Hanuman Movie : హనుమాన్ సినిమా చూస్తూ విచిత్రంగా ప్రవర్తించిన మహిళ…

Hanuman Movie : సంక్రాంతికి ఈసారి బరిలో దిగిన సినిమాలు అన్ని సైలెంట్ అయిపోయాయి. కానీ హనుమాన్ సినిమా మాత్రం ఇప్పటికి థియేటర్లో హౌస్ ఫుల్ రన్ అవుతుంది.ఇక ఈ సినిమా ఇప్పటికే 250 కోట్లకు పైగా వసూలు చేసింది. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా లో తేజ సజ్జ హీరోగా నటించాడు. ఇతిహాసాల నేపథ్యంలో సూపర్ హీరో కథగా ఈ సినిమాను ప్రశాంత్ వర్మ హనుమంతుడి నేపథ్యంలో తెరకేకిచ్చాడు. ప్రశాంత్ వర్మ తీసిన […]

  • Published On:
Hanuman Movie : హనుమాన్ సినిమా చూస్తూ విచిత్రంగా ప్రవర్తించిన మహిళ…

Hanuman Movie : సంక్రాంతికి ఈసారి బరిలో దిగిన సినిమాలు అన్ని సైలెంట్ అయిపోయాయి. కానీ హనుమాన్ సినిమా మాత్రం ఇప్పటికి థియేటర్లో హౌస్ ఫుల్ రన్ అవుతుంది.ఇక ఈ సినిమా ఇప్పటికే 250 కోట్లకు పైగా వసూలు చేసింది. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా లో తేజ సజ్జ హీరోగా నటించాడు. ఇతిహాసాల నేపథ్యంలో సూపర్ హీరో కథగా ఈ సినిమాను ప్రశాంత్ వర్మ హనుమంతుడి నేపథ్యంలో తెరకేకిచ్చాడు. ప్రశాంత్ వర్మ తీసిన ఈ సినిమా చిన్న సినిమాగా వచ్చి సంచలనం సృష్టించింది. జనవరి 12న విడుదలైన ఈ సినిమా రికార్డు కలెక్షన్లను సాధిస్తుంది. సామాన్యుడికి స్పెషల్స్ పవర్ వచ్చి సూపర్ హీరోల ఎలా మారాడు…? ఆ పవర్ తో జనాలను ఎలా కాపాడాడు అని ఈ సినిమాలో చూపించాడు ప్రశాంత్ వర్మ.

అయితే ఈ సినిమా చివరి లో హనుమంతుడు రావడం హైలెట్ అని చెప్పాలి. చివరి 40 నిమిషాలు ప్రేక్షకులను సీట్ లో కూర్చొనివ్వకుండా చేసింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఒక మహిళ హనుమాన్ సినిమా చూస్తూ విచిత్రంగా ప్రవర్తించింది. ఉన్నట్లుండి సీట్లో నుంచి లేచి అరవడం మొదలు పెట్టింది. ఆమె అలా చేయడం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. అయితే కొంతమంది ఆమెకు ఫిట్స్ వచ్చాయని అంటున్నారు. మరికొందరు సినిమా చూస్తూ అలా గురైంది అంటున్నారు. మరికొందరు పూనకం వచ్చింది అని అంటున్నారు. సరిగ్గా సినిమా క్లైమాక్స్ కి ఆమె అలా అరవడం , విచిత్రంగా చేయడంతో అందరిలోనూ అలజడ రేపింది. అయితే ఈ అనూష ఘటన హైదరాబాదులోని ఉప్పల్ లో చోటుచేసుకుంది.