Crime News :అర్థరాత్రి హాస్పటల్ ఎమర్జెన్సీ గదిలోకి వెళ్లిన నర్స్ .. చివరికి ఇలా __?

Crime News : పద్మ అనే 23 ఏళ్ల యువతి నర్సుగా సేవలు అందించాలని గత కొద్ది రోజుల క్రితం ఆస్పత్రిలో స్టాఫ్ నర్స్ గా చేరింది. ఈ క్రమంలోనే ఆ యువతి ఎప్పటిలాగే నైట్ షిఫ్ట్ కి వెళ్ళింది. రాత్రి 2:30 గంటలకు ఎమర్జెన్సీ గదిలోకి వెళ్లిన పద్మ ఊహించని స్థితిలో కనిపించింది. ఈ ఘటన ఏపీలోని అనంతపురం జిల్లా శ్రీ కంఠం సర్కిల్ కిమ్స్ సవీరా హాస్పిటల్ లో చోటుచేసుకుంది. అయితే ఇటీవల పద్మ […]

  • Published On:
Crime News :అర్థరాత్రి హాస్పటల్ ఎమర్జెన్సీ గదిలోకి వెళ్లిన నర్స్ .. చివరికి ఇలా __?

Crime News : పద్మ అనే 23 ఏళ్ల యువతి నర్సుగా సేవలు అందించాలని గత కొద్ది రోజుల క్రితం ఆస్పత్రిలో స్టాఫ్ నర్స్ గా చేరింది. ఈ క్రమంలోనే ఆ యువతి ఎప్పటిలాగే నైట్ షిఫ్ట్ కి వెళ్ళింది. రాత్రి 2:30 గంటలకు ఎమర్జెన్సీ గదిలోకి వెళ్లిన పద్మ ఊహించని స్థితిలో కనిపించింది. ఈ ఘటన ఏపీలోని అనంతపురం జిల్లా శ్రీ కంఠం సర్కిల్ కిమ్స్ సవీరా హాస్పిటల్ లో చోటుచేసుకుంది. అయితే ఇటీవల పద్మ ని ఆస్పత్రి వైద్యులు చిన్నారికి వైద్యం చేసే అంశంలో ఆమె తప్పు లేకున్నా ఆమెను మందలించినట్లుగా తెలుస్తుంది. ఇక అంతటితో ఆగకుండా ఆస్పత్రి డైరెక్టర్ల సమావేశంలో ఆ యువతని అవమానించినట్లుగా సమాచారం.

దీంతో ఆమె తీవ్ర మనస్థాపానికి గురైందని ఆమె తోటి స్నేహితులు తెలిపారు. పద్మ ఎప్పటిలాగే నైట్ షిఫ్ట్ కి వెళ్ళింది. రాత్రి 2:30 వరకు డ్యూటీలోనే ఉంది. ఆ తర్వాత ఆసుపత్రి ఎమర్జెన్సీ గదిలోకి వెళ్లి పడుకుంది. అర్ధరాత్రి ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ తెల్లవారుజామున తోటి నర్సులు ఆమెను నిద్రలేపే ప్రయత్నం చేశారు. ఆమె అంతకు నిద్రలేవకపోవడంతో ఆమె చనిపోయిందని తెలుసుకున్నారు. వెంటనే ఆసుపత్రి వైద్యులకు సమాచారం అందించారు.

వెంటనే యువతి మృతదేహానికి పరిశీలించిన వైద్య సిబ్బంది పోలీసులకు ఫోన్ చేశారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు యువతీ మృతదేహాన్ని పోస్ట్ మర్టన్ కి పంపించారు. ఈ విషయం తెలుసుకున్న ఆమె తల్లిదండ్రులు గుండె పగిలేలా ఏడ్చారు. మా కూతురు ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదనీ మాకు ఏదో అనుమానంగా ఉందని ఆ యువతి తల్లిదండ్రులు ఆస్పత్రి ముందు ఆందోళన చేపట్టారు. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకొని వారిని పంపించేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆ యువత ఎలా మరణించిందో కొన్ని గంటల్లోనే చేధిస్తామని తెలిపారు.

Must Read : Viral News : అర్ధరాత్రి గదిలో అలా చేస్తారా ? పాఠాలు చెప్పాల్సిన మాస్టారు మీకు ఇదేం పాడు బుద్ది…