Bharat Bandh : నేడు భారత్ బంద్…

Bharat Bandh : రైతుల పట్ల కేంద్ర ప్రభుత్వం వైఖరిని ఖండిస్తూ సంయుక్త కిసాన్ మోర్చా ఫిబ్రవరి 16న వారి యొక్క డిమాండ్లను కేంద్ర ప్రభుత్వానికి విన్నపిస్తూ గ్రామీణ భారత్ బంద్ చేపట్టడం జరిగింది. దీంతో దేశవ్యాప్తంగా ఈరోజు బందుకు మద్దతు తెలపాలని రైతు సంఘాలు కోరుతున్నాయి. ఇక ఈ భారత్ బంద్ ఫిబ్రవరి 16న ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు గ్రామీణ భారత్ బంద్ పేరుతో సమ్మె నిర్వహించనున్నట్లు సమాచారం. […]

  • Published On:
Bharat Bandh : నేడు భారత్ బంద్…

Bharat Bandh : రైతుల పట్ల కేంద్ర ప్రభుత్వం వైఖరిని ఖండిస్తూ సంయుక్త కిసాన్ మోర్చా ఫిబ్రవరి 16న వారి యొక్క డిమాండ్లను కేంద్ర ప్రభుత్వానికి విన్నపిస్తూ గ్రామీణ భారత్ బంద్ చేపట్టడం జరిగింది. దీంతో దేశవ్యాప్తంగా ఈరోజు బందుకు మద్దతు తెలపాలని రైతు సంఘాలు కోరుతున్నాయి. ఇక ఈ భారత్ బంద్ ఫిబ్రవరి 16న ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు గ్రామీణ భారత్ బంద్ పేరుతో సమ్మె నిర్వహించనున్నట్లు సమాచారం. ఇక ఇదే రోజు పంజాబ్ లో రాష్ట్ర జాతీయ రహదారులను మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4 వరకు మూసి వేయనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సమాచారాన్ని నిరసనకారులు స్పష్టం చేశారు. అయితే దేశవ్యాప్తంగా చేపడుతున్న ఈ గ్రామీణ భారత్ బందులో గ్రామంలోని ప్రభుత్వ , ప్రైవేటు కార్యాలయాలు మరియు దుకాణాలు కూడా మూసి వేయబడతాయి.

వ్యవసాయ కార్యకలాపాలు మరియు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం , గ్రామీణ పనులు, గ్రామీణ పరిశ్రమలు సేవా రంగ సంస్థలు కూడా మూసి వేయబడతాయి.  ఇది ఇలా ఉండగా అంబులెన్సులు , పాఠశాలలు , విద్యాసంస్థలు , ఫార్మసీలు , మరియు ఎమర్జెన్సీ సేవలు అందించే ప్రతి సంస్థలు శుక్రవారం రోజు యధావిధిగా పనిచేస్తాయని తెలుస్తోంది. ఈ క్రమంలోనే బ్యాంకులు కూడా తెరిచి ఉంటాయని స్పష్టం అవుతుంది. ఇది ఇలా ఉండగా పంజాబ్ , రాజస్థాన్ , హర్యానా మరియు యూపీ రైతులు ఢిల్లీని ముట్టడించేందుకు వస్తున్నాయి. ఈ క్రమంలోనే రైతులను ఎక్కడికక్కడ కట్టడి చేసేందుకు భారీ ఎత్తున పోలీస్ బలగాలు రంగంలోకి దిగాయి. రైతులను ఢిల్లీలో అడుగుపెట్టకుండా మోడీ ప్రభుత్వం ఢిల్లీకి వచ్చే సరిహద్దులను అన్నిటిని మూసి వేయడం జరిగింది. ఈ క్రమంలోనే భారీ ఎత్తున ఆయుధాలను కూడా రెడీ చేస్తుంది.

రైతులు ఢిల్లీ వైపుగా వచ్చినట్లయితే వారిని చల్లాచెదురు చేసేందుకు ఏకంగా 30 వేల టియర్ గ్యాస్ సేల్స్ ను సిద్ధంగా పెట్టుకున్నట్లు సమాచారం. ఇక ఈ గ్యాస్ సెల్స్ ను బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ నుంచి తీసుకొచ్చినట్లుగా తెలుస్తోంది. పలు ప్రాంతాలలో ఇప్పటికే వీటిని వినియోగిస్తున్నారు కూడా. అయితే ఈ టియర్ గ్యాస్ ను ఉపయోగించడం ద్వారా గుంపులను చెదరగొట్టడంతో పాటు , కళ్ళ మంట చికాకు తో రైతులు ముందుకు రాకుండా అడ్డుకుంటుంది. ఈ క్రమంలోనే రైతులను అడ్డుకునేందుకు టియర్ గ్యాస్ ప్రయోగం అనేది వ్యూహంగా ఎలాంటి ఆయుధాలు ఉపయోగించకుండా వీటి ద్వారా రైతులను పోలీసులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలోనే రబ్బర్ బుల్లెట్ల కంటే కూడా టియర్ గ్యాస్ ప్రయోగం రైతులను అడ్డుకుంటుందనేది పోలీసుల యాక్షన్ ప్లాన్.