Chandrayaan-3 : గగనతలం లోకి చంద్రాయన్-3 …..ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రయోగం సక్సెస్…

Chandrayaan-3 : ఇటీవల ప్రతిష్టాత్మకంగా ఇస్రో సైంటిస్టులు చేపట్టిన చంద్రాయాన్ -3 రాకెట్ ప్రయోగం విజయం సాధించి మేఘాల్లోకి దూసుకెళ్లింది. అయితే ఇప్పటికీ మూడు దశల్లో రాకెట్ ప్రయోగం సక్సెస్ అయినట్లుగా ఇస్రో శాస్త్రవేత్తలు తెలియజేశారు. దీంతో చంద్రయాన్ రాకెట్ విజయవంతంగా కక్షలోకి వెళ్లింది. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ ప్రయోగం సక్సెస్ అవడంతో ఇస్రో సైంటిస్టులతో పాటు యావత్ భారతదేశం సంబరాలు చేసుకుంటుంది. భారతదేశంలోని ప్రతి ఒక్కరు ఈ ప్రతిష్టాత్మక ప్రయోగానికి అభినందనలు తెలియజేస్తూభారతదేశ కీర్తిని పొగుడుతున్నారు. […]

  • Published On:
Chandrayaan-3 : గగనతలం లోకి చంద్రాయన్-3 …..ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రయోగం సక్సెస్…

Chandrayaan-3 : ఇటీవల ప్రతిష్టాత్మకంగా ఇస్రో సైంటిస్టులు చేపట్టిన చంద్రాయాన్ -3 రాకెట్ ప్రయోగం విజయం సాధించి మేఘాల్లోకి దూసుకెళ్లింది. అయితే ఇప్పటికీ మూడు దశల్లో రాకెట్ ప్రయోగం సక్సెస్ అయినట్లుగా ఇస్రో శాస్త్రవేత్తలు తెలియజేశారు. దీంతో చంద్రయాన్ రాకెట్ విజయవంతంగా కక్షలోకి వెళ్లింది. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ ప్రయోగం సక్సెస్ అవడంతో ఇస్రో సైంటిస్టులతో పాటు యావత్ భారతదేశం సంబరాలు చేసుకుంటుంది. భారతదేశంలోని ప్రతి ఒక్కరు ఈ ప్రతిష్టాత్మక ప్రయోగానికి అభినందనలు తెలియజేస్తూభారతదేశ కీర్తిని పొగుడుతున్నారు.

Chandrayaan-3 Scheduled For Launch In August 2022, Lok Sabha Told

అయితే ఇటీవల నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోటలో సతీష్ ధావన్ అంతరిక్ష ప్రయోగ శాలలో 24 గంటల కౌంట్ డౌన్ అనంతరం నిప్పులు కక్కుతూ ఎల్ వి ఎం 3ఎం రాకెట్ ద్వారా చంద్ర యాన్ -3 గగనతలంలోకి దూసుకెళ్లింది. ఇక ఈ రాకెట్ ను షార్ లోని రెండో ప్రయోగ వేదిక నుండి ప్రయోగించడం జరిగింది. ఇదిలా ఉండగా చంద్రాయన్ 3 ప్రాజెక్ట్ చంద్రుడిలోని దక్షిణ ధ్రువం లో ల్యాండ్ అవ్వనుందట. అయితే ఇప్పటివరకు ప్రపంచంలో ఏ దేశం చేరుకోలేని చంద్రుని దక్షిణ ధ్రువానికి చంద్రయాన్ – 3 వెళ్ళనుంది.

Chandrayaan-3 launch in July: Isro releases new pictures of India's lunar spacecraft - India Today

గంటకు 6 వేల కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తున్న చంద్రాయన్ 3 ఆగస్టు 23 లేదా 24న చంద్రుడు యొక్క దక్షిణ దృవం పై ల్యాండ్ అయ్యే అవకాశం ఉంది. అయితే ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ చంద్రాయన్ – 3 ప్రాజెక్ట్ మునుపటి చంద్ర యాన్ 2 లాగా అవ్వకుండా సక్సెస్ ఫుల్ గా ధ్రువానికి చేరుకుని ల్యాండ్ అవ్వాలని భారతదేశం లోని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. ఈ ప్రయోగం సక్సెస్ అయితే ప్రపంచంలోనే మొట్టమొదటిసారి చంద్రుడి దక్షిణ ద్రవం పై ప్రయోగించిన రాకెట్ గా భారతదేశం పేరు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఇంతటి మహోన్నత కీర్తిని భారతదేశం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.