Viral Video : తల్లిదండ్రుల నిర్వాహకం…వాషింగ్ మిషన్ లోకి దిగిన పిల్లాడు…ఆ తర్వాత ఏం జరిగిందంటే…

Viral Video  : పిల్లల పట్ల తల్లిదండ్రులు ఎంతో జాగ్రత్త వహించాలి. లేకపోతే వారి కోతి చేష్టలతో పెద్ద ప్రమాదాలను తెచ్చి పెడతారు. అందుకే పిల్లలను ఎప్పటికప్పుడు ఓ కంట కనిపెడుతూ ఉండాలి. అప్పుడే వారిని ప్రమాదాల భారిన పడకుండా కాపాడుకోగలుగుతాం. అయితే ఇప్పుడు ఈ టాపిక్ ఎందుకు మాట్లాడుతున్నామంటే.. తాజాగా ఇద్దరు పిల్లలు ఆడుకుంటూ చేసిన కోతి పని, దాని తాలూకు వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇక ఈ వీడియో చూసిన […]

  • Published On:
 Viral Video : తల్లిదండ్రుల నిర్వాహకం…వాషింగ్ మిషన్ లోకి దిగిన పిల్లాడు…ఆ తర్వాత ఏం జరిగిందంటే…

Viral Video  : పిల్లల పట్ల తల్లిదండ్రులు ఎంతో జాగ్రత్త వహించాలి. లేకపోతే వారి కోతి చేష్టలతో పెద్ద ప్రమాదాలను తెచ్చి పెడతారు. అందుకే పిల్లలను ఎప్పటికప్పుడు ఓ కంట కనిపెడుతూ ఉండాలి. అప్పుడే వారిని ప్రమాదాల భారిన పడకుండా కాపాడుకోగలుగుతాం. అయితే ఇప్పుడు ఈ టాపిక్ ఎందుకు మాట్లాడుతున్నామంటే.. తాజాగా ఇద్దరు పిల్లలు ఆడుకుంటూ చేసిన కోతి పని, దాని తాలూకు వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇక ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు చెప్పేది ఒక్కటే..తల్లిదండ్రులు ఎంత నిర్లక్ష్యంగా ఉంటే ఎలా..

పిల్లల పట్ల చాలా అప్రమత్తంగా ఉండాలని లేకపోతే ఇలాంటి సరదాలు ప్రమాదంగా మారుతాయని కామెంట్స్ చేస్తున్నారు. పూర్తి వివరాల్లోకెళితే… వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఇద్దరు పిల్లలు వాషింగ్ మిషన్ దగ్గర ఆడుకోవడాన్ని మనం గమనించవచ్చు. అలా ఆడుకుంటున్న ఇద్దరి పిల్లలలో ఒకడు నవ్వుకుంటూ సరదాగా వాషింగ్ మిషన్లోకి దిగాడు. మరో పిల్లాడు వాషింగ్ మిషన్ స్విచ్ ఆన్ చేశాడు. వాషింగ్ మిషన్ ఆన్ కావడంతో లోపల దిగిన పిల్లాడు గిరగిర తిరగడం ఈ వీడియోలో మనం గమనించవచ్చు. ఇక ఆ తర్వాత ఏమైందనేది మాత్రం వీడియోలో కనిపించలేదు.

అంతేకాక అసలు ఇది ఎక్కడ జరిగింది….? ఎప్పుడు జరిగిందనే వివరాలు కూడా తెలియవు. కానీ ఈ వీడియోలో ఎంత డేంజర్ ఉందో అందరికీ అర్థమవుతుంది. ఇలాంటి చిన్న చిన్న నిర్లక్ష్యాల కారణంగా పెద్ద ప్రమాదాలు చోటు చేసుకుంటాయని కచ్చితంగా తెలుసుకోవాలి. పిల్లలు ఆడుకుంటున్నారు కదా అని వదిలేస్తే..అవి మరింత ప్రమాదం అయ్యే అవకాశం ఉంది. అందుకే పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే ఈ వీడియో మరోసారి పిల్లల పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో స్పష్టంగా తెలిసేలా చేసింది.

https://twitter.com/Journo_Surabhi/status/1663565293380321280