vishnu Priya and Manas romantic dance for Sankranti show : విష్ణు ప్రియ – మానస్ ల రొమాంటిక్ డాన్స్ .. ఈ రేంజ్ లో రొమాన్స్ ఎప్పుడు చూసి ఉండరు ..

vishnu Priya and Manas romantic dance for Sankranti show :ఇటీవల బుల్లితెరపై ప్రసారమయ్యే కార్యక్రమాలన్నీ జనాలను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. సినిమాలను మించి డ్రామా, కామెడీ, రొమాన్స్ అన్ని ఉండేలా ప్రోగ్రామ్స్ లో చూపిస్తున్నారు.

  • Published On:
vishnu Priya and Manas romantic dance for Sankranti show : విష్ణు ప్రియ – మానస్ ల రొమాంటిక్ డాన్స్ .. ఈ రేంజ్ లో రొమాన్స్ ఎప్పుడు చూసి ఉండరు ..

vishnu Priya and Manas romantic dance for Sankranti show :ఇటీవల బుల్లితెరపై ప్రసారమయ్యే కార్యక్రమాలన్నీ జనాలను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. సినిమాలను మించి డ్రామా, కామెడీ, రొమాన్స్ అన్ని ఉండేలా ప్రోగ్రామ్స్ లో చూపిస్తున్నారు. దీంతో ఆ షోలు హిట్ అవుతున్నాయి. ఇకపోతే షోలు అనగానే అందరికీ ముందుగా గుర్తుచేది ఈటీవీ. ప్రతి పండక్కి ఒక ఈవెంట్ ఉండేలా ప్లాన్ చేస్తుంది ఈటీవీ. ఇటీవల న్యూ ఇయర్ సందర్భంగా ఓ ప్రోగ్రాం చేసి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇక త్వరలోనే సంక్రాంతి రాబోతుంది. దీని సందర్భంగా మంచి రోజులు వచ్చాయి పేరుతో ప్రోగ్రాంనీ ప్లాన్ చేసింది ఈటీవీ. అందుకు సంబంధించిన ప్రోమో ని ఒక్కొక్కటిగా విడుదల చేస్తున్నారు.

తాజాగా విడుదలైన ప్రోమోలో విష్ణు ప్రియ, మానస్ ల రొమాంటిక్ డాన్స్ అందరిని ఆకర్షించింది. బుల్లితెరపై పోవే పోరా ప్రోగ్రాం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది యాంకర్ విష్ణు ప్రియ. సుడిగాలి సుదీర్ కు కో యాంకర్ గా చేసిన విష్ణు ప్రియ ఇప్పుడు ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. టీవీలోకి రాకముందు విష్ణు ప్రియ షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ ఉండేది. ఆ తర్వాత ఎన్నో షోలు చేసి ఇటీవల సుడిగాలి సుధీర్ తో పండుగాడ్ అనే సినిమాలో హీరోయిన్గా నటించింది. కానీ ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. దీంతో మళ్ళీ షోలు, ప్రైవేట్ ఆల్బమ్స్ చేస్తూ బిజీగా గడుపుతుంది.

ఇటీవల బిగ్ బాస్ మానస్ తో కలిసి జరీ జరీ పంచె కట్టి అనే ప్రైవేట్ సాంగ్ కు డాన్స్ చేసి ఫుల్ పాపులర్ అయింది. ఈ పాట కూడా సూపర్ హిట్ అయింది. అయితే ఈసారి షో కి విష్ణు ప్రియ మానస్ లను సంక్రాంతి షోకి ప్లాన్ చేశారు. ఆ షోలో భాగంగానే వీళ్ళిద్దరికీ పెళ్లి చేయాలని డిసైడ్ అవుతారు. వీరిద్దరి తరపున బంధువులు వస్తారు. అలా వీళ్ళిద్దరి పెళ్లి కోసం జరిగే హంగామాని ప్రోగ్రాం గా ప్లాన్ చేశారు. అయితే విష్ణు ప్రియ మానస్ లు స్టేజిపై నీ వర్షం సాక్షిగా అనే పాటకు డాన్స్ చేశారు. అయితే ఈ పాటలో ఫుల్ రొమాంటిక్ గా ఇద్దరూ డాన్స్ వేశారు. వీళ్ళిద్దరి రొమాంటిక్ డాన్స్ చూసి స్టేజి పై ఉన్నవాళ్లంతా కొద్ది నిమిషాల పాటు షాక్ లో ఉండిపోయారు.

Must Read: Hair tips : మార్కెట్లోకి వచ్చిన కొత్త దువ్వెన ..ఒక్కసారి దువ్వితే తలలో పేలు, వీపులు క్షణాల్లో మాయం ..