Yash : మరో పాన్ ఇండియా సినిమాతో రాకింగ్ స్టార్ యాష్… టైటిల్ కూడా వచ్చేసిందిగా…

Yash : కేజిఎఫ్ వంటి సినిమాతో భారీ బ్లాక్ బాస్టర్ హిట్ అందుకోవడమే కాక అన్ని రకాల భాషల్లో తనకంటూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు రాకింగ్ స్టార్ యాష్. అయితే అంతటి సక్సెస్ అందుకోవడానికి ముఖ్య కారణం రెండు భాగాలుగా వచ్చిన కేజిఎఫ్ సినిమా అని చెప్పాలి. ఇక ఈ సినిమా సంచలన విజయాన్ని అందుకోవడమే కాక కలెక్షన్స్ పరంగా కూడా రికార్డులను బ్రేక్ చేసింది. ఈ నేపథ్యంలోనే రాకింగ్ స్టార్ పై ప్రేక్షకులలో భారీ […]

  • Published On:
Yash : మరో పాన్ ఇండియా సినిమాతో రాకింగ్ స్టార్ యాష్… టైటిల్ కూడా వచ్చేసిందిగా…

Yash : కేజిఎఫ్ వంటి సినిమాతో భారీ బ్లాక్ బాస్టర్ హిట్ అందుకోవడమే కాక అన్ని రకాల భాషల్లో తనకంటూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు రాకింగ్ స్టార్ యాష్. అయితే అంతటి సక్సెస్ అందుకోవడానికి ముఖ్య కారణం రెండు భాగాలుగా వచ్చిన కేజిఎఫ్ సినిమా అని చెప్పాలి. ఇక ఈ సినిమా సంచలన విజయాన్ని అందుకోవడమే కాక కలెక్షన్స్ పరంగా కూడా రికార్డులను బ్రేక్ చేసింది. ఈ నేపథ్యంలోనే రాకింగ్ స్టార్ పై ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. దీంతో కేజిఎఫ్ 2 తర్వాత యాష్ ఎవరితో సినిమా చేయనున్నారు అనే అంశాలు తీవ్ర ఆసక్తికరంగా మారాయి. అంతేకాక ఇప్పటివరకు యాష్ తన కొత్త సినిమాను అనౌన్స్ కూడా చేయలేదు. దీంతో యాష్ కొత్త సినిమాపై ఆయన అభిమానులు విపరీతంగా ఆశలు పెట్టుకున్నారు.

Image

ఈ క్రమంలోనే యాష్-19 కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగా యాష్ నెక్స్ట్ సినిమా ఏంటి అనేది అనౌన్స్ చేశాడు. యాష్ తన 19వ సినిమాగా టాక్సీక్ అనే టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇక ఈ టైటిల్ విన్న అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. ఇక ఈ సినిమా కూడా పాన్ ఇండియా సినిమా అవడంతో టైటిల్ సరిగ్గా సరిపోయింది అంటూ అభిమానులు అభిప్రాయ వ్యక్తం చేస్తున్నారు. అయితే కేజీఎఫ్ 2 సినిమా ఏప్రిల్ 2022 లోనే విడుదలైంది. ఇక దీని తర్వాత యాష్ సినిమా గురించి చాలా పుకార్లు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే యాష్ తర్వాత సినిమాను నర్తన్ దర్శకత్వం వహిస్తున్నట్లుగా వార్తలు కూడా వచ్చాయి .

కానీ అవేవీ నిజాలు కాలేదు. కేజిఎఫ్ 2 విడుదలైన ఏడాదిన్నర తర్వాత యాష్ తన కొత్త సినిమా టైటిల్ ను తాజాగా ప్రకటించడం విశేషం. టాక్సీక్ అనే టైటిల్ తో వస్తున్న ఈ సినిమాను గీతు మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ పోస్టర్ను చూసి అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. ఇక ఈ సినిమాను 10-4-2025లో విడుదల చేసేందుకు సినీ బృందం ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. దీంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో టాక్సిక్ ట్రెండింగ్ లో ఉంది. ఇక ఈ సినిమా కన్నడ తో పాటు పలు భాషల్లో విడుదల కానుంది. యాక్షన్ ఎంటర్టైనర్ తెరకేక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొనగా సినిమాలో నటీమణుల గురించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.