Renu Desai : పవన్ కళ్యాణ్ సీఎం అవుతారా…?స్పందించిన రేణు దేశాయ్..

Renu Desai : పవన్ కళ్యాణ్ మాజీ భార్య , ప్రముఖ నటి  రేణు దేశాయ్ ఇటీవల టైగర్ నాగేశ్వరరావు సినిమాలో నటించి సినీ ఇండస్ట్రీలోకి మరల ఎంట్రీ ఇచ్చింది. మాస్ మహారాజ రవితేజ ప్రధాన పాత్ర పోషించిన ఈ సినిమా ఇటీవల విడుదలైంది.ఇక ఈ సినిమాలో ప్రముఖ సంఘసంస్కర్త హేమలత లవణం పాత్రలో రేణు దేశాయ్ కనిపించడం జరిగింది. అయితే మూవీ ప్రమోషన్స్ లో భాగంగా రేణు దేశాయ్ పలు ఇంటర్వ్యూస్ లో పాల్గొనడం జరిగింది. అయితే […]

  • Published On:
Renu Desai : పవన్ కళ్యాణ్ సీఎం అవుతారా…?స్పందించిన రేణు దేశాయ్..

Renu Desai : పవన్ కళ్యాణ్ మాజీ భార్య , ప్రముఖ నటి  రేణు దేశాయ్ ఇటీవల టైగర్ నాగేశ్వరరావు సినిమాలో నటించి సినీ ఇండస్ట్రీలోకి మరల ఎంట్రీ ఇచ్చింది. మాస్ మహారాజ రవితేజ ప్రధాన పాత్ర పోషించిన ఈ సినిమా ఇటీవల విడుదలైంది.ఇక ఈ సినిమాలో ప్రముఖ సంఘసంస్కర్త హేమలత లవణం పాత్రలో రేణు దేశాయ్ కనిపించడం జరిగింది. అయితే మూవీ ప్రమోషన్స్ లో భాగంగా రేణు దేశాయ్ పలు ఇంటర్వ్యూస్ లో పాల్గొనడం జరిగింది. అయితే ఈ ఇంటర్వ్యూలో రేణు దేశాయ్ కు ఓ ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. పవన్ కళ్యాణ్ సీఎం అవ్వాలని కోరుకుంటున్నారా..? అన్న ప్రశ్నకు రేణు దేశాయ్ స్పందించింది.

will-pawan-kalyan-become-cm-renu-desai-responded

ఈ ప్రశ్నకు సమాధానంగా ఆమె మాట్లాడుతూ…ఇలాంటి క్వశ్చన్ వద్దు అన్నారు.పవన్ సీఎం అవుతారా లేదా అన్నది నాకేం సంబంధం ఈ విషయంలో నేనేం కోరుకోవడం లేదని ఆమె వ్యాఖ్యానించారు. ఆయన సీఎం కావాలా వద్ద అనేది ప్రజలు నిర్ణయిస్తారు దేవుడు నిర్ణయిస్తాడని ఆమె చెప్పుకొచ్చింది. ఎవరికి ఎలా రాసిపెట్టి ఉంటే అలా జరుగుతుంది అంటూ అభిప్రాయ వ్యక్తం చేసింది. అయితే పవన్ కళ్యాణ్ కోసం మీరు స్టాండ్ తీసుకోరా అంటూ యాంకర్ ప్రశ్నించగా…ఎవరి గురించి ఎలాంటి స్టాండ్ తీసుకోవాల్సిన అవసరం నాకు లేదంటూ రేణు దేశాయ్ స్పష్టం చేశారు. అయితే పవన్ కళ్యాణ్ సీఎం అవుతారా లేదా అన్న అంశంపై రేణు దేశాయ్ స్పందించడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ క్రమంలోనే పవన్ సీఎం అవడం రేణు దేశాయ్ కి ఇష్టం లేదంటూ అందుకే ఆమె అలా మాట్లాడుతుందంటూ నేటిజనులు కామెంట్స్ చేస్తున్నారు.

will-pawan-kalyan-become-cm-renu-desai-responded

ఇదిలా ఉండగా మోడలింగ్ రంగం ద్వారా తెలుగు సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రేణు దేశాయ్ పవన్ కళ్యాణ్ తో కలిసి తాను నటించిన మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని కైవసం చేసుకుంది. డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శత్వంలో వచ్చిన బద్రి సినిమా లోనే రేణు దేశాయ్ మరియు పవన్ ప్రేమలో పడ్డారు. చాలా కాలం పాటు ప్రేమించుకున్న వీరు పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకుని కొన్నాళ్లపాటు సహజీవనం సాగించినప్పటికీ కాపురంలో మనస్పర్ధలు వచ్చి విడిపోయారు. అనంతరం పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా మారగా, తాజాగా రేణు దేశాయ్ సినిమాల వైపు అడుగులు వేస్తున్నారు.