Chandra Mohan : చంద్రమోహన్ అంతక్రియలు ఆలస్యం అవ్వడానికి అసలు కారణం ఏంటి…?
Chandra Mohan : ప్రముఖ సీనియర్ నటుడు అలనాటి హీరో చంద్రమోహన్ హఠాత్ మరణం తెలుగు సినీ ఇండస్ట్రీని తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యేలా చేసింది. గద కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న చంద్రమోహన్ శనివారం నవంబర్ 11 తెల్లవారుజామున కన్నుమూశారు. సీనియర్ నటుడు మృతితో టాలీవుడ్ తల్లడిల్లిపోయింది. సినీ ఇండస్ట్రీ తో పాటు తెలుగు రాష్ట్ర సీఎంలు పలువురు సినీ మరియు రాజకీయ ప్రముఖులు కూడా చంద్రమోహన్ మృతి పై తీవ్ర విచార వ్యక్తం చేశారు. ఆయన […]
Chandra Mohan : ప్రముఖ సీనియర్ నటుడు అలనాటి హీరో చంద్రమోహన్ హఠాత్ మరణం తెలుగు సినీ ఇండస్ట్రీని తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యేలా చేసింది. గద కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న చంద్రమోహన్ శనివారం నవంబర్ 11 తెల్లవారుజామున కన్నుమూశారు. సీనియర్ నటుడు మృతితో టాలీవుడ్ తల్లడిల్లిపోయింది. సినీ ఇండస్ట్రీ తో పాటు తెలుగు రాష్ట్ర సీఎంలు పలువురు సినీ మరియు రాజకీయ ప్రముఖులు కూడా చంద్రమోహన్ మృతి పై తీవ్ర విచార వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు. అయితే ప్రస్తుతం చంద్రమోహన్ గారి భౌతికకాయాన్ని ఫిల్మ్ ఛాంబర్ లో ఉంచడం జరిగింది.
అయితే తాజాగా చంద్రమోహన్ అంతక్రియలపై కూడా అధికారిక ప్రకటన వచ్చేసింది. చంద్రమోహన్ అంతక్రియలను సోమవారం నవంబర్ 13 న నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలియజేశారు.అంటే చంద్రమోహన్ గారు మరణించిన మూడు రోజులు తర్వాత అంతక్రియలు జరుగుతున్నాయి. అయితే ఆయన అంతక్రియలు ఆలస్యం అవ్వడానికి రెండు కారణాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే చంద్రమోహన్ గారికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్న సంగతి తెలిసిందే. వీరిలో పెద్ద కుమార్తె మధుర మీనాక్షి ప్రస్తుతం అమెరికాలో సైకాలజిస్ట్ గా పని చేస్తున్నారు. ఇక చిన్న కూతురు మాధవి చెన్నైలో సెటిల్ అయింది.
అయితే పెద్ద కూతురు మీనాక్షి అంతక్రియలకు రావడానికి కాస్త ఆలస్యం పడుతుందని సమాచారం. అందుకే పెద్ద కూతురు వచ్చిన తర్వాత అంతక్రియలు నిర్వహించాల్సిందిగా కుటుంబ సభ్యులు నిర్ణయించుకున్నారు. అందుకే రెండు రోజులు తర్వాత అంతక్రియలు నిర్వహించాలని కుటుంబ సభ్యులు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇక ఈ విషయాన్ని అధికారికంగా కూడా ప్రకటించడం జరిగింది. అంతేకాక రెండో కారణం ఏంటంటే ఈ రోజు దీపావళి పండుగ కనుక అంతక్రియలు నిర్వహించడం సరికాదని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.