Narendra Modi : స్వచ్ఛత అభియాన్ కార్యక్రమంలో ప్రధాని మోడీ…ఫోటోలు వైరల్…

Narendra Modi : ప్రస్తుతం సోషల్ మీడియాలో అయోధ్య రామాలయం ప్రాణ ప్రతిష్ట గురించి పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే . ఈ నేపథ్యంలోనే ప్రధాని నరేంద్ర మోడీ మహారాష్ట్రలోని నాసిక్ లో శుక్రవారం పర్యటించడం జరిగింది. నాసిక్ లో రోడ్ షో నిర్వహించిన అనంతరం రాంఘాటుకు చేరుకుని నరేంద్ర మోడీ గోదావరి నదికి పూజలు చేశారు. ఆ తరువాత చారిత్రక కాలారామ్ మందిర్ లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే ఆలయంలో పూజలు […]

  • Published On:
Narendra Modi : స్వచ్ఛత అభియాన్ కార్యక్రమంలో ప్రధాని మోడీ…ఫోటోలు వైరల్…

Narendra Modi : ప్రస్తుతం సోషల్ మీడియాలో అయోధ్య రామాలయం ప్రాణ ప్రతిష్ట గురించి పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే . ఈ నేపథ్యంలోనే ప్రధాని నరేంద్ర మోడీ మహారాష్ట్రలోని నాసిక్ లో శుక్రవారం పర్యటించడం జరిగింది. నాసిక్ లో రోడ్ షో నిర్వహించిన అనంతరం రాంఘాటుకు చేరుకుని నరేంద్ర మోడీ గోదావరి నదికి పూజలు చేశారు. ఆ తరువాత చారిత్రక కాలారామ్ మందిర్ లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే ఆలయంలో పూజలు మరియు భక్తులతో కలిసి ప్రధాని కాసేపు రామ భజన కూడా చేశారు.

prime-minister-modi-in-swachhta-abhiyan-program-photos-viral

అయితే ఈ క్రమంలోనే స్వచ్ఛత అభియాన్ కార్యక్రమంలో ప్రధాని మోడీ పాల్గొనడం జరిగింది. ఇక ఆయన స్వయంగా బకెట్లో నీరు తీసుకొచ్చి కాలారం ఆలయ పరిసరాలను శుభ్రం చేశారు. అదేవిధంగా అయోధ్య రామ మందిర ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి ముందు దేశవ్యాప్తంగా అన్ని ఆలయాలలో పరిశుభ్రత క్యాంపెయిన్ ఏర్పాటు చేయాల్సిందిగా ప్రతి ఒక్కరూ వారి వారి ఆలయాలను శుభ్రం చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. దీంతో ప్రస్తుతం మోడీకి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

prime-minister-modi-in-swachhta-abhiyan-program-photos-viral

అయితే నాసిక్ సమీపంలోని ప్రాంతాలలో అలాగే పంచవటి ప్రాంతంలో సీతారాములు గడిపారన్న నమ్మకం ఉంది.అందుకే అయోధ్య రామ మందిరం ప్రాణ ప్రతిష్టకు ముందుగానే మోడీ శుభ్రం చేసి వచ్చినట్లు తెలుస్తోంది. ఇక ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలు ముగిసిన అనంతరం స్వామి వివేకానంద జయంతి సందర్భంగా తపోవన్ గ్రౌండ్లో నేషనల్ యూత్ ఫెస్టివల్ ను మోదీ ప్రారంభించారు. అలాగే ప్రధాని వెంట మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ సిండే , ఉపముఖ్యమంత్రులు దేవేంద్ర పాడ్నవిస్ , అజిత్ పవర్ పాల్గొనడం జరిగింది.