Tollywood : పేకాట ఆడిన పెద్దోడు చిన్నోడు…ఫొటోస్ వైరల్…

Tollywood : టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ మరియు సూపర్ స్టార్ మహేష్ బాబు కలిసి పేకాట ఆడుతున్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అయితే తాజాగా ఓ ప్రైవేట్ కంపెనీ ఏర్పాటుచేసిన ప్రైవేట్ క్లబ్ ఈవెంట్ కి వెంకటేష్ మరియు మహేష్ బాబు అతిథులుగా విచ్చేసినట్లు సమాచారం. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా ఇద్దరు స్టార్ హీరోలు అక్కడ చిల్ అవుతూ పేకాట ఆడుతూ దర్శనమిచ్చారు. అయితే ఆ కార్యక్రమంలో […]

  • Published On:
Tollywood : పేకాట ఆడిన పెద్దోడు చిన్నోడు…ఫొటోస్ వైరల్…

Tollywood : టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ మరియు సూపర్ స్టార్ మహేష్ బాబు కలిసి పేకాట ఆడుతున్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అయితే తాజాగా ఓ ప్రైవేట్ కంపెనీ ఏర్పాటుచేసిన ప్రైవేట్ క్లబ్ ఈవెంట్ కి వెంకటేష్ మరియు మహేష్ బాబు అతిథులుగా విచ్చేసినట్లు సమాచారం. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా ఇద్దరు స్టార్ హీరోలు అక్కడ చిల్ అవుతూ పేకాట ఆడుతూ దర్శనమిచ్చారు. అయితే ఆ కార్యక్రమంలో ఉన్న ఎవరో వారిని ఫోటోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేయగా అవి కాస్త వైరల్ గా మారాయి.

victory-venkatesh-mahesh-babu-photos-viral
వైరల్ అవుతున్న ఫోటోలలో విక్టరీ వెంకటేష్ మరియు సూపర్ స్టార్ మహేష్ బాబు పక్క పక్కన కూర్చొని ఉన్నారు. అలాగే వారి చేతిలో పేకాట కార్డ్స్ కూడా కనిపిస్తున్నాయి. అలాగే టేబుల్ పై 500 నోట్ల కట్టలు కూడా దర్శనమిస్తున్నాయి. దీంతో ప్రస్తుతం వీటికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే చిన్నోడు పెద్దోడు కలిసి పేకాట ఆడుతున్నారంటూ సోషల్ మీడియాలో ఫోటోలను వైరల్ చేస్తున్నారు.

victory-venkatesh-mahesh-babu-photos-viral

ఇది ఇలా ఉండగా మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో గుంటూరు కారం సినిమా లో నటిస్తున్నావు. హారిక హాసిని క్రియేషన్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాను 2024 సంక్రాంతికి విడుదల చేసేందుకు సినీ బృందం సన్నాహాలు చేస్తుంది. ఇక ఈ సినిమాకు తమన్ సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. ఇక వెంకటేష్ విషయానికొస్తే శైలేష్ కొలను దర్శకత్వంలో సైంధవ్ అనే సినిమాను తీస్తున్నారు. యాక్షన్ అండ్ థ్రిల్లర్ ఎంటర్టైనర్ గా తేరకెక్కిస్తున్న ఈ సినిమాను వచ్చే ఏడాది ప్రేక్షకులకు ముందుకు తీసుకురానున్నారు.

victory-venkatesh-mahesh-babu-photos-viral