Viral News : విడాకులు తీసుకున్న కుమార్తెను మేళతాళాలతో పుట్టింటికి స్వాగతించిన తండ్రి…వీడియో వైరల్..

Viral News : తన అత్తింట్లో కుమార్తె అనుభవిస్తున్న కష్టాలను చూడలేకపోయినా ఓ తండ్రి…ఇటీవల మేళ్లతాళాలతో బాణ సంచా సందడి చేస్తూ పుట్టింటికి తీసుకొచ్చాడు. దీంతో ప్రస్తుతం దీనికి సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఈ ఘటన ఝార్ఖండ్ లోని రాంచీలో చోటు చేసుకుంది. ఈ క్రమంలోనే ఈనెల 15వ తేదీన జరిగిన ఊరేగింపు వీడియోను ఓ వ్యక్తి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు.ఇక పూర్తి వివరాల్లోకి వెళితే… రాంచికి చెందిన […]

  • Published On:
Viral News : విడాకులు తీసుకున్న కుమార్తెను మేళతాళాలతో పుట్టింటికి స్వాగతించిన తండ్రి…వీడియో వైరల్..

Viral News : తన అత్తింట్లో కుమార్తె అనుభవిస్తున్న కష్టాలను చూడలేకపోయినా ఓ తండ్రి…ఇటీవల మేళ్లతాళాలతో బాణ సంచా సందడి చేస్తూ పుట్టింటికి తీసుకొచ్చాడు. దీంతో ప్రస్తుతం దీనికి సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఈ ఘటన ఝార్ఖండ్ లోని రాంచీలో చోటు చేసుకుంది. ఈ క్రమంలోనే ఈనెల 15వ తేదీన జరిగిన ఊరేగింపు వీడియోను ఓ వ్యక్తి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు.ఇక పూర్తి వివరాల్లోకి వెళితే… రాంచికి చెందిన ప్రేమ్ గుప్తా అనే వ్యక్తి గత సంవత్సరం ఏప్రిల్ లో తన కుమార్తె సాక్షి గుప్తాకు సచిన్ కుమార్ అనే వ్యక్తితో అంగరంగ వైభవంగా వివాహం జరిపించారు.

Viral news | భర్తతో కాపురం చేయలేనన్న కుమార్తె.. మేళతాళాలతో పుట్టింటికి తీసుకొచ్చుకున్న తండ్రి..!-Namasthe Telangana

అయితే పెళ్లయిన కొన్ని రోజుల తర్వాత సచిన్ నిజస్వరూపం బయటపడింది. అప్పటినుండి సాక్షి గుప్తాకు వేధింపులు మొదలయ్యాయి. అంతేకాక సచిన్ కు అంతకుముందే వివాహం జరిగినట్లు ప్రేమ్ గుప్తా చెప్పుకొచ్చాడు. అయినా కూడా అతనితో బంధం కొనసాగించేందుకు నిర్ణయం తీసుకున్నామని ఆయన చెప్పుకొచ్చారు. కానీ రోజురోజుకు సచిన్ వేధింపులు ఎక్కువవుతూ వచ్చాయట. ఈ నేపథ్యంలో అతనితో కలిసి ఉండటం సాధ్యం కాదని నిర్ణయించుకున్న సాక్షి తన వైవాహిక జీవితానికి వీడ్కోలు పలకాలని తల్లిదండ్రులకు తెలియజేసింది. ఇక తన కూతురి కష్టాలను తెలుసుకున్న తండ్రి ఆమెకు సహకరించాడు.

ఈ నేపథ్యంలోనే ఆమెను పుట్టింటికి తీసుకువచ్చేందుకు ఘనంగా ఏర్పాట్లు నిర్వహించాడు. అంతేకాక ఈ కార్యక్రమానికి బంధుమిత్రులను కుటుంబ సభ్యులను కూడా ఆహ్వానించాడు. టపాసులు కాలుస్తూ మేళ తాళాలతో తన కూతుర్ని పుట్టింటికి స్వాగతం తీనుకువచ్చాడు . దీంతో ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ విషయంపై సాక్షి తండ్రి ప్రేమ్ గుప్తా మాట్లాడుతూ కుమార్తెలు ఎంతో విలువైన వారని , అత్తింట్లో వారికి ఇబ్బందులు ఎదురైతే వారిని గౌరవంతో పుట్టింటికి స్వాగతించాలని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోని సచిన్ తో విడాకులు తీసుకునేందుకు న్యాయస్థానంలో కేసు దాఖలు చేసినట్టుగా తెలియజేశారు.