RBI : రూ.1000 నోటు రీఎంట్రీ పై క్లారిటీ ఇచ్చిన ఆర్బిఐ…అసలేం చెప్పిందంటే…

RBI :రూ.1000 కరెన్సీ నోట్ మరలా తిరిగి వచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లుగా గత కొన్ని రోజుల నుండి సోషల్ మీడియాలో వార్తలు ప్రచారం జరుగుతున్నాయి. ఇదివరకే రూ.1000 నోట్ల ను రద్దు చేసి వాటి స్థానంలో రూ.2 వేల నోటును తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు రూ.2 వెల నోటును సైతం చలామణి నుంచి తొలగించడం జరిగింది. ఈ క్రమంలో మరల వెయ్యి నోట్ తీసుకొస్తున్నారు అన్న వాదనలు బాగా వినిపిస్తున్నాయి. ఇక ఇలా వస్తున్న […]

  • Published On:
RBI : రూ.1000 నోటు రీఎంట్రీ పై క్లారిటీ ఇచ్చిన ఆర్బిఐ…అసలేం చెప్పిందంటే…

RBI :రూ.1000 కరెన్సీ నోట్ మరలా తిరిగి వచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లుగా గత కొన్ని రోజుల నుండి సోషల్ మీడియాలో వార్తలు ప్రచారం జరుగుతున్నాయి. ఇదివరకే రూ.1000 నోట్ల ను రద్దు చేసి వాటి స్థానంలో రూ.2 వేల నోటును తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు రూ.2 వెల నోటును సైతం చలామణి నుంచి తొలగించడం జరిగింది. ఈ క్రమంలో మరల వెయ్యి నోట్ తీసుకొస్తున్నారు అన్న వాదనలు బాగా వినిపిస్తున్నాయి. ఇక ఇలా వస్తున్న వార్తలు పై ఇటీవల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( RBI ) క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతానికైతే రూ.1000 నోట్లను ప్రవేశపెట్టే ఆలోచన తాము చేయట్లేదని స్పష్టం చేసింది. ఇక ఇలా వస్తున్న వార్తలు పూర్తిగా ఊహజనితమని చెప్పేసింది.

rbi-has-given-clarity-on-the-re-entry-of-rs-1000-note

₹2,000 నోట్లను ఉపసంహరించిన తర్వాత ₹1000 నోట్ల రీ ఎంట్రీ వార్త వెలుగులోకి వచ్చింది . అయితే ఈ అంశంపై రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ అప్పుడే క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఇలా వస్తున్న వార్తలన్నీ ఊహాజనితని ప్రస్తుతం అలాంటి ప్రతిపాదనలు చేసే ఆలోచన లేదని గవర్నర్ శక్తికాంత దాస్ స్పష్టం చేశారు. అయితే తాజాగా మరోసారి ఈ వార్త తెలుగులోకి రావడంతో ఆర్బిఐ స్పందించి క్లారిటీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. మొత్తానికి ఇప్పటికైతే వెయ్యి నోట్లు మళ్లీ మార్కెట్లో వచ్చే పరిస్థితులు అయితే కనిపించడం లేదు. అయితే కేంద్ర ప్రభుత్వం నవంబర్ 2016లో ₹500 మరియు ₹1000 నోట్ల ను రద్దు చేయడం జరిగింది.

rbi-has-given-clarity-on-the-re-entry-of-rs-1000-note

ఇక వాటి స్థానంలో కొత్త ₹500 మరియు ₹2000 కరెన్సీను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇక ఆ సందర్భంలో ఆర్బిఐ క్లారిటీ ఇస్తూ పెద్ద నోట్ల రద్దు తర్వాత కరెన్సీ నోట్ల అవసరాలను తీర్చేందుకు ₹2,000 అందుబాటులోకి తీసుకొచ్చినట్లుగా తెలియజేసింది. అలాగే వాటి లైఫ్ టైం 5 నుండి 6 సంవత్సరాలు మాత్రమే ఉంటుందని కూడా తెలియజేసింది. ఈ క్రమంలోనే ఈ ఏడాది మే నెలలో కేంద్ర ప్రభుత్వం వాటిని చలామణి నుంచి ఉపసంహరించింది. ఇక ఈ నోట్లనూ మార్పిడి చేసుకునేందుకు నాలుగు నెలల గడువు కూడా ఇచ్చింది . అయితే ఇప్పటికీ 2000 నోట్లు ఎవరి దగ్గరైనా ఉంటే మీరు వాటిని ఆర్.బి.ఐ ప్రాంతీయ కార్యాలయాల్లో మార్చుకునే వీలుంటుంది.