Viral Video : ఎయిర్ పోర్ట్ లో బ్యాగేజీ బెల్ట్ పై ఎక్కిన బుడ్డోడు…చివరికి ఏం జరిగిందంటే…

Viral Video : చిన్నపిల్లలని ప్రతి నిమిషం కంట కనిపెడుతూ ఉండాలి. మరి ముఖ్యంగా బయటకు వెళ్ళినప్పుడు వారిని అసలు విడిచిపెట్టకూడదు. ఎందుకంటే బయట ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక చిన్న పిల్లలకు ఏమి తెలియదు కాబట్టి ఎటుపడితే అటు పరుగులు పెడుతూ ఉంటారు. కాబట్టి వారిని కేర్ఫుల్ గా చూసుకోవాల్సిన బాధ్యత పేరెంట్స్ కచ్చితంగా ఉంటుంది. అయితే తాజాగా చిలిలోని ఒక ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లో ఓ చిన్న పిల్లాడి విషయంలో […]

  • Published On:
Viral Video : ఎయిర్ పోర్ట్ లో బ్యాగేజీ బెల్ట్ పై ఎక్కిన బుడ్డోడు…చివరికి ఏం జరిగిందంటే…

Viral Video : చిన్నపిల్లలని ప్రతి నిమిషం కంట కనిపెడుతూ ఉండాలి. మరి ముఖ్యంగా బయటకు వెళ్ళినప్పుడు వారిని అసలు విడిచిపెట్టకూడదు. ఎందుకంటే బయట ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక చిన్న పిల్లలకు ఏమి తెలియదు కాబట్టి ఎటుపడితే అటు పరుగులు పెడుతూ ఉంటారు. కాబట్టి వారిని కేర్ఫుల్ గా చూసుకోవాల్సిన బాధ్యత పేరెంట్స్ కచ్చితంగా ఉంటుంది. అయితే తాజాగా చిలిలోని ఒక ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లో ఓ చిన్న పిల్లాడి విషయంలో తల్లిదండ్రుల నిర్లక్ష్యం వహించారు.

baby-on-the-baggage-belt-at-the-airport-video-viral

ఆ బాలుడు ఎటు పోతున్నాడు ఏం చేస్తున్నాడు అనేది పట్టించుకోకుండా వదిలేశారు. ఇక అంతే సంగతి వాడు ఏకంగా వచ్చి బ్యాగేజీ కన్వేయర్ బెల్ట్ పైకి ఎక్కి కూర్చున్నాడు.ఆ సమయంలో బెల్టు కూడా చాలా వేగంగా తిరుగుతూ ఉంది. అయినా సరే బుడ్డోడు భయం లేకుండా దానిపై ఎక్కి కూర్చొని ప్రయాణం చేశాడు. అయితే దానికి సంబంధించిన భయంకర దృశ్యాలు కెమెరాకు చిక్కి అవికాస్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. ఆ వీడియోలో గమనించినట్లయితే ఒ చిన్నారి విమానాశ్రమంలోని నిషేధిత ప్రాంతంలోకి ఎలా వచ్చాడో తెలియదు కానీ కన్వేయర్ బిల్ట్ పైకెక్కి కూర్చున్నాడు. ఇక ఆ బెల్ట్ పైన చాలా దూరం వరకు ప్రయాణం చేశాడు.

baby-on-the-baggage-belt-at-the-airport-video-viral

అయితే అప్రమత్తమైన ఎయిర్పోర్ట్ ఉద్యోగులు పిల్లాడిని ఎలాంటి గాయాలు లేకుండా రక్షించారు. చిలిలోని అతిపెద్ద విమానాశ్రమాలలో ఒకటైన అర్టురో మెరీనో బెనిటేజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో నవంబర్ 16న ఈ ఘటన చోటుచేసుకుంది. ఇక ఈ ఘటనపై ఎయిర్పోర్ట్ అధికారులు మాట్లాడుతూ సంఘటన ఎలా జరిగింది అనే దానిపై దర్యాప్తు చేస్తున్నట్లుగా తెలియజేశారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా ఉండేందుకు ఎయిర్ లైన్ ఆపరేటర్లతో భద్రత చర్యలు తీసుకుంటామని ప్రోటోకాల్ బలోపేతం చేస్తామని తెలియజేశారు. అయితే దీనికి సంబంధించిన వీడియో ని క్రేజీ క్లిప్స్ ట్విట్టర్ ఖాతా నుండి షేర్ చేయగా అది కాస్త వైరల్ గా మారింది.