Viral Video : సిపిఆర్ చేసి మూర్ఛపోయిన పామును బతికించిన పోలీస్ ఆఫీసర్…వీడియో వైరల్…

Viral Video  : తాజాగా నెట్టింటా ఒక వీడియో వైరల్ అవుతుంది. స్పృహ కోల్పోయిన పామును రక్షించేందుకు మధ్యప్రదేశ్ కు చెందిన ఒక పోలీస్ ఆఫీసర్ ఎవరు నమ్మలేని నిజాన్ని నిరూపించి చూపించాడు. ఏకంగా పాము నోట్లో నోరు పెట్టి గాలి ఊది దానికి కృత్రిమ శ్వాస అందించి దాని ప్రాణాలు రక్షించాడు. దీంతో ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే మధ్యప్రదేశ్ లోని నర్మదాపురం పోలీస్ స్టేషన్ […]

  • Published On:
Viral Video : సిపిఆర్ చేసి మూర్ఛపోయిన పామును బతికించిన పోలీస్ ఆఫీసర్…వీడియో వైరల్…

Viral Video  : తాజాగా నెట్టింటా ఒక వీడియో వైరల్ అవుతుంది. స్పృహ కోల్పోయిన పామును రక్షించేందుకు మధ్యప్రదేశ్ కు చెందిన ఒక పోలీస్ ఆఫీసర్ ఎవరు నమ్మలేని నిజాన్ని నిరూపించి చూపించాడు. ఏకంగా పాము నోట్లో నోరు పెట్టి గాలి ఊది దానికి కృత్రిమ శ్వాస అందించి దాని ప్రాణాలు రక్షించాడు. దీంతో ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే మధ్యప్రదేశ్ లోని నర్మదాపురం పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా నిధులు నిర్వహిస్తున్న ఈ పోలీస్ పేరు అతుల్ శర్మ. స్నేక్స్ రెస్క్యూయర్ గా ఎంతో గొప్ప పేరు ఉన్న ఈయన గత 15 సంవత్సరాలుగా దాదాపు 500 పైగా పాములను రక్షించాడట. ఇక ఈ నైపుణ్యాన్ని డిస్కవరీ ఛానల్ ద్వారా నేర్చుకున్నట్టు ఆయన తెలియజేశారు.

police-officer-gives-cpr-to-snake

అయితే తాజాగా నర్మదాపురం సిటీలోని ఓ ఇంట్లోకి పాము ప్రవేశించింది. కాసేపటికి ఇది ఇంట్లోని ఓ పైప్ లైన్ లోకి దూరింది. ఇక ఇది గమనించిన కుటుంబ సభ్యులు దానిని బయటకు తీసేందుకు నీటితో ఫ్లుష్ చేయడం ప్రారంభించారు. అయినప్పటికీ పాము బయటకు రాకపోవడంతో పురుగుమందును కలిపి పైపులోకి పంపారు. అయితే ఆ పురుగుమందు కలిపిన నీటిని తాగిన పాము స్పృహ కోల్పోయి పైప్ లైన్ లోనే పడిపోయింది. దీంతో వెంటనే కుటుంబ సభ్యులు అతుల్ శర్మకు ఫోన్ చేయగా వెంటనే అక్కడకి చేరుకున్నాడు. ఇక వెంటనే పామును బయటకు తీసి చూడగా అప్పటికే అది శ్వాస తీసుకోవడం లేదని పల్స్ బాగా పడిపోయిందని అతుల్ గమనించారు. దీంతో వెంటనే దానికి సిపిఆర్ చేసేందుకు నిర్ణయించుకున్నారు.

police-officer-gives-cpr-to-snake

ఏదైనా ప్రమాదాలలో మనిషి గుండె కొట్టుకోవడం ఆగిపోయినప్పుడు ఉపయోగించి బ్రతికించే లైఫ్ సేవింగ్ టెక్నిక్ ను పాము పై ప్రయోగించాడు. ఈ క్రమంలోనే పోలీసు అధికారి పాము నోట్లో నోరు పెట్టి దానికి కృత్రిమ శాస అందేలా చేశాడు. అలాగే పురుగుమందు నుండి పాము బయటికి రావడానికి శుభ్రమైన నీటిని చల్లసాగాడు. దాదాపు పది నిమిషాల పాటు ఈ విధానాన్ని అనుసరించిన అనంతరం కాసేపటికి పాములో కదలికలు కనిపించడం ప్రారంభించింది. దీనికి ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అయితే విషపూరితమైన పాములను ఎవరైనా పట్టుకోవాలంటే భయమేస్తుంది. కానీ ఈ పోలీస్ ఆఫీసర్ ఏకంగా దాని నోట్లో నోరు పెట్టి కృత్రిమ శ్వాస అందించి దానిని కాపాడడంతో ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ అతనిని ప్రశంసిస్తున్నారు.