Viral News : యూట్యూబర్ కి 50 లక్షలు ఫైన్ విధించిన మద్రాస్ కోర్టు…ఎందుకో తెలుసా…

Viral News : ఏఐడీఎంకే స్పోప్ పర్సన్ ట్రాన్స్ జెండర్ అప్సరారెడ్డిపై ట్రోల్ చేసిన యూట్యూబర్ మైకేల్ ప్రవీణ్ కు మద్రాస్ హైకోర్టు భారీ షాక్ ఇచ్చింది. ఏకంగా 50 లక్షలు ఫైన్ విధించి ఆ నగదు మొత్తాన్ని అప్సరా రెడ్డికి చెల్లించాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. అయితే తనను వ్యక్తిగతంగా ట్రోల్స్ చేస్తూ వీడియోస్ చేస్తూ యూట్యూబర్ ప్రవీణ్ తనను ఇబ్బందులకు గురి చేస్తున్నాడని , తీరని నష్టాన్ని కలిగించాడని అప్సరారెడ్డి తాజాగా మద్రాస్ హైకోర్టును […]

  • Published On:
Viral News : యూట్యూబర్ కి 50 లక్షలు ఫైన్ విధించిన మద్రాస్ కోర్టు…ఎందుకో తెలుసా…

Viral News : ఏఐడీఎంకే స్పోప్ పర్సన్ ట్రాన్స్ జెండర్ అప్సరారెడ్డిపై ట్రోల్ చేసిన యూట్యూబర్ మైకేల్ ప్రవీణ్ కు మద్రాస్ హైకోర్టు భారీ షాక్ ఇచ్చింది. ఏకంగా 50 లక్షలు ఫైన్ విధించి ఆ నగదు మొత్తాన్ని అప్సరా రెడ్డికి చెల్లించాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. అయితే తనను వ్యక్తిగతంగా ట్రోల్స్ చేస్తూ వీడియోస్ చేస్తూ యూట్యూబర్ ప్రవీణ్ తనను ఇబ్బందులకు గురి చేస్తున్నాడని , తీరని నష్టాన్ని కలిగించాడని అప్సరారెడ్డి తాజాగా మద్రాస్ హైకోర్టును ఆశ్రయించి ప్రవీణ్ పై కేసు నమోదు చేసింది. అదేవిధంగా తనకు 1.25 కోట్లు మరియు 30% వడ్డీతో నష్టపరిహారం ఇవ్వాల్సిందిగా హైకోర్టును అప్సర రెడ్డి కోరింది.

madras-court-imposed-a-fine-of-50-lakhs-on-youtuber-do-you-know-why

తాను ఓ మ్యాగజైన్ కు ఎడిటర్ గా ఉన్న సమయంలో యూట్యూబర్ లో జాయింట్ ప్రోగ్రాం చేసేందుకు ఒప్పుకోలేదని కోపంతో మైఖేల్ ఇలా నన్ను టార్గెట్ చేసి ట్రోల్ చేస్తున్నట్లుగా అప్సరరెడ్డి కోర్టుకు తెలియజేసింది. అదేవిధంగా యూట్యూబ్ లో తనకు సంబంధించిన వీడియోలను కూడా డిలీట్ చేయించాల్సిందిగా ఆమె కోరింది.

అప్సర రెడ్డి ఇచ్చిన సమాచారం ప్రకారం విచారణ చేపట్టిన మద్రాస్ హైకోర్టు మైకిల్ కు 50 లక్షల ఫైన్ విధించడంతోపాటు ఆ నగదు మొత్తాన్ని అప్సర రెడ్డికి ఇవ్వాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. యూట్యూబ్ లో వీడియోలను పోస్ట్ చేసే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుందని , కానీ ఆ సమయంలో లిమిట్స్ క్రాస్ చేయొద్దు అంటూ కోర్టు అభిప్రాయ వ్యక్తం చేసింది. మీరు పెట్టే వీడియోలు ఇతరుల ప్రైవసీ కి ఇబ్బంది కలిగించే విధంగా ఉండకూడదని హైకోర్టు తెలియజేసింది. దీంతో ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.