Venkatesh Daggubati : దగ్గుబాటి ఇంట్లో పెళ్లి భాజలు…ఘనంగా వెంకటేష్ రెండవ కుమార్తె నిశ్చితార్థం….
Venkatesh Daggubati : తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సాధించుకున్నటువంటి ఫ్యామిలీలలో దగ్గుబాటి కుటుంబం ఒకటి. ఇక దగ్గుబాటి కుటుంబం నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చిన వెంకటేష్ – విక్టరీ వెంకటేష్ గా పేరు తెచ్చుకొని వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరించాడు. ఇప్పటికి కూడా వెంకటేష్ సినిమాలలో చేస్తూ సందడి చేస్తున్నారు. అయితే ఇతర హీరోల సినిమాలతో పోలిస్తే వెంకటేష్ చాలా భిన్నమైన సినిమాలు చేస్తాడని చెప్పాలి. సినిమాలలో కాకుండా రియల్ లైఫ్ లో […]
Venkatesh Daggubati : తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సాధించుకున్నటువంటి ఫ్యామిలీలలో దగ్గుబాటి కుటుంబం ఒకటి. ఇక దగ్గుబాటి కుటుంబం నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చిన వెంకటేష్ – విక్టరీ వెంకటేష్ గా పేరు తెచ్చుకొని వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరించాడు. ఇప్పటికి కూడా వెంకటేష్ సినిమాలలో చేస్తూ సందడి చేస్తున్నారు. అయితే ఇతర హీరోల సినిమాలతో పోలిస్తే వెంకటేష్ చాలా భిన్నమైన సినిమాలు చేస్తాడని చెప్పాలి. సినిమాలలో కాకుండా రియల్ లైఫ్ లో కూడా వెంకటేష్ అలాగే ఉంటారు. ఎందుకంటే ఆయన తన ఫ్యామిలీ విషయాలను పెద్దగా ఎవరితోనూ పంచుకోరు. ఈ క్రమంలోనే తన ఫ్యామిలీలో జరిగే ప్రతి కార్యక్రమాన్ని కూడా చాలా గోప్యంగా ఉంచడానికి ఇష్టపడతారు.
ఈ క్రమంలోని తన భార్య పిల్లల గురించి కూడా వెంకటేష్ ఎక్కడ ప్రస్తావించగా చూసింది లేదు. అయితే తాజాగా వెంకటేష్ రెండవ కుమార్తె నిశ్చితార్థం జరిగినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ విషయాన్ని వెంకటేష్ అధికారికంగా ప్రకటించలేదు కానీ నిశ్చితార్థానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో లీక్ అవడంతో అవి కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే విక్టరీ వెంకటేష్ కు ముగ్గురు కుమార్తెలు ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఇంతకుముందే తన పెద్ద కుమార్తె అశ్రిత వివాహం ఘనంగా జరిపించారు. ఈ క్రమంలోనే తన రెండవ కుమార్తె హయవాహినికి కూడా పెళ్లి ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. విజయవాడకు చెందినటువంటి ఒక ప్రముఖ డాక్టర్ కుటుంబంతో వెంకటేష్ వియ్యం అందు కోబోతున్నట్లు సమాచారం.
ఈ క్రమంలోనే వెంకటేష్ రెండో కుమార్తె పెళ్లి జరగబోతుంది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నప్పటికీ ఈ విషయంపై విక్టరీ వెంకటేష్ ఏ విధంగాను స్పందించలేదు. అంతేకాక చాలా సైలెంట్ గా తన కూతురు నిశ్చితార్థాన్ని బుధవారం రోజు విజయవాడ నగరంలో చాలా ఘనంగా నిర్వహించినట్లు తెలుస్తోంది. ఇక ఈ నిశ్చితార్థ వేడుకలకు తెలుగు సినీ ఇండస్ట్రీకి చెందినటువంటి చిరంజీవి సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా హాజరయ్యారని సమాచారం. దీంతో ప్రస్తుతం దీనికి సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే చడి చప్పుడు లేకుండా వెంకటేష్ తన కూతురి పెళ్లి చేయడంతో ఈ వార్తలు మరింత జోరందుకున్నాయి. ఇది ఇలా ఉండగా వెంకటేష్ రెండో అల్లుడికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.