Rishi Sunak : యూకే కి రాకపోకలు కష్టం రిషి సునక్ కొత్త రూల్స్…

Rishi Sunak  : విదేశాల్లో చదువుకోవాలని సెట్టిల్ అవ్వాలని చాలామందికి ఉంటుంది. అందుకే అప్పో సప్పో చేసి అక్కడకు వెళ్తారు. అక్కడ చదువుకొని జాబులు సంపాదించి ఒక విధంగా చెప్పాలి అంటే లగ్జరీ లైఫ్ అలవాటు పడతారు. అలా చదువుకోడానికి చాలామంది వెళ్లే దేశం లో యూకే ఒకటి.అక్కడ చదువుకోడానికి చాలామంది ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. ఒకప్పుడు అయితే చాలా ఈజీగా వెళ్లిపోయేవారు. కానీ ఇప్పుడు అలా కాదు యుకే వెళ్లాలి అనుకున్న వారికి దిమ్మతిరిగే షాక్ […]

  • Published On:
Rishi Sunak : యూకే కి రాకపోకలు కష్టం రిషి సునక్ కొత్త రూల్స్…

Rishi Sunak  : విదేశాల్లో చదువుకోవాలని సెట్టిల్ అవ్వాలని చాలామందికి ఉంటుంది. అందుకే అప్పో సప్పో చేసి అక్కడకు వెళ్తారు. అక్కడ చదువుకొని జాబులు సంపాదించి ఒక విధంగా చెప్పాలి అంటే లగ్జరీ లైఫ్ అలవాటు పడతారు. అలా చదువుకోడానికి చాలామంది వెళ్లే దేశం లో యూకే ఒకటి.అక్కడ చదువుకోడానికి చాలామంది ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. ఒకప్పుడు అయితే చాలా ఈజీగా వెళ్లిపోయేవారు. కానీ ఇప్పుడు అలా కాదు యుకే వెళ్లాలి అనుకున్న వారికి దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు రిషి శునక్. మరి హా కొత్త రూల్స్ ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం. అయితే వచ్చే ఏడాది యూకే లో ఎన్నికలు జరగనున్నాయి. దీనితో తాను ఇచ్చిన హామీలను నెరవేర్చే పనిలో పడ్డారు రిషి శునక్. దేశంలో వలసలు నిరోధించడానికి కఠిన చర్యలు చేపట్టారు.

విదేశాల నుండి యూకే కి వెళ్లాలనుకున్న వారికి ఇమిగ్రేషన్ కష్టాలు తప్పేలా లేదు. ఎందుకంటే స్వదేశీయులకు విద్య ,ఉద్యోగ ,ఉపాధి అవకాశాల లో ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని అనుకుంటుంది అక్కడ ప్రభుత్వం. తమ దేశంలోనికే విద్య ఉద్యోగం ఇవ్వాలని అనుకుంటుంది. రాకపోకలను తగ్గించేందుకు ఫిక్స్ అయింది. అందుకు కొత్త రూల్స్ ప్రకటించింది. గత ఏడాది యూకే ప్రభుత్వం ఏడు లక్షల 75 వేల వీసాలను జారి చేసింది. ఇది ఆ దేశ చరిత్రలోనే అత్యధికం. దీనితో తమ దేశ యువతకు ఉపాధి కష్టం అవుతుందని వాదన తెర మీదకు వచ్చింది. దీనితో వీటి సంఖ్య మూడు లక్షల కంటే తక్కువకి తీసుకురావాలని ఫిక్స్ అయింది ప్రభుత్వం.

అందుకుగాను రాడికల్ యాక్షన్ పేరుతో పలు రూల్స్ ను తీసుకొని వచ్చింది . ముఖ్యంగా వీసా నిబంధనలో భారీ మార్పులను తీసుకొచ్చింది. ఇంతకీ ఆ రూల్స్ ఏంటనే విషయాన్ని వస్తే బ్రిటన్ స్కిల్ వర్కర్స్ పొందేందుకు గతంలో వేతనం కనీస 26 వేల 200 పౌండ్లు. మన భారత కరెన్సీ లో 27.6 లక్షల రూపాయల గా ఉంటుంది. ఇప్పుడు ఈ వేతనాన్ని ఏకంగా 38 వేల 700 పౌండ్లు అంటే 40.78 లక్షలకు పెంచారు. గతంలో ఫ్యామిలీ వీసా కనీస వేతనం 19.59 లక్షలు ఉండేది. దానిని ఇప్పుడు 40.78 కీ పెంచారు. ఇక హెల్త్ కేర్ వీసా దారులు తమ కుటుంబ సభ్యులను ఆ దేశానికి తీసుకువెళ్లేందుకు వీలు లేదు. కేవలం రీసెర్చ్ డిగ్రీలు చేసే పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసే విద్యార్థులకు మాత్రమే మినహాయింపు ఉంటుంది. ఇక స్టూడెంట్ వీసాలకు ప్రస్తుతం అమలు పరిచే రూల్స్ చాలావరకు వలసలను తగ్గిస్తుంది.