Viral news : చదివింది 8వ తరగతే…కానీ ఏడాదికి కోట్లలో సంపాదిస్తున్న యువరైతు…

Viral news : ఆ యువకుడు చదివింది కేవలం ఎనిమిదో తరగతి మాత్రమే. అయినప్పటికీ కోట్లలో సంపాదిస్తున్నాడు. అయితే ఎంతో చదువుకున్న ఐఐటి గ్రాడ్యుయేట్స్ కంటే కూడా ఇతను సంపాదన ఎక్కువ అని చెప్పాలి. అయితే ప్రస్తుత కాలంలో చాలామంది వ్యవసాయం చేయడమంటే అదేదో పనికిమాలిన పనిగా చూస్తున్నారు. కానీ చాలామంది యువ రైతులు వినూత్న పద్ధతిలో వ్యవసాయాలను చేస్తూ పండించిన పంటలను ప్రపంచ మార్కెట్లో అమ్ముతూ అందరూ ఆశ్చర్యపడేలా సాఫ్ట్వేర్ ఉద్యోగుల కంటే కూడా ఎక్కువగా […]

  • Published On:
Viral news : చదివింది 8వ తరగతే…కానీ ఏడాదికి కోట్లలో సంపాదిస్తున్న యువరైతు…

Viral news : ఆ యువకుడు చదివింది కేవలం ఎనిమిదో తరగతి మాత్రమే. అయినప్పటికీ కోట్లలో సంపాదిస్తున్నాడు. అయితే ఎంతో చదువుకున్న ఐఐటి గ్రాడ్యుయేట్స్ కంటే కూడా ఇతను సంపాదన ఎక్కువ అని చెప్పాలి. అయితే ప్రస్తుత కాలంలో చాలామంది వ్యవసాయం చేయడమంటే అదేదో పనికిమాలిన పనిగా చూస్తున్నారు. కానీ చాలామంది యువ రైతులు వినూత్న పద్ధతిలో వ్యవసాయాలను చేస్తూ పండించిన పంటలను ప్రపంచ మార్కెట్లో అమ్ముతూ అందరూ ఆశ్చర్యపడేలా సాఫ్ట్వేర్ ఉద్యోగుల కంటే కూడా ఎక్కువగా సంపాదిస్తున్నారు.ఇక ఈ రైతు కూడా నిబద్ధత కలిగిన రైతుగా అద్భుతమైన విజయాన్ని సాధించాడు. వ్యవసాయమే దండగ అనుకునే చాలామందికి గుజరాత్ కు చెందిన ధర్మేష్ బాయ్ మాతుకియా వ్యవసాయం ద్వారా ఐటీ ఉద్యోగుల కంటే కూడా ఎక్కువ మొత్తంలో సంపాదించవచ్చని నిరూపించి చూపించాడు. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే…

గుజరాత్ రాష్ట్రంలోని అంమ్రేలీ జిల్లాలో అమ్రాపూర్ గ్రామానికి చెందిన ధర్మేష్ భాయ్ మాతుకియ అనే యువకుడు వినూత్నం గా ఆలోచించి కొత్త పద్ధతుల లో వ్యవసాయం చేస్తూ పండించిన పంటలను ప్రపంచ మార్కెట్లలో అమ్ముకుంటూ కోట్లలో సంపాదిస్తున్నాడు. అయితే,ధర్మేష్ కు 20 ఎకరాల భూమి ఉంది. దానిలో మిర్చి సాగు చేసిన ధర్మేష్ సంవత్సరానికి దాదాపు 60 వేల కిలోల గణనీయమైన దిగుబడిని పొందుతున్నాడు. ఇక తన మిర్చి పంటను మిర్చి పొడిగా చేసి ప్రపంచ మాటలోకి ఎగుమతి చేస్తున్నాడు. దీని ఫలితంగా సంవత్సరానికి దాదాపు 1.50 కోట్ల ఆదాయాన్ని ధర్మేష్ పొందుతున్నట్లు తెలుస్తోంది. అయితే కేవలం 8వ తరగతి వరకు చదువుకున్న 45 ఏళ్ల ధర్మేష్ బాయ్ గత ఐదు సంవత్సరాలుగా మిర్చి సాగు చేస్తూనే ఉన్నారట.

ఇక కాశ్మీరీ డబ్బి వంటి రకాల మిర్చి పంటలను పండించడం ఆయన ప్రత్యేకత.ఇక ఆయన పండించిన పంటలలో కొంత బాగాన్ని మిర్చి రూపంలో ,మరికొంత భాగాన్ని పౌడర్ గా చేసి విక్రయిస్తున్నారు. ఇక కాశ్మీర్ మిర్చి పౌడర్ మార్కెట్లో దాదాపు రూ.450 పలుకుతుంది. అలాగే కాశ్మీర్ మిర్చి రూ. 350 పలుకుతుంది.ఇక ఈ కారం పొడిని అమెరికాతో సహా వివిధ దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తున్నట్లు సమాచారం. ఈ విధంగా సంవత్సరానికి దాదాపు 1.5 కోట్లకు ధర్మేష్ బిజినెస్ సాగుతుందని తెలుస్తుంది. దీనిలో వ్యవసాయ కూలీ ఖర్చులు తీసివేయగా మొత్తం అతనికి మిగిలే ఆదాయం దాదాపు 90 లక్షల వరకు ఉంటుందని అంచనా. కృషి ఉంటే ఎలాంటి వారైనా సరే కోట్లలో సంపాదించవచ్చని ధర్మేష్ నిరూపించారు. చదువు లేకపోయినా సంపాదించవచ్చని నిరూపించు చూపించాడు. చదువు లేకపోయినా ఉన్నత స్థాయికి వెళ్లొచ్చు అని నిరూపించిన ధర్మేష్ నేటి తరం యువతకు ఆదర్శం అని చెప్పాలి.