Petrol, Diesel Prices : ప్రధాని మోదీ న్యూ ఇయర్ కానుక…పెట్రోల్ డీజిల్ ధరలు భారీ తగింపు…

Petrol, Diesel Prices : ప్రస్తుతం మార్కెట్లో నిత్యవసర వస్తువులైన కూరగాయలు ,పెట్రోల్ ,డీజిల్ వంటి వాటి రేట్లు భారీగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే పెరుగుతున్న ధరలను చూసి సామాన్యులు భయపడుతున్నారు. ఇక పెట్రోల్ డీజిల్ విషయానికొస్తే ఇప్పటివరకు పెరగడమే తప్ప ఒక్క రూపాయి తగ్గింది లేదు. అదేవిధంగా ఈ సంవత్సరం వర్షాభావ పరిస్థితుల కారణంగా వరి సాగు తగ్గుముఖం పట్టింది. దీంతో ప్రస్తుతం బియ్యం ధరలకు రెక్కలు వచ్చాయి. ఈ క్రమంలోనే బహిరంగ మార్కెట్లో ప్రస్తుతం […]

  • Published On:
Petrol, Diesel Prices : ప్రధాని మోదీ న్యూ ఇయర్ కానుక…పెట్రోల్ డీజిల్ ధరలు భారీ తగింపు…

Petrol, Diesel Prices : ప్రస్తుతం మార్కెట్లో నిత్యవసర వస్తువులైన కూరగాయలు ,పెట్రోల్ ,డీజిల్ వంటి వాటి రేట్లు భారీగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే పెరుగుతున్న ధరలను చూసి సామాన్యులు భయపడుతున్నారు. ఇక పెట్రోల్ డీజిల్ విషయానికొస్తే ఇప్పటివరకు పెరగడమే తప్ప ఒక్క రూపాయి తగ్గింది లేదు. అదేవిధంగా ఈ సంవత్సరం వర్షాభావ పరిస్థితుల కారణంగా వరి సాగు తగ్గుముఖం పట్టింది. దీంతో ప్రస్తుతం బియ్యం ధరలకు రెక్కలు వచ్చాయి. ఈ క్రమంలోనే బహిరంగ మార్కెట్లో ప్రస్తుతం కిలో బియ్యం ధర 70 రూపాయల వరకు పలుకుతుంది. ఈ నేపథ్యంలోనే పెరుగుతున్న నిత్యవసర ధరలకు కళ్లెం వేసే దిశగా మోడీ ప్రభుత్వం ఆలోచన చేసింది. దీంతో ప్రస్తుతం రైస్ , దాల్, ఆట పేరుతో బియ్యం, గోధుమపిండి , పప్పులను మోదీ ప్రభుత్వం తక్కువ ధరలకే ప్రజలకు అందించే దిశగా రెడీ అయింది. అదేవిధంగా గ్యాస్ సిలిండర్ ధరలను కూడా భారీగా తగ్గించింది.

prime-minister-modis-new-years-gift-petrol-diesel-prices-slashed

 

అయితే త్వరలోనే మోడీ సర్కార్ మరో శుభవార్త చెప్పనున్నట్లు సమాచారం. నూతన సంవత్సరం కానుకగా త్వరలోనే పెట్రోల్ డీజిల్ ధరలను మోడీ ప్రభుత్వం భారీగా తగ్గించనునట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్ళినట్లయితే…. కేంద్ర ప్రభుత్వమైన మోడీ సర్కార్ త్వరలోనే శుభవార్త చెప్పనున్నట్లు జాతీయ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. పెట్రోలియం మంత్రిత్వ శాఖ ఇంధన ధరల తగ్గింపునకు ఇప్పటికే ప్రతిపాదన సిద్ధం చేసి ప్రధాని మోడీకి సమర్పించినట్లుగా సమాచారం. అయితే ఈ ప్రతిపాదనలను పిఎం గురువారం డిసెంబర్ 28న పరిశీలించి ఆమోదించినట్లుగా జాతీయ మీడియాలో వెళ్లడైంది. ఈ నేపథ్యంలోని డిసెంబర్ 31 లేదా జనవరి 1 లోపు పెట్రోల్ డీజిల్ ధరలు దాదాపు పది రూపాయల వరకు తగ్గించే అవకాశం ఉన్నట్లుగా జాతీయ మీడియాలు పేర్కొంటున్నాయి.

అయితే వచ్చే సంవత్సరం మార్చిలో లోక్ సభ ఎన్నికలతో పాటు పలు రాష్ట్రాలు అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగనున్నాయి. ఈ క్రమంలోనే మోదీ సర్కార్ ఇందనం ధరలను తగ్గించి ప్రజలలో మంచి అభిప్రాయాన్ని పొందే దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో మొదటి సంవత్సరం బహుమతిగా ఇది ఆచరణలోకి రానున్నట్లు సమాచారం. అయితే ప్రస్తుతం పెట్రోల్ మరియు డీజిల్ ధరలు ఆయా ప్రాంతాలను బట్టి కొనసాగుతున్నాయి. ఇక దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 96.72 ఉండగా ముంబైలో లీటర్ పెట్రోల్ ధర 111.35 గా ఉంది.అదేవిధంగా లెటర్ డీజిల్ ధర 89 నుంచి 100 రూపాయల వరకు నడుస్తుంటే రాజధాని ఢిల్లీలో లీటర్ ధర 89.62 గా ఉంది.