిక డీప్ ఫేక్ వీడియో నిందితుడు అరెస్ట్…

Rashmika  సరిగ్గా ఓ రెండు నెలల క్రితం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున డీప్ ఫేక్ వీడియోలు వైరల్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. మరి ముఖ్యంగా పాన్ ఇండియా హీరోయిన్ రష్మికకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ కావడంతో ఈ వీడియోలపై చాలామంది ప్రముఖులు కూడా స్పందించడం జరిగింది. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరు ఆదేశించారు. అయితే తాజాగా ఈ వీడియోని రూపొందించిన వ్యక్తిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేయడం జరిగింది.అయితే ప్రస్తుతం ప్రపంచమంతా టెక్నాలజీ పరంగా ఎప్పటికప్పుడు కొత్త పుంతలు తొక్కుతూ దూసుకెళ్తోంది. ఈ క్రమంలోనే ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఏ ల్ఐ టెక్నాలజీ ,ల్ ట్రెండింగ్ లోకి రావడం జరిగింది.

rashmika-deep-fake-video-accused-arrested

అయితే ఈ టెక్నాలజీ ద్వారా కొంత మంచి ఉన్నప్పటికీ చాలామంది దీనిని చెడుగానే ఉపయోగిస్తున్నారని చెప్పాలి. ఇక ఈ టెక్నాలజీని ఉపయోగించే రెండు నెలల క్రితం రష్మిక మొహంతో ఒక డీప్ ఫేక్ వీడియోని క్రియేట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఆ వీడియో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయింది. ఇక రష్మిక వీడియో అనంతరం కత్రినా కైఫ్ , అమితాబచ్చన్ , ప్రియాంక చోప్రా , సచిన్ టెండూల్కర్ ,మరియు సారా టెండూల్కర్ కూడా ఈ డీప్ ఫేక్ వీడియో కి బలయ్యారు. అయితే వీరందరిలో రష్మిక డీప్ ఫేక్ వీడియో ఎక్కువగా వైరల్ అయిందని చెప్పాలి.నిజానికి ఆ వీడియో బ్రిటిష్ ఇండియన్ ఇన్స్ప్లేన్సర్ జారా పటేల్ ది.. ఆమె లిఫ్టు ఎక్కుతున్న ఒక వీడియోను తీసుకుని దానికి ఫేస్ మార్కింగ్ చేసి రష్మిక వీడియోగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

ఆమె ఫేస్ కి బదులుగా ఇక్కడ రష్మిక మొహాన్ని రీప్లేస్ చేసి ఓ అజ్ఞాత వ్యక్తి వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దీంతో ఆ సమయంలో పలువురు సెలబ్రిటీలు ప్రముఖులు సైతం ఈ వీడియోపై ఆవేదనన వ్యక్తం చేశారు. ఇలాంటి ఫేక్ వీడియోలు క్రియేట్ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీస్ శాఖకు ఆదేశించారు. అలాగే నిందితుడిని అరెస్టు చేయాలంటూ డిమాండ్ చేశారు. దీంతో ఇలాంటి వీడియోల పై దృష్టి సారించిన పోలీస్ శాఖ తాజాగ ఆ వీడియో తయారు చేసిన వ్యక్తిని అరెస్టు చేయడం జరిగింది. అయితే ఈ వీడియో చేసిన వ్యక్తి ఆంధ్రాలో పట్టుబడ్డాడు. అంతేకాదు అతను ఒక తెలుగు కుర్రాడు అని తెలిసింది. కానీ అతని పూర్తి వివరాలు మాత్రం బయటకు వెల్లడించలేదు.