Viral Video : ఇలాంటి వాడికి భార్య గా ఉండడం కంటే వదిలేసి ఒంటరిగా ఉండడం మంచిది…మరి ఇంత నిర్లక్ష్యమా…?

Viral Video : ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ లేనివారు లేరు అంటే అతిశయోక్తి కాదు. చిన్నపిల్లల నుంచి పెద్దల దాకా ప్రతి ఒక్కరు మొబైల్ ఫోన్లకు బానిసలు అయిపోయారు. సెల్ఫోన్ ప్రతి ఒక్కరి జీవితంలో ఒక భాగం అయిపోయింది. ఫోన్ లేనిదే ఆ రోజు గడవదు అన్నట్లుగా అయిపోయింది. ఈ క్రమంలోనే ఫోన్లను ఎక్కువగా వాడుతూ పక్కన ఏం జరుగుతుందో కూడా పట్టించుకోవడం లేదు. అంతలా ఫోన్లకి బానిసలైపోయారు. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో […]

  • Published On:
Viral Video : ఇలాంటి వాడికి భార్య గా ఉండడం కంటే వదిలేసి ఒంటరిగా ఉండడం మంచిది…మరి ఇంత నిర్లక్ష్యమా…?

Viral Video : ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ లేనివారు లేరు అంటే అతిశయోక్తి కాదు. చిన్నపిల్లల నుంచి పెద్దల దాకా ప్రతి ఒక్కరు మొబైల్ ఫోన్లకు బానిసలు అయిపోయారు. సెల్ఫోన్ ప్రతి ఒక్కరి జీవితంలో ఒక భాగం అయిపోయింది. ఫోన్ లేనిదే ఆ రోజు గడవదు అన్నట్లుగా అయిపోయింది. ఈ క్రమంలోనే ఫోన్లను ఎక్కువగా వాడుతూ పక్కన ఏం జరుగుతుందో కూడా పట్టించుకోవడం లేదు. అంతలా ఫోన్లకి బానిసలైపోయారు. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో ఓ భర్త ఫోన్ చూసుకుంటూ పక్కన ఏం జరుగుతుందో కూడా పట్టించుకోలేదు. దీంతో నెటిజన్లు అతడిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో అతడికి విడాకులు ఇవ్వడం బెటర్ అంటూ సలహాలు ఇస్తున్నారు.

ఒక వ్యక్తి బెడ్ మీద పడుకొని ఫోన్లో ఏదో ఆసక్తిగా చూస్తున్నాడు. పక్కనే అతడి కూతురు బొమ్మతో ఆడుకుంటుంది. ఈ క్రమంలోనే ఉన్నట్టుండి ఆ పాప ఒక్కసారిగా కింద పడిపోతుంది. బెడ్డు మీద నుంచి పడడంతో ఒక్కసారిగా గట్టిగా ఏడుస్తుంది. అయినా బెడ్ పై ఉన్న తండ్రి ఏమాత్రం పట్టించుకోకుండా ఏమీ జరగనట్లుగా తన పనిలో తాను మునిగిపోతాడు. కనీసం ఒక్కసారి కూడా ఆ పాప వెపు చూడకుండా అలాగే ఫోన్ చూసుకుంటూ ఉన్నాడు. పాప ఏడుపు విన్న తల్లి పరిగెత్తుకుంటూ అక్కడికి వచ్చి కిందబడ్డ కూతురిని ఎత్తుకుంటుంది.

అంత జరుగుతున్న బెడ్ పై కూర్చున్న భర్తను చూసి కోపం తెచ్చుకుంది. పాప కింద పడ్డ పట్టించుకోకుండా ఏం చేస్తున్నావ్ నువ్వు అసలు మనిషివేనా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. భార్య తిట్టినా కూడా ఆ భర్త ఏమాత్రం పట్టించుకోకుండా ఫోన్ నే చూసుకుంటూ ఉంటాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ఇలాంటి తండ్రి ఉన్న ఒకటే లేకున్నా ఒకటే అని కొందరు, ఇలాంటి భర్త దేనికి పనికిరాడు అని మరికొందరు, ఇతడికి విడాకులు ఇచ్చి ఒంటరిగా బ్రతకడం మేలు అని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.