Old 100 Notes issue : పాత వంద నోట్లు రద్దు…

Old 100 Notes issue : సోషల్ మీడియా అనేది అందరికీ అందుబాటులో కి రావడం తో నిత్యం చాలా విషయాలు వైరల్ అవుతున్నాయి. సమాజంలో జరిగే ఎన్నో విషయాలతో పాటు మరి కొన్ని సార్లు పుకార్లు కూడా ట్రెండ్ అవుతున్నాయి.ఇదే అదునగా కొంతమంది బోలెడన్ని పుకారులు స్ప్రెడ్ చేస్తూ ఉండడం చూస్తూనే ఉన్నాం.ఈ క్రమంలోనే పాత ₹100రూపాయలు నోట్లు రద్దు అంటూ సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు దర్శనం ఇవ్వడంతో జనాలు ఆశ్చర్యపోతున్నారు. ప్రముఖ సోషల్ […]

  • Published On:
Old 100 Notes issue : పాత వంద నోట్లు రద్దు…

Old 100 Notes issue : సోషల్ మీడియా అనేది అందరికీ అందుబాటులో కి రావడం తో నిత్యం చాలా విషయాలు వైరల్ అవుతున్నాయి. సమాజంలో జరిగే ఎన్నో విషయాలతో పాటు మరి కొన్ని సార్లు పుకార్లు కూడా ట్రెండ్ అవుతున్నాయి.ఇదే అదునగా కొంతమంది బోలెడన్ని పుకారులు స్ప్రెడ్ చేస్తూ ఉండడం చూస్తూనే ఉన్నాం.ఈ క్రమంలోనే పాత ₹100రూపాయలు నోట్లు రద్దు అంటూ సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు దర్శనం ఇవ్వడంతో జనాలు ఆశ్చర్యపోతున్నారు. ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ అయిన ట్విట్టర్ లో ఓ యూసర్ పాత వంద రూపాయల నోట్లు రద్దు అవుతున్నాయని పెట్టాడు .అంతేకాదు ఈ నోట్ల ను వెంటనే బ్యాంకుల్లో మార్చుకోవాలని 2024 చివరి తేదీగా ఆర్బిఐ నిర్ణయించిందని పేర్కొన్నాడు . ఇంకేముంది ఈ పోస్ట్ సోషల్ మీడియా లో వైరల్ అయింది.ఇక జనాలు పాత వంద రూపాయల నోటుపై డిస్కషన్ మొదలుపెట్టారు.

ఇందులో మరో యూజర్ పోస్ట్ పెడుతూ ఒక దుకాణదారుడు పాత ₹100 నోట్లను తీసుకోలేదని దీనికి సంబంధించి ఏదైనా ఆదేశాలు జారీ చేశారని ఆర్బిఐ ని ట్యాగ్ చేశారు. మరి నిజంగానే పాత ₹100 నోట్లను రద్దు చేస్తున్నారా మార్కెట్లో ఈ నోటు చలామణి నిలిపివేయబడుతుందా…? ఇక అసలు విషయనికి వస్తే అసలు పాత వంద రూపాయల నోట్లు గురించి ఆర్.బి.ఐ ఎలాంటిి ప్రకటన చేయలేదు. వీటిని రద్దు చేయబోతున్నారా అనేది నిజం కాదు. ఈ విషయాన్ని ఆర్బిఐ కి చెందిన ఒక ప్రతినిధి స్పష్టం చేశారు .దీనితో సోషల్ మీడియాలో పుకార్లకు చెక్ పడింది. గతంలో కూడా కేంద్ర ప్రభుత్వం 2016 నవంబర్ లో 500 రూపాయల నోట్లు లను మరియు వేయి రూపాయల నోట్లు రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ నోట్లను రద్దు చేసిన వెంటనే కొత్తగా 500 నోట్లు 2000 నోట్ల ను ప్రింట్ చేసింది. ఇక ఆ సమయం లోనే ఆర్బిఐ అప్పుడే కొత్త ₹100 నోట్లను కూడా ప్రింట్ చేసింది.