Ayodhya Sriram : అయోధ్య నుండి మీ ఇంటికి వచ్చిన రాముని అక్షింతలను ఎం చేయాలి….?

Ayodhya Sriram : అయోధ్య నుండి మీ ఇంటికి వచ్చిన రామయ్య అక్షింతలను ఇలా చేస్తే చాలు మీ ఇంట్లో అన్ని శుభాలే. అయితే అయోధ్య నుండి మీ ఇంటికి వచ్చిన అక్షింతలు ఏం చేయాలి…? వాటితో ఎలాంటి శుభ ఫలితాలు పొందుతారు..? వాటి విశిష్టత ఏమిటి అంటే అయోధ్య రాముని జన్మ భూమి. ఎన్నో తరాల వారికి ఆదర్శ పురుషుడిగా జన్మించిన రాముడు జన్మస్థలంలో రామ మందిరం తొలిదశ పూర్తయింది. రామ మందిరం నిర్మాణం జరుగుతుంది. […]

  • Published On:
Ayodhya Sriram : అయోధ్య నుండి మీ ఇంటికి వచ్చిన రాముని అక్షింతలను ఎం చేయాలి….?

Ayodhya Sriram : అయోధ్య నుండి మీ ఇంటికి వచ్చిన రామయ్య అక్షింతలను ఇలా చేస్తే చాలు మీ ఇంట్లో అన్ని శుభాలే. అయితే అయోధ్య నుండి మీ ఇంటికి వచ్చిన అక్షింతలు ఏం చేయాలి…? వాటితో ఎలాంటి శుభ ఫలితాలు పొందుతారు..? వాటి విశిష్టత ఏమిటి అంటే అయోధ్య రాముని జన్మ భూమి. ఎన్నో తరాల వారికి ఆదర్శ పురుషుడిగా జన్మించిన రాముడు జన్మస్థలంలో రామ మందిరం తొలిదశ పూర్తయింది. రామ మందిరం నిర్మాణం జరుగుతుంది. రామ మందిరంలో రామయ్య అందరికీ దర్శనం ఇవ్వనున్నారు. జనవరి 22వ తేదీన ప్రారంభోత్సవానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. దేవాలయం ప్రారంభోత్సవం కోసం దేశ ప్రజలందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే అయోధ్య రామ మందిరంలో విగ్రహాలకు ఎంతో ప్రత్యేకత ఉన్నది. ప్రస్తుతం అయోధ్య రామ మందిరంలో మూడు విగ్రహాలు అందుబాటులో ఉన్నాయి. ఇందులో ఏది ప్రధానమైనది ఇంకా నిర్ణయించలేదు.

మొత్తానికి మూడు వేరువేరు విగ్రహాలను రూపొందిస్తున్నారు. వీటిలో రెండు శిలలు కర్ణాటక రాష్ట్రం నుండి రాగా ఒకటి రాజస్థాన్ కు చెందింది. వీటిలో ఏది ఉత్తమమైనదో రామ మందిరం ట్రస్ట్ నిర్ణయిస్తుంది. రామాయణం మరియు మహాభారతం అంటే పురాతన గ్రంధాల్లో వాటి ప్రస్తావన అయోధ్య హిందువులకు ముఖ్యమైన తీర్థ యాత్రగా మారింది. నగరం యొక్క సంస్కృతి గుర్తింపు మరియు దాని చరిత్ర మతపరమైన ప్రాముఖ్యత తో గుర్తుగా ముడిపడి ఉంది. ఇక ఈ అయోధ్య యాత్రికులు చరిత్ర కారులు మరియు పర్యాటకు లను ఆకర్షిస్తుంది. అయితే అయోధ్య నుండి వచ్చిన అక్షింతలను ఏం చేయాలి అనే అనుమానం ప్రతి ఒక్కరిలో ఉంటుంది. అయితే అక్షింతలు ఇంటికి వచ్చే లోపే ఇంట్లో కొన్ని అక్షింతలు తయారు చేసుకుని పెట్టుకోవాలి. అందులో అయోధ్య నుండి వచ్చిన అక్షింతలను కలుపుకోవాలి.

అలా కలుపుకున్న అక్షింతలను జనవరి 22వ తేదీన అయోధ్యలో శ్రీ బాల రాముని ప్రాణ ప్రతిష్ట జరుగుతున్న సమయంలో కుటుంబంలో అందరూ ఇల్లు కడుక్కోని తలస్నానాలు చేసి గ్రామంలోని దేవాలయాలకు వెళ్లి పూజ ముగించుకున్న తర్వాత వ్యక్తిగతంగా కొన్ని అక్షతలు తల మీద వేసుకోవాలి. కుటుంబంలో ఎవరైతే ఉన్నారో వారి పెళ్లి రోజున పిల్లల పుట్టిన రోజున మరియు ఎటువంటి శుభకార్యాలు అయినా వారిని ఈ అక్షింతలతో దీవించాలి. ఎవరైనా ఆశీర్వాదం కోసం మీ ఇంటికి ముందుకు వస్తే కొన్ని అక్షింతలు వేసి వారిని దీవించవచ్చు. అయితే జనవరి 22వ తేదీన దగ్గరలో ఉన్న దేవాలయలలో ఉదయం 11 గంటలకు అయోధ్య రామ మందిర ప్రతిష్టను చూడడానికి ఏర్పాట్లు చేయడం జరిగింది. దాని తర్వాత హారతి ప్రసాదు ఇవ్వడం కూడా జరుగుతుంది. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులందరూ కూడా పాల్గొని ఇంటి చుట్టుపక్కల ఉన్న భక్తులకు దేవాలయానికి రావాలి అని మీరు ఆహ్వానించాలి. ఆరోజు సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత ఇంటి ముందు 5 దీపాలు వెలిగించాలి. లేకపోతే విద్యుత్ దీపాల తో అలంకరించాలి దీపావళి పండుగ రోజున మీరు ఎలా అయితే చేసుకుంటారు 22వ తేదీన అలా జరుపుకోవాలి.