Guntur Kaaram : మహేష్ ఆ కుర్చీని మడతపెట్టి………

Guntur Kaaram : సూపర్ స్టార్ మహేష్ బాబు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకి ఎక్కుతున్న చిత్రం గుంటూరు కారం. అతడు ఖలేజా వంటి సినిమాల తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా పైన ప్రేక్షకులలో భారీ అంచనాలు ఉన్నాయి.ఈ సినిమా కోసం మహేష్ ఫ్యాన్స్ ఎంతగానో వేచి చూస్తున్నారు. అయితే ఇప్పటికే సినిమా షూటింగ్ వేగంగా జరుగుతుంది. ఈ క్రమంలోనే చిత్ర బృందం ఇటీవల మ్యూజికల్ ప్రమోషన్ ని స్టార్ట్ చేశారు. ఇప్పటివరకు రిలీజ్ […]

  • Published On:
Guntur Kaaram : మహేష్ ఆ కుర్చీని మడతపెట్టి………

Guntur Kaaram : సూపర్ స్టార్ మహేష్ బాబు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకి ఎక్కుతున్న చిత్రం గుంటూరు కారం. అతడు ఖలేజా వంటి సినిమాల తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా పైన ప్రేక్షకులలో భారీ అంచనాలు ఉన్నాయి.ఈ సినిమా కోసం మహేష్ ఫ్యాన్స్ ఎంతగానో వేచి చూస్తున్నారు. అయితే ఇప్పటికే సినిమా షూటింగ్ వేగంగా జరుగుతుంది. ఈ క్రమంలోనే చిత్ర బృందం ఇటీవల మ్యూజికల్ ప్రమోషన్ ని స్టార్ట్ చేశారు. ఇప్పటివరకు రిలీజ్ అయిన ధమ్ మసాల , ఓ మై బేబీ వంటి సాంగ్స్ కు ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ ఇచ్చారు. ఇక తాజాగా కుర్చీని మడత పెట్టే సాంగ్ ను విడుదల చేశారు సినీ బృందం.

అయితే శుక్రవారం వచ్చిన ఈ కుర్చీ మడతపెట్టి సాంగ్ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.కొందరు దీనిని విమర్శిస్తూ ఉంటే ఫ్యాన్స్ మాత్రం అదిరిపోయింది అంటున్నారు.అయితే చాలామంది మహేష్ స్థాయికి ఈ పాట సరైనది కాదు అంటున్నారు. ఇక తమన్ మీద మరొకసారి కాపీ విమర్శలు వస్తున్నాయి. ఇవన్నీ పక్కన పెడితే కుర్చీ మడత పెట్టే సాంగ్ మీద కుర్చీ తాత స్పందిస్తూ చేసిన కామెంట్స్ మరోసారి వైరల్ గా మారాయి. ఇంతకీ కుర్చీ తాత ఏమన్నాడంటే మహేష్ బాబు అంతా స్టార్ హీరోల సినిమాలో నా డైలాగ్ పాటగా వాడుకోవడం చాలా సంతోషంగా ఉంది.

నా డైలాగ్ కి మహేష్ బాబు వేసిన డాన్స్ వేరే లెవెల్ ఒకవేళ నాకు అవకాశం ఇస్తే ఈ పాటలో ఒక్క చరణానికైనా డాన్స్ వేయాలని ఉంది. అంత గొప్ప నటుడు నా డైలాగ్ ని వాడుకోవడం దేవుడిచ్చిన వరంగా భావిస్తున్నానని చెప్పుకొచ్చారు. అంతేకాక గుంటూరు కారం మ్యూజిక్ తమన్ తమకుర్చీ డైలాగ్ ని సినిమాలో వాడుకున్నామని చెప్పడమే కాక తనకు ఆర్ధికంగా సహాయం చేశాడని చెప్పుకొచ్చాడు. కుర్చీ పాట మీద రియాక్ట్ అవుతూ మరోసారి మాస్ డైలాగులతో ఆకట్టుకున్నాడు కుర్చీ తాత. దీంతో ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.