Viral Video : గాల్లో ఉండగానే ఊడిపోయిన విమానం డోర్…

Viral Video : ఈమధ్య చోటు చేసుకున్న విమాన ప్రమాదాలు , ఫ్లైట్ జర్నీలు గుండెల్లో వణుకు పుట్టిస్తున్నాయి.సాంకేతిక తప్పిదాలు మానవ తప్పిదాల వలన విమానాలు ప్రమాదానికి గురవుతున్నాయి. తాజాగా ఓ హాలీవుడ్ నటుడు ప్రయాణిస్తున్న జెట్ ఫ్లైట్ సముద్రంలో కూలిపోవడంతో కూతుళ్ళతో సహా మరణించిన విషయం తెలిసిందే. అలాగే ఇటీవల ఓ దేశంలో రెండు విమానాలు , ఢీ కున్న తరుణంలో ప్రయాణికులు ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఈ నేపథ్యంలోనే మరో  ఒళ్ళు గగ్గురుపొడిచే  సంఘటన […]

  • Published On:
Viral Video : గాల్లో ఉండగానే ఊడిపోయిన విమానం డోర్…

Viral Video : ఈమధ్య చోటు చేసుకున్న విమాన ప్రమాదాలు , ఫ్లైట్ జర్నీలు గుండెల్లో వణుకు పుట్టిస్తున్నాయి.సాంకేతిక తప్పిదాలు మానవ తప్పిదాల వలన విమానాలు ప్రమాదానికి గురవుతున్నాయి. తాజాగా ఓ హాలీవుడ్ నటుడు ప్రయాణిస్తున్న జెట్ ఫ్లైట్ సముద్రంలో కూలిపోవడంతో కూతుళ్ళతో సహా మరణించిన విషయం తెలిసిందే. అలాగే ఇటీవల ఓ దేశంలో రెండు విమానాలు , ఢీ కున్న తరుణంలో ప్రయాణికులు ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఈ నేపథ్యంలోనే మరో  ఒళ్ళు గగ్గురుపొడిచే  సంఘటన జరిగింది.  విమానం గాలిలో ఉండగానే దాని డోర్ ఊడిపోయింది. దీనితో ప్రయాణికులు ప్రాణ భయంతో వణికిపోయారు. దీనికి సంబంధించిన వీడియో ఫ్లైట్లో ఉన్న వారు పలువురు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.  దీంతో ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అలస్కా ఎయిర్ లైన్స్ కి చెందిన బోయిన్స్ 7379 మ్యాక్స్ విమానంలో అత్యవసర పరిస్థితి దాపురించింది.

అయితే ఈ ప్రమాదం విమానం ఎయిర్ పోర్ట్ నుంచి టేక్ఆఫ్ అయిన కాస్త సమయాని కే చోటుచేసుకుంది.
గాల్లో ఉండగానే విమానం డోర్ ఊడిపోయింది.దీంతో ఆ ఫ్లైట్ అత్యవసరంగా ల్యాండ్ చేశారు. విమానంలో ఉన్న ప్రయాణికులు ఈ ఘటనకు సంబంధించిన వీడియోని తీయడం జరిగింది. అయితే ఈ ఘటన అమెరికాలో చోటుచేసుకుంది. విమానం టేక్ ఆఫ్ అయి కొంత దూరం ప్రయాణించిన తర్వాత విమానం డోర్ ఉడిపోయింది. దీంతో చాకచక్యంగా వ్యవహరించిన పైలెట్ ఫోర్ ప్లాంట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ చేశారు.ఆ సమయంలో విమానం లో 121 మంది ప్రయాణికులు ఆరుగురు సిబ్బంది ఉన్నట్లు తెలుస్తుంది. అకస్మాత్తుగా డోర్ ఓడిపోవడంతో విమానం ల్యాండ్ అయ్యేంతవరకు ప్రయాణికులు వారి ప్రాణాలున్నారు అరిచేతిలో పట్టుకొని బిక్కుబిక్కు మనీ గడిపారు. అయితే ఎమర్జెన్సీ ల్యాండ్ అనంతరం అందులోని ప్రయాణికులు సురక్షితంగా ఉన్నట్లు తెలుస్తుంది. గగనతరంలోనే డోరు ఊడిపోవడంతో విపరీతమైన గాలి దాడితో ప్రయాణికుల ఫోన్స్ ఎగిరిపడ్డాయి. ఒక బాలుడి షర్ట్ కూడా ఊడిపోయినట్లు తెలుస్తుంది. అయితే ఈ ఘటనపై అలస్కా ఎయిర్ పోర్ట్ ఆరా తీస్తున్నట్లుగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.