Cool Roof Technology : భవనాలలో ఉష్ణోగ్రతలను తగించేందుకు కూల్ రూఫ్ విధానం..అమలులోకి తీసుకురానున్న ప్రభుత్వం..

Cool Roof Technology : ప్రస్తుతం వాతావరణంలో పేరుగుతున్న ఉష్ణోగ్రతల వలన ఇళ్లు మరియు వాణిజ్య భవనాలు,కార్యాలయాలలో ఎండ వేడిని తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. దీనికోసం పురపాలక చలువ పైకప్పును అమలులోకి తీసుకురాబోతుంది. ఇక తెలంగాణ కూల్ రూఫ్ విధానాన్ని 2023 /28ను మంత్రి కేటీఆర్ నిన్న ప్రారంభించారు. అయితే హైదరాబాద్ నగరంలో 100 చదరపు కిలోమీటర్ల మేర, అలాగే రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలలో 300 చదరపు కిలో మీటర్స్ విస్తీర్ణంలో కూల్ […]

  • Published On:
Cool Roof Technology : భవనాలలో ఉష్ణోగ్రతలను తగించేందుకు కూల్ రూఫ్ విధానం..అమలులోకి తీసుకురానున్న ప్రభుత్వం..

Cool Roof Technology : ప్రస్తుతం వాతావరణంలో పేరుగుతున్న ఉష్ణోగ్రతల వలన ఇళ్లు మరియు వాణిజ్య భవనాలు,కార్యాలయాలలో ఎండ వేడిని తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. దీనికోసం పురపాలక చలువ పైకప్పును అమలులోకి తీసుకురాబోతుంది. ఇక తెలంగాణ కూల్ రూఫ్ విధానాన్ని 2023 /28ను మంత్రి కేటీఆర్ నిన్న ప్రారంభించారు. అయితే హైదరాబాద్ నగరంలో 100 చదరపు కిలోమీటర్ల మేర, అలాగే రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలలో 300 చదరపు కిలో మీటర్స్ విస్తీర్ణంలో కూల్ రూఫ్ ను ఏర్పాటు చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యంగా తెలుస్తోంది. కూలరూఫ్ పైకప్పులను ఏర్పాటు చేసుకునే విధంగా ప్రజలను ప్రోత్సహించడం,అలాగే ఈ విధానాన్ని అమలు చేసేందుకు వీలుగా ఏజెన్సీ లతో సమన్వయం అవుతున్నారు. అలాగే వీటికోసం పనిచేసే సిబ్బందికి నైపుణ్య శిక్షణ ఇవ్వనున్నారు.

the-government-will-implement-the-cool-roof-system-to-reduce-the-temperature-in-the-buildings

వేసవి నుండి రక్షణకు..

వేసవికాలం వచ్చేస్తుంది. పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో నగరాలు మరియు పట్టణాలు మండిపోతున్నాయి. దీనివలన జనం ఇళ్లల్లో ఉండలేని పరిస్థితి నెలకొంటుంది. దీని నివారణకు ఏసీలను ఉపయోగించడం వలన కాలుష్యం అధికమవుతుంది. ఇక ఏసీలను అమర్చుకోలేని సామాన్య ప్రజలు వడదెబ్బ భారిన పడుతున్నారు. అయితే ఈ చలువ కప్పులను వినియోగించడం వలన భవనాల లోపల వేడి తగ్గి సౌకర్యవంతంగా ఉంటుంది. అలాగే విద్యుత్ కూడా ఆదా అవుతుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా నాచురల్ అసోసియేషన్ డిఫెన్స్ కౌన్సిల్ త్రిబుల్ ఐటీ ,జిహెచ్ఎంసి లతో కలిసి చలువ కప్పులను వెలుగులోకి తీసుకొచ్చింది. అంతేకాక హైదరాబాద్ బంజారాహిల్స్ లోని దేవరకొండ బస్తీలో కూల్ రూఫ్ కప్పులను అమర్చి ప్రయోగాత్మకంగా పనితీరును పరిశీలించారు. అయితే హైదరాబాదులో 1468 నోటిఫైడ్ బస్తీలు ఉన్నాయి. ఇక ఆ బస్తీలలో 19 లక్షల జనాభా నివసిస్తున్నట్లు సమాచారం. అయితే ఇరుకిరుకు నివాసాలు, కాంక్రిక్ట్ మరియు రేకులు ఇళ్లతో ఉన్న ఆ , ప్రాంతంలో జనాభా వేసవిలో ఉండలేని పరిస్థితి నెలకొంటుంది. అయితే ఈ నివాసాలపై ఉపశమనంగా కూల్ రూఫ్ కప్పులను ఏర్పాటు చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం.

the-government-will-implement-the-cool-roof-system-to-reduce-the-temperature-in-the-buildings

కూల్ రూఫ్ అంటే…

ఇంటిపై నిర్మించే కూల్ రూఫ్ పైకప్పు వల్ల గది లోపల ఉష్ణోగ్రతలు తగ్గుతాయి. ఆధునిక సాంకేతితో పైకప్పును వినియోగించి సామాగ్రిలో కొన్ని మార్పులు చేయడం వలన 5 డిగ్రీల సెంటిగ్రేట్ వరకు ఉష్ణోగ్రత తగ్గుతుందని అంచనా. ఇంటిపై అమర్చే ఈ పైకప్పు వలన సూర్యకిరణాలు తిరిగి వాతావరణం లోకి పరావర్తనం చెందుతాయి. తద్వారా ఇంటి లోపలికి వేడి రావడం తగ్గుతుంది. అయితే కూల్ రూఫ్ ఏర్పాటుకు పలు పద్ధతులు ఉన్నాయి. ఇంటి స్లాబ్ పై కూల్ పెయింట్ వేయడం , వినైల్ సీట్లను పరచడం టైల్స్ వేసుకోవడం మొక్కలు పెంపకం వంటి ఏర్పాట్ల వలన ఉష్ణోగ్రతలు తగ్గుతాయి.

అయితే ఇప్పుడు కొత్తగా కట్టే ప్రభుత్వ మరియు వాణిజ్య భవనంలో కూల్ రూఫ్ పద్ధతి తప్పనిసరి కానుంది. అలాగే వాణిజ్య భవనాల అనుమతి ప్రక్రియలోనే దీనిని అనుసంధానం చేస్తారు. అలాగే ప్రభుత్వం బలహీన వర్గాల కోసం కట్టించే ఇళ్లకు కూల్ రూఫ్ ను తప్పనిసరిగా అమలులోకి తీసుకురానుంది. ప్రైవేట్ ఇళ్లకు ఇది తప్పనిసరి కాదు. కానీ ప్రభుత్వం కూల్ రూఫ్ ప్రయోజనాలపై వారికి అవగాహన కల్పిస్తుంది.