Virat Kohli – Anushka Sharma : మరోసారి తల్లిదండ్రులు కాబోతున్న అనుష్క విరాట్ కోహ్లీ….

Virat Kohli – Anushka Sharma : టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ గురించి మనందరికీ తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా అతనికి ఎంత మంది అభిమాని ఉన్నారో మాటల్లో చెప్పాల్సిన పనిలేదు. మన చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ లో కూడా విరాట్ కోహ్లీని ఎంతో ఆరాధిస్తారు. ఇక అలాంటి విరాట్ కోహ్లీకి సంబంధించిన న్యూస్ ఏదైనా బయటికిి వచ్చింది అంటే చాలు క్షణాల్లోనే వైరల్ అవడం ఖాయం. ఈ క్రమంలోనే ఇప్పుడు టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ […]

  • Published On:
Virat Kohli – Anushka Sharma : మరోసారి తల్లిదండ్రులు కాబోతున్న అనుష్క విరాట్ కోహ్లీ….

Virat Kohli – Anushka Sharma : టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ గురించి మనందరికీ తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా అతనికి ఎంత మంది అభిమాని ఉన్నారో మాటల్లో చెప్పాల్సిన పనిలేదు. మన చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ లో కూడా విరాట్ కోహ్లీని ఎంతో ఆరాధిస్తారు. ఇక అలాంటి విరాట్ కోహ్లీకి సంబంధించిన న్యూస్ ఏదైనా బయటికిి వచ్చింది అంటే చాలు క్షణాల్లోనే వైరల్ అవడం ఖాయం. ఈ క్రమంలోనే ఇప్పుడు టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ మరోసారి తండ్రి కాబోతున్నాడు అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు ప్రచారం జరుగుతున్నాయి.అయితే మనకు తెలిసిందే బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ మరియు విరాట్ కోహ్లీ కొన్నాళ్లపాటు ప్రేమాయణం సాగించిన అనంతరం 2017లో మూడుముళ్ల బంధంతో ఒకటయ్యారు. ఇక 2021లో వీరికి వామిక అనే పాప కూడా జన్మించింది. ఇక ఆ పాపకు సంబంధించిన ఫోటోలను మాత్రం ఇప్పటివరకు చూపించలేదు.

anushka-virat-are-going-to-be-parents-again

ఇది ఇలా ఉండగా విరాట్ కోహ్లీ మరోసారి తండ్రి కాబోతున్నాడని సోషల్ మీడియాలో వార్తలు ప్రచారం జరుగుతున్నాయి. గత కొన్ని రోజుల క్రితం విరాట్ కోహ్లీ మరియు అనుష్క శర్మ దంపతులు ముంబైలోని ఒక గైనకాలజిస్ట్ క్లినిక్ కు వెళ్లినట్లు తెలుస్తోంది. దీంతో అనుష్క శర్మ ప్రెగ్నెంట్ అని పెద్ద ఎత్తున ప్రచారం మొదలైంది. ఇక ఈ విషయంపై త్వరలోనే విరుష్క దంపతులు అధికారికంగా ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక నవంబర్ 5 న విరాట్ కోహ్లీ పుట్టినరోజు సందర్భంగా ఈ శుభవార్తను అభిమానులతో పంచుకునే అవకాశం ఉందని అందరూ భావిస్తున్నారు. అంతేకాక ఇటీవల వినాయకుని పూజ లో విరుష్క దంపతులు దిగిన ఫోటోలలో అనుష్క బేబీ బాంప్ కనిపిస్తుంది అంటూ ,మరోసారి వీరు తల్లిదండ్రులు కాబోతున్నారంటూ అంటూ ఓ నేటిజన్ కామెంట్ చేస్తూ పోస్ట్ చేశాడు. దీంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది.

anushka-virat-are-going-to-be-parents-again

ఇది ఇలా ఉండగా ప్రస్తుతం విరాట్ కోహ్లీ వన్డే ప్రపంచ కప్ కోసం సిద్ధమవుతున్నాడు. టీమిండియా విజేతగా నిలవాలంటే విరాట్ కోహ్లీ ఫామ్ ఎంతో కీలకం. ఎన్నో సంవత్సరాల తర్వాత గతేడాది ఆసియా కప్ తో ఫామ్ లోకి వచ్చిన కోహ్లీ సెంచరీలతో సత్తా చాటుతున్నాడు. ఈ క్రమంలో ఇటీవల ఆసియా కప్ లో పాకిస్తాన్ పై జరిగిన మ్యాచ్లో 122 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. ఇక ఇప్పుడు వన్డే ప్రపంచ కప్ కోసం తలపడేందుకు సిద్ధంగా ఉన్నాడు. అనుష్క శర్మ కూడా గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంది. తన సమయాన్ని వామిక కోసం కేటాయిస్తూ అప్పుడప్పుడు కోహ్లీ ఆడుతున్న స్టేడియలకు వచ్చి అతడిని ప్రోత్సహిస్తుంది. ఏది ఏమైనాప్పటికీ మరోసారి కోహ్లీ దంపతులు తల్లిదండ్రులు కాబోతున్నారు అనే వార్త అభిమానులను ఎంతో ఆనందింప చేస్తుంది. ఇక ఈ శుభవార్తను ఎప్పుడూ చెబుతారా అంటూ అందరూ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.