Bhakta Ramadasu : మరో అద్భుతం బయటపడ్డ భక్త రామదాసు విగ్రహం…

Bhakta Ramadasu  : భద్రాచల ఆలయాన్ని భక్త రామదాసు కంచర్ల గోపన్న నిర్మించాడని చరిత్ర చెబుతుంది. అయితే ఆయన ఎలా ఉండేవారు అనేది ఇప్పటివరకు ఓ స్పష్టత లేదు. దీంతో కళాకారులు తమ ఊహల మేరకు పటాలు చిత్రాలు రూపొందించారు. తాజాగా భక్త రామదాసు కంచర్ల గోపన్న విగ్రహం తొలిసారిగా వెలుగులోకి వచ్చింది. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి పోలీస్ స్టేషన్ ఎన్నో ఏళ్లుగా నిరాధారణకు గురైన విగ్రహం కంచర్ల గోపన్నదే అని నిర్ధారించారు. కొత్త తెలంగాణ చరిత్ర […]

  • Published On:
Bhakta Ramadasu : మరో అద్భుతం బయటపడ్డ భక్త రామదాసు విగ్రహం…

Bhakta Ramadasu  : భద్రాచల ఆలయాన్ని భక్త రామదాసు కంచర్ల గోపన్న నిర్మించాడని చరిత్ర చెబుతుంది. అయితే ఆయన ఎలా ఉండేవారు అనేది ఇప్పటివరకు ఓ స్పష్టత లేదు. దీంతో కళాకారులు తమ ఊహల మేరకు పటాలు చిత్రాలు రూపొందించారు. తాజాగా భక్త రామదాసు కంచర్ల గోపన్న విగ్రహం తొలిసారిగా వెలుగులోకి వచ్చింది. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి పోలీస్ స్టేషన్ ఎన్నో ఏళ్లుగా నిరాధారణకు గురైన విగ్రహం కంచర్ల గోపన్నదే అని నిర్ధారించారు. కొత్త తెలంగాణ చరిత్ర బృందం ఈ ప్రకటన విడుదల చేసింది నేలకొండపల్లి కి చెందిన పసుమర్తి శ్రీనివాస్ అనే వ్యక్తి పోలీస్ స్టేషన్ కి వెళ్ళిన సందర్భం లో ఆవరణలోని రావి చెట్టు వద్ద ఉన్న ఓవిగ్రహాన్ని గుర్తించారు.

statue-of-kancharla-gopanna-alias-bhakta-ramadasu

 

అయితే పది రోజుల క్రితం ఈ విగ్రహ ఆచూకీ ఓ స్థానికుడు పసుమర్తి శ్రీనివాస్ ద్వారా తెలుసుకున్న చరిత్రకారులు రామోజు కట్ట శ్రీనివాసులు పలు రకాలుగా పరిశీలనలు జరిపిన తర్వాత భక్త రామ దాసు రూపం అని ఒక అంచనా కి వచ్చారు. అనంతరం అది రామదాసు విగ్రహమే అని చెబుతూ శుక్రవారం ప్రకటన విడుదల చేశారు. అయితే ఈ విగ్రహం కాసు పోసి కట్టిన ధోవతి పై బట్ట లేకుండా  అంజలి ముద్ర తో మొర కిందకు పెట్టి కత్తి మీసాలు తల వెనుక జారుముడి వేసుకున్న గోష్పాదసికతో విగ్రహం కనిపిస్తుంది. కుడి ఎడమ భుజాలపై శంకు చక్రాలు ఉండడంతో వైష్ణుడి భక్తుడిగా తెలుస్తుంది .

statue-of-kancharla-gopanna-alias-bhakta-ramadasu

ఈ విగ్రహం రాజులకు ఉండే ఆహార్యం తో లేనందున అక్కడున్న వారు ఆ విగ్రహం అక్కన్న, మాదన్నలది కాదని వారి మేనల్లుడు భక్త రామదాసు విగ్రహమని వారు వెల్లడించారు. ఇది సుమారు 17వ శతాబ్దానికి చెందినదని వారు చెప్పారు ఇప్పటివరకు ఈ పరిసర ప్రాంతంలో రామదాసు విగ్రహాలు ఏమి బయటకు రాలేదని వివరించారు. దీంతో పోలీస్ స్టేషన్ వద్ద వెలుగు చూసిన ఆ విగ్రహాన్ని ఎస్సై చేతుల మీదగా రామదాసు పదోతర వారసుడు కంచర్ల శ్రీనివాస్ గారికి అప్పగించారు. ఆయన ఆ విగ్రహాన్ని శుద్ధి చేసి భక్త రామ దాసు నిలయమైన జ్ఞానమందిరానికి తీసుకెళ్లి సీతారామ చంద్రుల వద్ద ఉంచి పూజలు నిర్వహించారు. భద్రాచల పురావస్తు శాఖ అధికారులు విగ్రహాన్ని ఇక నిర్ధారించాల్సి ఉంది.

statue-of-kancharla-gopanna-alias-bhakta-ramadasu