Viral News : భర్తను మోసగించి ప్రియుడితో వెళ్లిపోయిన యువతి…

Viral News  : జార్ఖండ్ లోని ఓ భర్తకు భార్య దిమ్మ తిరిగే షాక్ ఇచ్చింది. తాను ఎంతో కష్టపడి శ్రమించి చదివించిన భార్య మరో వ్యక్తిని పెళ్లి చేసుకుని వెళ్లిపోయింది. అంతేకాక పెళ్లి చేసుకున్న ఫోటోలను తన మొదటి భర్తకు పంపించింది. దీంతో అతను ఒక్కసారిగా షాక్ అయ్యాడు. రాత్రింబవళ్లు ఎంతో కష్టపడి చదివిస్తే చివరికి తన భార్య ఇలా చేయడంతో భర్త కుప్పకూలిపోయాడు. దీంతో ప్రస్తుతం ఈ న్యూస్ స్థానికంగా తీవ్ర చర్చానియాంశంగా మారింది. […]

  • Published On:
Viral News : భర్తను మోసగించి ప్రియుడితో వెళ్లిపోయిన యువతి…

Viral News  : జార్ఖండ్ లోని ఓ భర్తకు భార్య దిమ్మ తిరిగే షాక్ ఇచ్చింది. తాను ఎంతో కష్టపడి శ్రమించి చదివించిన భార్య మరో వ్యక్తిని పెళ్లి చేసుకుని వెళ్లిపోయింది. అంతేకాక పెళ్లి చేసుకున్న ఫోటోలను తన మొదటి భర్తకు పంపించింది. దీంతో అతను ఒక్కసారిగా షాక్ అయ్యాడు. రాత్రింబవళ్లు ఎంతో కష్టపడి చదివిస్తే చివరికి తన భార్య ఇలా చేయడంతో భర్త కుప్పకూలిపోయాడు. దీంతో ప్రస్తుతం ఈ న్యూస్ స్థానికంగా తీవ్ర చర్చానియాంశంగా మారింది. ఇక పూర్తి వివరాల్లోకెళ్తే…

wife jumped with her boyfriend

జార్ఖండ్ కు చెందిన టింకు అనే వ్యక్తి 2020లో ప్రియా అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అయితే మొదటి నుండి టింకు కూలీగా పని చేస్తూ ఉండేవాడు. ఇక అతని భార్య ప్రియకు మాత్రం నర్సింగ్ చేయాలని కోరిక. ఇక అదే విషయాన్ని తన భర్తతో పదే పదే చెబుతూ ఉండేది. అయితే తాను ఎలాగో చదువుకోలేకపోయానని భావించిన టింకు తన భార్యను చదివించి ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నాడు. తన దగ్గర డబ్బులు లేకపోయినా సరే కష్టపడి ఆమెను చదివిచ్చేందుకు సిద్ధమయ్యాడు. ఈ క్రమంలోనే తన భార్య చదువుకు ఓ సంస్థ నుండి టింకు 2.5 లక్షలు లోన్ కూడా తీసుకున్నాడు. అప్పటికి తన సంపాదన సరిపోకపోవడంతో పిజ్జా డెలివరీ బాయ్ గా కూడా టింకు పనిచేశాడు. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది. కానీ చదువుకోడానికి వెళ్లిన భార్య ప్రియ నర్సింగ్ చేస్తూ అక్కడ దిల్ కుష్ అనే వ్యక్తితో ప్రేమలో పడింది.

భర్తకు తెలియకుండా కొన్నాళ్లు ప్రేమ వ్యవహారం నడిపించింది. కొన్నాళ్ల తర్వాత భర్తను వదిలేసి ప్రియుడితో ఢిల్లీకి వెళ్లి సీక్రెట్ గా పెళ్లి చేసుకుంది. అంతేకాక తన పెళ్లి ఫోటోలను మొబైల్ ద్వారా టింకుకి పంపింది. దీంతో ఫోటోలు చూసిన టింకు ఒక్కసారిగా షాక్ అయ్యాడు. తాను ఎంతో కష్టపడి చదివించిన భార్య ఇలా చేయడంతో తీవ్ర ఆవేదనకు గురయ్యాడు. ఇక వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన భార్య కొన్ని రోజులుగా కనిపించడం లేదని, ఆమె వేరే వాడిని పెళ్లి చేసుకుందని తెలియజేశాడు. ఇక తన భార్యను చదివించడం వలన తాను అప్పుల బాధలో కూరుకుపోయినట్లు తెలియజేశాడు. ఎలాగైనా నాకు న్యాయం జరిగేలా చూడండి అంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.