Hyderabad : ఈరోజు హైదరాబాదులో పర్యటించనున్న ప్రధాని నరేంద్ర మోడీ..సికింద్రాబాద్ లో భారీ ట్రాఫిక్ ఆంక్షలు..

Hyderabad :  ఈరోజు హైదరాబాద్ మహనగరానికి ప్రధాని నరేంద్ర మోడీ వస్తున్నారు. అయితే ప్రధాని నరేంద్ర మోడీ వస్తుండడం తో సికింద్రాబాద్ పరిసరాలలో ట్రాఫిక్ ఆంక్షలను విధిస్తున్నట్లు హైదరాబాద్ పోలీస్ శాఖ తెలిపింది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో వందే భారత్ ఎక్స్ ప్రెస్ ను ప్రారంభించేందుకు ప్రధాని వస్తున్నారు. ఇక ఆ కార్యక్రమం పూర్తయిన అనంతరం పరేడ్ గ్రౌండ్ లో పబ్లిక్ మీటింగ్ లో ప్రధాని పాల్గొనబోతున్నారు. ఈ నేపథ్యంలో ఈరోజు ఉదయం 9 గంటలనుండి […]

  • Published On:
Hyderabad : ఈరోజు హైదరాబాదులో పర్యటించనున్న ప్రధాని నరేంద్ర మోడీ..సికింద్రాబాద్ లో భారీ ట్రాఫిక్ ఆంక్షలు..

Hyderabad :  ఈరోజు హైదరాబాద్ మహనగరానికి ప్రధాని నరేంద్ర మోడీ వస్తున్నారు. అయితే ప్రధాని నరేంద్ర మోడీ వస్తుండడం తో సికింద్రాబాద్ పరిసరాలలో ట్రాఫిక్ ఆంక్షలను విధిస్తున్నట్లు హైదరాబాద్ పోలీస్ శాఖ తెలిపింది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో వందే భారత్ ఎక్స్ ప్రెస్ ను ప్రారంభించేందుకు ప్రధాని వస్తున్నారు. ఇక ఆ కార్యక్రమం పూర్తయిన అనంతరం పరేడ్ గ్రౌండ్ లో పబ్లిక్ మీటింగ్ లో ప్రధాని పాల్గొనబోతున్నారు. ఈ నేపథ్యంలో ఈరోజు ఉదయం 9 గంటలనుండి మధ్యాహ్నం 2.30 నిమిషాల వరకు సికింద్రాబాద్ పరిసరాలలో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని పోలీస్ కమిషనర్ సివి ఆనందు తెలియజేశారు.

prime-minister-narendra-modi-will-visit-hyderabad-today-huge-traffic-restrictions-in-secunderabad

ట్రాఫిక్ ఆంక్షలు…

* తివోలిక్రాస్ రోడ్స్ నుండి ప్లాజా క్రాస్ రోడ్స్ వరకు రెండు వైపుల రోడ్డులు మూసేస్తారు.

* అలాగే ఎస్బిహెచ్ ఎక్స్ రోడ్ నుండి స్వీకార్.. ఉపకార్ జంక్షన్ వరకు రోడ్డును మూసి వేయడం జరుగుతుంది.

* అలాగే చిలకలగూడ, సెయింట్ జాన్స్ రోటరీ , సంగీత్ జంక్షన్, రేతి ఫైల్ టీ జంక్షన్ ల నుండి వచ్చే ప్రయాణికులకు అనుమతి ఉండదు. ప్రయాణికులు సికింద్రాబాద్ స్టేషన్ చేరుకోవాలంటే క్లాక్ టవర్ పోస్ట్ పోర్ట్ ఆఫీస్, రెజిమెంటల్ బజార్ రూట్ ఉపయోగించుకోవాలి.

*ఇక కరీంనగర్ నుండి రాజివ్ రహదారి మీదుగా హైదరాబాదులోకిి వచ్చేవారు ఓఆర్ఆర్ మీద నుండి దిగి కొంపల్లి ,సుచిత్ర , బాలానగర్, మూసాపేట్ ఎర్రగడ్డ , ఎస్ఆర్ నగర్, అమీర్ పెట్, మీదుగా నగరంలోనికి చేరుకోవాలి.

* కీసర ఓఆర్ఆర్ గేటు నుండి ఈసీఐఎల్ మౌలాలి నాచారం , ఉప్పల్ , మీదుగా వారి గమ్యస్థానానికి చేరుకోవాలి.

*ఇక తిరుమలగిరి క్రాస్ రోడ్ నుండి ఎడమవైపు తీసుకుని ఎస్ఆర్ నగర్ ,ఈసీఎల్, మౌలాలి, మీదుగా సిటీలోని ప్రాంతాలకు వెళ్లాల్సి ఉంటుంది.

*కరీంనగర్ వైపు రాకపోకలు చేసేవారు తిరుమలగిరి క్రాస్ రోడ్స్ , జేబీఎస్ రోడ్డుమీదుగా కాకుండా ఓఆర్ఆర్ పై నుండి వెళ్లాలని పోలీసులు సూచిస్తున్నారు.

పార్కింగ్ స్థలాలు….

కరీంనగర్, ధోదీఘాట్ , ఆదిలాబాద్ ,నిర్మల్ , మెదక్ , సంగారెడ్డి నుండి వచ్చేవారు వాహనాలను బిసన్ పోలో పార్కింగ్ చేసుకోవాలి. రంగారెడ్డి ,కర్నూల్ ,అచ్చంపేట, నల్గొండ ఖమ్మం, సూర్యాపేట, వరంగల్, యాదాద్రి నుండి వచ్చేవారు ఆర్ఆర్సి గ్రౌండ్లో పార్క్ చేసుకోవాలని అధికారులు సూచించారు. రాజీవ్ రహదారి వైపుగా వచ్చే వాహనాలను కంటోన్మెంట్ పార్క్ గ్రౌండ్లో పార్క్ చేసుకోవాలి. అలాగే రంగారెడ్డి ,మహబూబ్ నగర్ , వికారాబాద్ జిల్లాల నుండి వచ్చే వాహనాలు నెక్లెస్ రోడ్ లో పార్క్ చేసుకోవాల్సి ఉంటుంది.

 

తిరుపతికి మరో వందే భారత్ ఎక్స్ ప్రెస్…

మన రాష్ట్రానికి మరో వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు ప్రారంభం కాబోతుంది. సికింద్రాబాద్ నుండి తిరుపతికి ఈ ఎక్స్ ప్రెస్ నడుస్తుంది. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శనివారం ఉదయం జెండా ఊపి ఈ రైలును ప్రారంభించనున్నారు. దానికి సంబంధించిన ఏర్పాట్లను దక్షిణ మధ్య రైల్వే జోనల్ అధికారులు పూర్తి చేశారు. ఇదేకాక మరో మూడు అభివృద్ధి పనులను కూడా ప్రారంభించనున్నట్లు గురువారం ఎస్ సి ఆర్ అధికారులు వెల్లడించారు. అంతేకాక సికింద్రాబాద్ నుండి మహబూబ్ నగర్ స్టేషన్ ల మధ్య రూ.1,410 కోట్లతో నిర్మించిన 85.24 కిలోమీటర్ల డబల్ లైన్ విద్యుద్దీకరణ పనులను ప్రధానమంత్రి ప్రారంభించనున్నారు. అలాగే 720 కోట్ల అంచనా తో నిర్మిస్తున్న సికింద్రాబాద్ స్టేషన్ పునరాభివృద్ది పనులకు శ్రీకారం చుట్టానున్నారు .