Latest News : అర్ధరాత్రి షట్టర్ లోపల అర్థనగ్నంగా దర్శనమిచ్చిన యువతీ యువకులు…పోలీసులు వెళ్లి చూడగా…
Latest News : ప్రస్తుతం దేశంలోని కొన్ని రాష్ట్రాలలో ఎన్నికల హడావిడి మొదలైంది. ఈ నేపథ్యంలోనే రాజస్థాన్ లో కూడా ఎన్నికల సందడి సాగుతుంది. పార్టీ నేతల ర్యాలీలు ,వాగ్దానాలు , పార్టీ జెండాలు అన్నింటికీ మించి పోలీసుల తనిఖీలు..ఒక్కటేంటి అన్ని విధాలుగా కసరత్తులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇటీవల బార్మర్ జిల్లా లో ఓ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఎన్నికల నేపథ్యంలో తనిఖీలు చేపడుతున్న పోలీసులకు మూసి ఉన్న ఓ షట్టర్ నుంచి శబ్దాలు రావడం […]
Latest News : ప్రస్తుతం దేశంలోని కొన్ని రాష్ట్రాలలో ఎన్నికల హడావిడి మొదలైంది. ఈ నేపథ్యంలోనే రాజస్థాన్ లో కూడా ఎన్నికల సందడి సాగుతుంది. పార్టీ నేతల ర్యాలీలు ,వాగ్దానాలు , పార్టీ జెండాలు అన్నింటికీ మించి పోలీసుల తనిఖీలు..ఒక్కటేంటి అన్ని విధాలుగా కసరత్తులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇటీవల బార్మర్ జిల్లా లో ఓ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఎన్నికల నేపథ్యంలో తనిఖీలు చేపడుతున్న పోలీసులకు మూసి ఉన్న ఓ షట్టర్ నుంచి శబ్దాలు రావడం వినిపించాయి. ఏంటా అని వెళ్లి చూడగా అందరూ ఆశ్చర్యపోయే దృశ్యం వెలుగులోకి వచ్చింది. ఇక పూర్తి వివరాల్లోకెళ్తే…
రాజస్థాన్ సరిహద్దు జిల్లా అయిన బార్మర్ లో ఎన్నికల నేపథ్యంలో పోలీసులు రాత్రి సమయాలలో వారు చేపట్టే పెట్రోలింగ్ లో మార్పులను జరిపారు. ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున రాత్రి సమయాలలో గస్తి కాస్తున్నారు. ఈ క్రమంలోనే రాత్రివేళ పోలీసులు ఉట్రలాయ్ రోడ్ లో తనిఖీలు చేపట్టగా వారికి షట్టర్ కనిపించింది. అయితే తోలుత వారు చూసినప్పుడు షట్టర్ మూసి ఉండటంతో దానిని పెద్దగా పట్టించుకోలేదు కానీ రెండు మూడుసార్లు షటర్ నుండి శబ్దాలు రావడంతో పోలీసులకు అనుమానం కలిగింది.
ఈ క్రమంలోనే పోలీసులు లోపల ఎవరైనా ఉన్నారేమో అని భావించి షట్టర్ తెరిచి చూశారు. దీంతో ఒక్కసారిగా అందరూ షాక్ అయ్యారు. షట్టర్ లోపల యువతి యువకులు అర్ధానంగా కనిపించడం పోలీసులు గమనించారు . ఇక పోలీసులను చూడగానే భయపడి పోయిన యువతీ యువకులు పరుగులు తీయడం మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే కొంతమంది కాలుజారి కింద కూడా పడ్డారు. అయితే పోలీసులు మాత్రం చాకచక్యంగా వారిని పట్టుకొని అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలోని వాళ్లంతా ఎవరు…? ఎక్కడి నుండి వచ్చారు..!అక్కడ ఏం చేస్తున్నారనే కోణంలో విచారణ జరుపుతున్నారు. దీంతో ప్రస్తుతం ఈ న్యూస్ స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇక ఈ న్యూస్ తెలుసుకున్న పలువురు పలు రకాలుగా స్పందిస్తున్నారు.