Kerala : కట్నం ఇవ్వలేదని పెళ్లి ఆపేసిన వరుడు… మనస్థాపానికి గురైన వధువు ఆత్మహత్య…

Kerala  : ఇప్పటికీ వరకట్నం వేధింపులు అనేవి జరుగుతూనే ఉన్నాయి. తాజాగా వరకట్నం వేధింపుల కారణంగా ఓ యువ వైద్యురాలు ఆత్మహత్య చేసుకుని ప్రాణాలను విడిచింది. కోరినంత వరకట్నం ఇవ్వలేదని వరుడు పెళ్లికి నిరాకరించడంతో బాధిత యువతి బలన్మరణానికి పాల్పడింది. అయితే ఈ ఘటన కేరళలోని తిరువనంతపురంలో చోటుచేసుకుంది. స్థానిక ప్రాంతంలో నివాసం ఉంటున్న డాక్టర్ షహన తాజాగా తన పెళ్లి వరకట్నం కారణంగా ఆగిపోవడంతో మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకుని బలాన్మరణానికి పాల్పడింది. వరుడు అడిగినంత […]

  • Published On:
Kerala : కట్నం ఇవ్వలేదని పెళ్లి ఆపేసిన వరుడు… మనస్థాపానికి గురైన వధువు ఆత్మహత్య…

Kerala  : ఇప్పటికీ వరకట్నం వేధింపులు అనేవి జరుగుతూనే ఉన్నాయి. తాజాగా వరకట్నం వేధింపుల కారణంగా ఓ యువ వైద్యురాలు ఆత్మహత్య చేసుకుని ప్రాణాలను విడిచింది. కోరినంత వరకట్నం ఇవ్వలేదని వరుడు పెళ్లికి నిరాకరించడంతో బాధిత యువతి బలన్మరణానికి పాల్పడింది. అయితే ఈ ఘటన కేరళలోని తిరువనంతపురంలో చోటుచేసుకుంది. స్థానిక ప్రాంతంలో నివాసం ఉంటున్న డాక్టర్ షహన తాజాగా తన పెళ్లి వరకట్నం కారణంగా ఆగిపోవడంతో మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకుని బలాన్మరణానికి పాల్పడింది. వరుడు అడిగినంత కట్నం ఇవ్వలేకపోవడంతో డాక్టర్స్ షహనా ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం.

షహన కేరళలోని తిరువనంతపురం మెడికల్ కాలేజీలో సర్జరీ పూర్తి చేసింది. షహన తండ్రి రెండేళ్ల క్రితమే చనిపోయాడు. దీంతో షహాన తన తల్లి తోబుట్టులతో కలిసి నివాసం ఉంటుంది. తిరువనంతపురం మెడికల్ కాలేజీలో చదువుకుంటున్న సమయంలో అదే కాలేజీకి చెందిన పీజీ డాక్టర్స్ అసోసియేషన్ ప్రతినిధి రువైస్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడి అది కాస్త ప్రేమగా మారింది. ఈ నేపథ్యంలోనే చదువు అనంతరం ఇరు కుటుంబాల అంగీకారంతో పెద్దల సమక్షంలో వీరు వివాహం చేసుకోవడానికి నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలోనే అబ్బాయి కుటుంబం బంగారం భూమి bmw కార్ రూపంలో భారీ కట్నాన్ని డిమాండ్ చేశారు. 150 గ్రాముల బంగారం, 15 ఎకరాల భూమి, బిఎండబ్ల్యూ కారు కట్నంగా అడిగారు. అయితే ఇంత భారీ కట్నాన్ని షహన కుటుంబం ఇవ్వలేకపోయింది.

దీంతో రువైస్ కుటుంబం వెంటనే పెళ్లిని రద్దు చేసుకున్నారు. అయితే పెళ్లి క్యాన్సిల్ అవడంతో మనస్థాపానికి గురైన షహన ఆత్మహత్యకు పాల్పడిందని స్థానికులు చెబుతున్నారు. అంతేకాక తన ఆత్మహత్యకు గల కారణాలేంటి అనే విషయాలను షహన డెత్ నోట్ లో రాసి చనిపోయినట్లుగా తెలుస్తోంది. షహన అపార్ట్మెంట్లో లభించిన ఆ సూసైడ్ నోట్ ను పోలీసు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ ఘటనపై రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వీణ ఛార్జ్ స్పందించడం జరిగింది. వరకట్న వేధింపులకు గురైన బాధితురాలు మృతి పై తీవ్ర విచారణకు ఆదేశించడం జరిగింది. దీంతో పోలీసు అధికారులు రువైస్ మరియు అతని కుటుంబ సభ్యులపై పలు రకాల సెక్షన్లను నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నారు.