India helps turkey in earthquake : టర్కీకి నిజమైన స్నేహితుడు భారత్ నే .. ఇండియాకు పదే పదే కృతజ్ఞతలు తెలుపుతున్న టర్కీ పౌరులు ..

India helps turkey in earthquake : భూకంపంతో అతలాకుతలమైన టర్కీ నగరానికి ఇండియా సహాయం అందిస్తుంది. కష్టకాలంలో ఆదుకునే వాడే నిజమైన స్నేహితుడు అని అంటారు. భూకంపంతో తల్లడిల్లుతున్న టర్కీ చేసిన వ్యాఖ్య ఇది. ఇండియాలో టర్కీ రాయబారి ఇండియా తమ నిజమైన స్నేహితుడు అని ట్వీట్ చేశారు. ఇండియా అందించిన సహాయానికి టర్కీ ధన్యవాదాలు తెలిపింది. టర్కీ కి సాయం చేయడానికి ఇండియా ఆపరేషన్ దోస్త్ అనే ఆపరేషన్ చేపట్టింది. టర్కీలో భూకంపం వచ్చిన […]

  • Published On:
India helps turkey in earthquake  : టర్కీకి నిజమైన స్నేహితుడు భారత్ నే ..  ఇండియాకు పదే పదే కృతజ్ఞతలు తెలుపుతున్న టర్కీ పౌరులు ..

India helps turkey in earthquake : భూకంపంతో అతలాకుతలమైన టర్కీ నగరానికి ఇండియా సహాయం అందిస్తుంది. కష్టకాలంలో ఆదుకునే వాడే నిజమైన స్నేహితుడు అని అంటారు. భూకంపంతో తల్లడిల్లుతున్న టర్కీ చేసిన వ్యాఖ్య ఇది. ఇండియాలో టర్కీ రాయబారి ఇండియా తమ నిజమైన స్నేహితుడు అని ట్వీట్ చేశారు. ఇండియా అందించిన సహాయానికి టర్కీ ధన్యవాదాలు తెలిపింది. టర్కీ కి సాయం చేయడానికి ఇండియా ఆపరేషన్ దోస్త్ అనే ఆపరేషన్ చేపట్టింది. టర్కీలో భూకంపం వచ్చిన కొద్ది గంటలకే ఇండియా స్పందించింది. టర్కీతో ఉన్న విభేదాలు మర్చిపోయి వెంటనే సహాయ సామాగ్రిని అందించింది.

మానవత్వాన్ని మించింది ఏమీలేదని నిరూపించింది. భూకంపం వచ్చిన కొద్ది గంటలలోపే ఇండియా నుంచి ఎమర్జెన్సీ సిబ్బంది, వైద్య బృందాలు, NDRF టీమ్స్‌ టర్కీలోని దక్షిణ ప్రాంతానికి చేరుకున్నాయి. వసుదైక కుటుంబం అనే భావనను భారత్‌ తన చర్యల ద్వారా వ్యక్తీకరించింది. కాశ్మీర్ విషయంలో టర్కీ ఇండియాను వ్యతిరేకిస్తుంది. అనేక సందర్భాలలో కాశ్మీర్ విషయంలో పాకిస్తాన్ కు మద్దతు ఇచ్చింది. టర్కీ అధ్యక్షుడు ఎన్నోసార్లు భారత నిజాయితీ గురించి అనుచిత వ్యాఖ్యలు చేశాడు. గోధుమల కంసైన్మెంట్ విషయంలో భారత్ ఒప్పందాన్ని టర్కీ రద్దు చేసుకుంది.

అయినా భారత్ అవేమి పట్టించుకోకుండా కష్ట కాలంలో మానవత్వాన్ని చాటుకుంది. భారత్ తన సిబ్బందిని, సైన్యాన్ని టర్కీ కి పంపించడమే కాకుండా నిత్యం ఏదో ఒక సహాయ సామాగ్రిని టర్కీ ఎయిర్ లైన్స్ కు పంపిస్తుంది.ఆహార సామగ్రి, దుప్పట్లు, బిస్కెట్లు, నీళ్లు ఇలా ప్రతీ అవసరాన్ని తీర్చే ప్రయత్నం చేస్తోంది భారత్‌. తమకు అందిస్తున్న సాయం విషయంలో టర్కీ పదే పదే కృతజ్ఞతలు తెలియజేస్తోంది. టర్కీలో ఇండియా అందిస్తున్న సేవలను మిగితా ప్రపంచం కూడా అభినందిస్తోంది. విభేదాలు ఎన్ని ఉన్నా కష్టకాలంలో ఆదుకోవడం సరైన గుణమని భారత్ రుజువు చేసింది.

Must Read : Taraka Ratna :తారకరత్న ఇక లేరు అని తెలిసి కన్నీటిపర్యంతమైన కుటుంబం..