Womens War In Metro : ఢిల్లీ మెట్రోలో మహిళల యుద్ధం…

Womens War In Metro : గత కొన్ని రోజులుగా ఢిల్లీ మెట్రో కి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న విషయం అందరికీ తెలిసిందే. విపరీతంగా పెరిగిన సోషల్ మీడియా కారణంగా ప్రతిరోజు ఏదో ఒక వింతైన , విచిత్రమైన సంఘటనలు ఢిల్లీ మెట్రోలో చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే ఢిల్లీ మెట్రోలో చాలా వీడియోలను మనం చూసాం. బహిరంగంగా చేయకూడని పనులు కూడా ఢిల్లీ మెట్రోలో దర్శనమిస్తున్నాయి. అయితే తాజాగా మరోసారి ఢిల్లీ మెట్రో […]

  • Published On:
Womens War In Metro  : ఢిల్లీ మెట్రోలో మహిళల యుద్ధం…

Womens War In Metro : గత కొన్ని రోజులుగా ఢిల్లీ మెట్రో కి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న విషయం అందరికీ తెలిసిందే. విపరీతంగా పెరిగిన సోషల్ మీడియా కారణంగా ప్రతిరోజు ఏదో ఒక వింతైన , విచిత్రమైన సంఘటనలు ఢిల్లీ మెట్రోలో చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే ఢిల్లీ మెట్రోలో చాలా వీడియోలను మనం చూసాం. బహిరంగంగా చేయకూడని పనులు కూడా ఢిల్లీ మెట్రోలో దర్శనమిస్తున్నాయి. అయితే తాజాగా మరోసారి ఢిల్లీ మెట్రో కు సంబంధించిన వీడియో ఒకటి ఇంటర్నెట్ లో చేరింది. అయితే ఈసారి మరో అస్తవ్యస్తమైన సంఘటన ఢిల్లీ మెట్రో లో చోటు చేసుకుంది. ఇక ఈ ఘటన అందర్నీ ఆశ్చర్యపోయేలా చేస్తుంది.

అయితే ఈ వీడియోలో గమనించినట్లయితే ఇద్దరు మహిళలు పరస్పరం ఘర్షణ పడుతున్నట్లుగా అర్థమవుతుంది. ఒకరేమో చేతిలో చెప్పులు పట్టుకొని ఉంటే మరొకరు వాటర్ బాటిల్ తీసుకొని దాడి చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. అలాగే ఒకరిని ఒకరు తీవ్రస్థాయిలో దుర్భాషలాడుతూ మాట్లాడుకుంటున్నారు. అయితే అక్కడే ఉన్న వారంతా దీనికి సంబంధించిన ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయగా అది కాస్త వైరల్ గా మారింది. ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్న ఈ ఢిల్లీ మెట్రో వీడియో చూసి అందరూ షాక్ అవుతున్నారు. రద్దీగా ఉన్న మెట్రో రైల్లో ఇద్దరు మహిళల మధ్య ఏం జరిగిందో తెలియదు కానీ…వారిద్దరూ అది మెట్రో అనే ఆలోచన మర్చిపోయి ,నలుగురిలో ప్రయాణిస్తున్నామని ఆలోచనను కోల్పోయి దుర్భాషలాడుతూ చెలరేగిపోయారు.

ఈ క్రమంలోనే ముందుగా ఓ మహిళ ఎదుటి మహిళపై బాటిల్ లో ఉన్న నీటిని ఆమెపై చల్లడానికి ప్రతిదాడిగా ఎదుటి మహిళ తన చెప్పులు తీసి దాడికి సిద్ధమైంది. ఇక ఈ ఘటన ను చుట్టూ ఉన్న ప్రయాణికులు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయగా అది కాస్త క్షణాల్లో వైరల్ గా మారింది. అయితే వీడియోలో ఆ తర్వాత ఏం జరిగిందనేది చూపించలేదు కానీ ఇద్దరి మహిళల మధ్య ఘర్షణ బాగానే జరిగి ఉంటుందని అర్థమవుతుంది. ఈ వీడియోను దేశీ మోజిటో అనే ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు. ఒక ఈ వీడియో చూసిన నేటి జనులు నిద్రలేచింది మహిళా లోకం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియో పై పలువురు పలు రకాలుగా స్పందిస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Mohit Gulati (@desi_mojito)