Vande Bharat Express : వందే భారత్ కు తృటిలో తప్పిన ప్రమాదం…

Vande Bharat Express : ఇటీవల వందే భారతి ఎక్స్ ప్రెస్ కు తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఎందుకంటే గుర్తుతెలియని వ్యక్తులు రైల్వే ట్రాక్ మై రాడ్లను పెద్దపెద్ద రాల్లను వరుసగా పెర్చారు. అయితే దూరం నుండి ముందుగానే వాటిని గమనించిన లోకో పైలట్ రైలును ఆపాడు. అనంతరం వాటిని రైల్వే సిబ్బంది తొలగిస్తుండగా పట్టాలను కలిపే లింకు వద్ద రెండు ఇనుప రాడ్లను పట్టాకి రెండు వైపులా పెట్టి వాటి మధ్యలో రాళ్లను అమర్చారు. […]

  • Published On:
Vande Bharat Express : వందే భారత్ కు తృటిలో తప్పిన ప్రమాదం…

Vande Bharat Express : ఇటీవల వందే భారతి ఎక్స్ ప్రెస్ కు తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఎందుకంటే గుర్తుతెలియని వ్యక్తులు రైల్వే ట్రాక్ మై రాడ్లను పెద్దపెద్ద రాల్లను వరుసగా పెర్చారు. అయితే దూరం నుండి ముందుగానే వాటిని గమనించిన లోకో పైలట్ రైలును ఆపాడు. అనంతరం వాటిని రైల్వే సిబ్బంది తొలగిస్తుండగా పట్టాలను కలిపే లింకు వద్ద రెండు ఇనుప రాడ్లను పట్టాకి రెండు వైపులా పెట్టి వాటి మధ్యలో రాళ్లను అమర్చారు. ఇక ఈ దృశ్యాలను చూసిన రైల్వే అధికారుల సైతం ఆశ్చర్యపోయారు. దీంతో ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పూర్తి వివరాల్లోకెళ్తే …..

udaipur-jaipur-vande-bharat-express-averts-accident

రాజస్థాన్ లోని బిల్వారా సమీపంలో సోమవారం రోజున ఈ ఘటన చోటుచేసుకుంది. ఉదయ్ పూర్ జయపూర్ కు చెందిన వందే భారత్ ఎక్స్ ప్రెస్ సోమవారం ఉదయం ఉదయపూర్ స్టేషన్ నుంచి బయలుదేరగా మార్గమధ్యంలో బిల్వారా సమీపంలో దాదాపు 15 అడుగుల మేర రైల్వే ట్రాక్ పై దుండగులు రాళ్లను ఇనుప రాడ్లను అమర్చారు. దీంతో వెంటనే అప్రమత్తమైన లోకో పైలట్ అత్యవసర బ్రేకులు సహాయంతో రైలును వెంటనే నిలిపివేశాడు. అనంతరం ట్రాక్ పై ఉన్న రాళ్లను మరియ ఇనుప రాడ్లను తొలగిస్తుండగా పట్టాలను అనుసంధానం చేసే ప్రదేశం వద్ద ట్రాక్ ఇరువైపుల పెట్టి వాటి మధ్యలో పెద్ద పెద్ద రాళ్ళను దూర్చారు.

udaipur-jaipur-vande-bharat-express-averts-accident

ఒకవేళ వీటిని గమనించకుండా రైలు వేగంగా వచ్చినట్లయితే ఘోర ప్రమాదం జరిగి ఉండేదని అధికారులు తెలియజేస్తున్నారు. ఇక ఈ తతంగం మొత్తాన్ని రైల్వే సిబ్బంది ఫోన్ లో వీడియో తీసి సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. దీంతో ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ ఘటనపై రైల్వే శాఖ ట్విట్టర్ వేదికగా ఓ ప్రకటన కూడా విడుదల చేసింది. ఉదయ్ పూర్ నుంచి వెళ్లే వందే భారత్ ఎక్స్ ప్రెస్ ట్రాక్ పై రాళ్లు ఇనుప రాడ్లు వేసి రెలు పట్టాలను తప్పించేందుకు సంఘ వ్యతిరేకులు ప్రయత్నిస్తున్నారని తెలియజేశారు. ఈ దారుణానికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని దోషులను విడిచి పెట్టేది లేదని పేర్కొంది.