Madapur Kumari Aunty : మాదాపూర్ కుమారి ఆంటీ కిచెన్ కి ఎందుకు ఇంత క్రేజ్ అంటే…

Madapur Kumari Aunty : హైదరాబాద్ నగరంలో వేరువేరు ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడి వ్యాపారం చేసుకునే వారే ఎక్కువ మంది ఉన్నారు. అలాంటి వ్యాపారంలో ఫుడ్ బిజినెస్ హైదరాబాద్ లో ఒక మంచి గిరాకీ అని చెప్పవచ్చు. అన్నం పరబ్రహ్మ స్వరూపం. ప్రతి ఒక్కరూ కష్టపడేది రోజంతా చాకిరి చేసేది కడుపు నింపుకోవడం కోసమే ప్రతి ఒక్కరు రుచికరమైన ఆహారం తీసుకోవాలని చూస్తారు. చాలామంది జనాలు రుచిగా ఉండడం మరియు తక్కువ ధరలో భోజనం […]

  • Published On:
Madapur Kumari Aunty : మాదాపూర్ కుమారి ఆంటీ కిచెన్ కి ఎందుకు ఇంత క్రేజ్ అంటే…

Madapur Kumari Aunty : హైదరాబాద్ నగరంలో వేరువేరు ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడి వ్యాపారం చేసుకునే వారే ఎక్కువ మంది ఉన్నారు. అలాంటి వ్యాపారంలో ఫుడ్ బిజినెస్ హైదరాబాద్ లో ఒక మంచి గిరాకీ అని చెప్పవచ్చు. అన్నం పరబ్రహ్మ స్వరూపం. ప్రతి ఒక్కరూ కష్టపడేది రోజంతా చాకిరి చేసేది కడుపు నింపుకోవడం కోసమే ప్రతి ఒక్కరు రుచికరమైన ఆహారం తీసుకోవాలని చూస్తారు. చాలామంది జనాలు రుచిగా ఉండడం మరియు తక్కువ ధరలో భోజనం ఎక్కడ లభిస్తుందో అక్కడ ఎక్కువ ఎకబడుతూ ఉంటారు. దాని కోసం ఎంత దూరమైనా వెళ్తారు. అయితే ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక రుచికరమైన భోజనం ఎక్కడ దొరుకుతుందా అని వెతికి మరి పట్టుకుంటున్నారు. హైదరాబాదులో చాలామంది ట్రెండ్ కు తగ్గ రుచికరమైన ఫుడ్ బిజినెస్ చేస్తున్నారు. ఇక ఇలాంటి వారు ఫుడ్ బిజినెస్ చేసేవారు సోషల్ మీడియాను బాగా వినియోగించుకుంటున్నారు. అలా వారి కస్టమర్ లను పెంచుకుంటున్నారు.

అలా సోషల్ మీడియా ధ్వారా ఫేమస్ అయిన వారే మాదాపూర్ కుమారి ఆంటీ ఫుడ్. హైదరాబాదులో ఫేమస్ ఫుడ్ ఎక్కడ అంటే అందరూ చెప్పే పేరే మాదాపూర్ కుమారి ఆంటీ ఫుడ్ అని చెబుతారు. అయితే అక్కడ తక్కువ ధరలో నాన్ వెజ్ భోజనం దొరకడంతో పాటి అది ఎంతో రుచికరంగా ఉంటుంది. కుమారి ఆంటీ ఎంతోమంది ప్రవేట్ ఉద్యోగులకు మరియు వేరే ప్రాంతాల నుంచి వచ్చిన వారికి ఆకలి తీరుస్తుంది. అయితే ఈ ఆంటీ చేతి వంట ఆస్వాదించడానికి దూర ప్రాంతాల నుంచి కూడా జనం వస్తూ ఉంటారు. కుమారి ఆంటీ వంటల రుచితో ఎంత ఆశ్చర్యపరుస్తుందో ఆదాయం కూడా అంతే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఇంత ఫేమస్ ఆయనా కుమారి ఆంటీ ఆదాయం ఎంత అని చాలామంది అనుకుంటారు. ఈమె నెలకు 3 లక్షలకు పైగా సంపాదిస్తుంది అని సోషల్ మీడియాలో కూడా వార్తలు వస్తున్నాయి. మరి కుమారి ఆంటీ వంట ప్రత్యేకత ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం…

కుమారి ఆంటీ రోజుకి ఫిష్ ఫ్రై ,మటన్ కర్రీ , బోటి కర్రీ , తలకాయ కూర ఇలా అన్నీ నాన్ వెజ్ వంటకాలు చేస్తుంది. ఒక్క రోజుకి దాదాపు 100 కిలోల చికెన్ వండుతుంది. అలాగే ఈమె దగ్గర ప్రతిరోజు 100 కిలో చికెన్ కర్రీ వ్యాపారం జరుగుతుంది. మరియు మటన్ రోజుకు 10 కిలోల చొప్పున వండుతూ ఉంటుంది. అయితే కుమారి ఆంటీ దగ్గర పండగ రోజుల్లో కూడా గిరాకీ పెద్దగా తగ్గదు అని చెప్పాలి. ఈమె దగ్గర తినడమే కాదు ఇంటికి పార్సిల్స్ కూడా పట్టుకుని వెళ్తారు. అయితే ఆ వంద కిలోల చికెన్ కర్రీ మూడు గంటల్లోనే అమ్మకం జరుగుతుంది అంటే ఆశ్చర్య పోవాల్సిందే. అలాగే తన ఫుడ్ గురించి వచ్చే వార్తలు మరియు వీడియోస్ ఇంతవరకు తాను చూసుకోలేదు అని కుమారి ఆంటీ చెప్పుకొచ్చింది. అయితే ఈ వ్యాపారం చేయడానికి ఆమె తల్లి భర్త ఎంతో ప్రోత్సాహం అందించారు అని ఆమె తెలియజేశారు. వారే కాని ధైర్యం చెప్పకపోయి ఉంటే తాను ఇంతవరకు వచ్చేది కాదని తనతో పాటు నలుగురుకి ఉపాధి కల్పించి ఉండేది కాదని చెప్పింది.