Viral Video : గ్యాస్ సిలిండర్ కట్ చేస్తే కుప్పలు కుప్పలుగా బయటపడ్డ డబ్బు… వైరల్ వీడియో…

Viral Video  : డబ్బు ఆదా చేయాలనే కోరిక ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఈ క్రమంలోనే ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిని ఉపయోగించి డబ్బు ఆదా చేస్తుంటారు. కొందరు పోస్ట్ ఆఫీస్, బ్యాంక్ వంటి వాటిని ఉపయోగించుకుంటుంటే మరికొందరు వడ్డీలకు ఇస్తూ తిప్పుతుంటారు. ఇక మన తాతల కాలంలో అయితే ఇంట్లోనే అల్మారాలు డబ్బాలలో దాచుకునేవారు. అలాగే చిన్న పిల్లలు కూడా కిడ్డీ బ్యాంకులో డబ్బులు దాచుకోవడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే కొందరు మాత్రం విచిత్రమైన పద్ధతులను […]

  • Published On:
Viral Video : గ్యాస్ సిలిండర్  కట్ చేస్తే కుప్పలు కుప్పలుగా బయటపడ్డ డబ్బు… వైరల్ వీడియో…

Viral Video  : డబ్బు ఆదా చేయాలనే కోరిక ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఈ క్రమంలోనే ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిని ఉపయోగించి డబ్బు ఆదా చేస్తుంటారు. కొందరు పోస్ట్ ఆఫీస్, బ్యాంక్ వంటి వాటిని ఉపయోగించుకుంటుంటే మరికొందరు వడ్డీలకు ఇస్తూ తిప్పుతుంటారు. ఇక మన తాతల కాలంలో అయితే ఇంట్లోనే అల్మారాలు డబ్బాలలో దాచుకునేవారు. అలాగే చిన్న పిల్లలు కూడా కిడ్డీ బ్యాంకులో డబ్బులు దాచుకోవడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే కొందరు మాత్రం విచిత్రమైన పద్ధతులను ఉపయోగించి డబ్బులు దాస్తున్నారు. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. తాజాగా అలాంటిది మరొక వీడియో నెట్టింటా వైరల్ గా మారింది.

ఓ వ్యక్తి డబ్బులు దాచేందుకు ఏకంగా సిలిండర్లన్ ఉపయోగించాడు. చివరికి గ్యాస్ సిలిండర్ కట్ చేసి చూడగా కుప్పలుగా నాణేలు బయటపడ్డాయి. దీంతో ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతుంది. వైరల్ అవుతున్న వీడియోలో వ్యక్తి వినూత్నంగా ఆలోచించాడు. డబ్బులను పొదుపు చేసే తరుణం లో ఎవరు చేయని విధంగా వినూత్న పద్ధతిని అవలంబించాడు. అయితే ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరి ఇంట్లో గ్యాస్ సిలిండర్ ఉండడం సహజం. ఇక ఈ గ్యాస్ సిలిండర్ ను వంట చేసుకునేందుకు అందరు వినియోగిస్తుంటారు. కానీ ఈ వ్యక్తి మాత్రం దానికి విరుద్ధంగా సిలిండర్ ను డబ్బులు దాచుకునేందుకు ఉపయోగించుకున్నాడు.

ఈ క్రమంలోనే దానిలో 10 రూపాయల నాణాలు వేస్తూ వచ్చాడు. ఇలా కొన్ని నెలల తర్వాత సిలిండర్ పూర్తిగా నిండిపోయింది. చివరికి దానిని కట్ చేసి నాణేలను బయటకు తీశారు. ఇక సిలిండర్ ని కత్తిరించి చూడగా 10 నాణేలు కుప్పలు కుప్పలుగా కనిపించాయి . ఇక ఆ నాణేలు అన్నింటిని ఇంట్లోనే కింద పోయడం జరిగింది.దీంతో వారి ఇల్లంతా నాణేలతో నిండిపోయింది. దీంతో ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ వీడియో చూసిన నేటి జనులు ఒక్కొక్కరు ఒక్కో విధంగా కామెంట్స్ చేస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by tushar ghongade (@tusharghongade1234)