Hardik Pandya : హార్థిక్ పాండ్యా వింత లవ్ స్టోరీ .. కొడుకు పుట్టిన 2 ఏళ్ల తర్వాత పెళ్లి ..

Hardik Pandya : ఇండియన్ క్రికెట్ టీం లో ఒకరు హార్దిక్ పాండ్యా. స్టార్ క్రికెటర్ అయినా హార్దిక్ పాండ్యా నటాషా స్టాంకోవిక్ ను పెళ్లి చేసుకున్నారు. అయితే వీరి పెళ్లి 2020 లో లాక్ డౌన్ టైంలో రిజిస్టర్ మ్యారేజ్ గా జరిగింది. అయితే ఇప్పుడు వీళ్లు మళ్లీ పెళ్లి చేసుకోబోతున్నారు. వాలెంటెన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న రాజస్థాన్ లో హార్దిక్ నటాషాలు పెళ్లి గ్రాండ్గా చేసుకోబోతున్నారని సమాచారం. గతేడాది అక్టోబర్ నుంచి దీనికి […]

  • Published On:
Hardik Pandya : హార్థిక్ పాండ్యా వింత లవ్ స్టోరీ .. కొడుకు పుట్టిన 2 ఏళ్ల తర్వాత పెళ్లి ..

Hardik Pandya : ఇండియన్ క్రికెట్ టీం లో ఒకరు హార్దిక్ పాండ్యా. స్టార్ క్రికెటర్ అయినా హార్దిక్ పాండ్యా నటాషా స్టాంకోవిక్ ను పెళ్లి చేసుకున్నారు. అయితే వీరి పెళ్లి 2020 లో లాక్ డౌన్ టైంలో రిజిస్టర్ మ్యారేజ్ గా జరిగింది. అయితే ఇప్పుడు వీళ్లు మళ్లీ పెళ్లి చేసుకోబోతున్నారు. వాలెంటెన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న రాజస్థాన్ లో హార్దిక్ నటాషాలు పెళ్లి గ్రాండ్గా చేసుకోబోతున్నారని సమాచారం. గతేడాది అక్టోబర్ నుంచి దీనికి సంబంధించిన పనులు మొదలైనట్లు తెలుస్తుంది. అయితే కొడుకు పుట్టిన 2 ఏళ్ల తర్వాత వీళ్ళు మళ్ళీ పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు అంటే వీళ్లది నిజంగా వింత లవ్ స్టోరీనే.

సెర్బియా కు చెందిన నటాషా పలు బాలీవుడ్ సినిమాలో నటించింది. ప్రముఖ సింగర్ బాదుషా సరసన చేసిన డీజే వాలే బాబు సాంగ్ నటాషాకు మంచి పాపులారిటీ తీసుకొచ్చింది. ఇక బిగ్ బాస్ షోతో ఆమె క్రేజ్ మరింత పెరిగింది. అయితే హార్దిక్ పాండ్యా నటాషా ముంబైలో జరిగిన ఓ నైట్ క్లబ్లో కలిశారు. అక్కడకు గెస్ట్లుగా వచ్చిన వాళ్ళిద్దరూ ఒకరినొకరు పరిచయం చేసుకొని దగ్గరయ్యారు. ఈ పరిచయం కాస్త కొన్నాళ్లకు ప్రేమగా మారింది. దీంతో వాళ్ళిద్దరూ డేటింగ్ చేశారు. తక్కువ టైంలోనే వారిద్దరి మధ్య బంధం బలంగా ఏర్పడింది.

నటాషా తన లైఫ్ పాట్నర్ హార్దిక్ పాండ్యా అని ఫిక్స్ అయింది. దీంతో 2019 డిసెంబర్ 31 న దుబాయ్ లో ఆమె చేతికి ఉంగరం తొడిగి తన లవ్ ను ఎక్స్ప్రెస్ చేశాడు హార్థిక్ . ఆమె కూడా అందుకు ఓకే చెప్పింది. ఆ తర్వాత కుటుంబ సభ్యులు, మిత్రులు, కొంతమంది సన్నిహితుల సమక్షంలో ఆమెను పెళ్లి చేసుకున్నాడు. 2020లో తన భార్య ప్రెగ్నెంట్ అని సోషల్ మీడియాలో హార్దిక్ పెట్టినప్పుడే అందరికీ తెలిసిందే అతడు పెళ్లి చేసుకున్నాడని. ఆ తర్వాత జూలైలో నటాషా మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఆ బిడ్డకు అగస్త్య పాండే అని పేరు పెట్టారు. ఇప్పుడు మరోసారి హార్దిక్ నటాషా లు పెళ్లి పీటలెక్కబోతున్నారు.

Must Read : BREAKING : దేశంలో ఆ 225 నగరాల్లో ‘ జొమాటో ‘ సేవలు బంద్ !