Varun Tej – Lavanya Wedding : పెళ్లికి సిద్ధమైన వరుణ్ లావణ్య…..
Varun Tej – Lavanya Wedding : మెగా హీరో వరుణ్ తేజ్ మరియు లావణ్య త్రిపాఠి వివాహం ఇటలీలోని అతి పురాతనమైన గ్రామంలో జరుగుతుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన కార్యక్రమాలను ఆనందోత్సవాల నడుమ చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు. అంతేకాక వరుణ్ తేజ్ ఏర్పాటు చేసిన కాక్ టెయిల్ పార్టీలో మెగా ఫ్యామిలీతో సహా లావణ్య కుటుంబ సభ్యులు మరియు ఇతర సినీ సెలబ్రిటీలు కూడా పాల్గొనడం జరిగింది. ఇక దానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో […]
Varun Tej – Lavanya Wedding : మెగా హీరో వరుణ్ తేజ్ మరియు లావణ్య త్రిపాఠి వివాహం ఇటలీలోని అతి పురాతనమైన గ్రామంలో జరుగుతుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన కార్యక్రమాలను ఆనందోత్సవాల నడుమ చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు. అంతేకాక వరుణ్ తేజ్ ఏర్పాటు చేసిన కాక్ టెయిల్ పార్టీలో మెగా ఫ్యామిలీతో సహా లావణ్య కుటుంబ సభ్యులు మరియు ఇతర సినీ సెలబ్రిటీలు కూడా పాల్గొనడం జరిగింది. ఇక దానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అలాగే (అక్టోబర్ 31) నిన్న జరిగిన మెహేంది కార్యక్రమం ఫోటోలు కూడా తెగ వైరల్ అవుతున్నాయి. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాల్లోకెళితే…
ఇటలీలోని ఎనిమిదవ శతాబ్దానికి చెందిన అతి ప్రాచీనమైన గ్రామంలో వరుణ్ తేజ్ మరియు లావణ్య త్రిపాఠిన వివాహం జరుగుతుంది. ఈ క్రమంలోనే ఆ పురాతన గ్రామంలో వారు అతిధులకు మరియు కుటుంబ సభ్యులకు పెద్ద ఎత్తున కాక్ టేయిల్ పార్టీ ఏర్పాటు చేశారు. పార్టీ అనంతరం మరో మూడు రోజులపాటు వెళ్లి వేడుకలను ఆస్వాదించండి అంటూ సోషల్ మీడియా లో లేఖను కూడా రాయడం జరిగింది.
అలాగే నిన్న జరిగిన మెహేంది వేడుకలలో హీరో నితిన్ మరియు ఆయన సతీమణి కూడా పాల్గొన్నారు. ఇక ఈ కార్యక్రమంలో నాగబాబు దంపతులు మరియు మెగా ఫ్యామిలీ అంతా ఎంజాయ్ చేస్తూ కనిపించారు. అలాగే ఈ పెళ్లి వేడుకలో అల్లు శిరీష్ కూడా కనిపించారు. ఇక ఈ మెహేంది వేడుకలలో ముఖ్యంగా అల్లు అర్జున్ చాలా ఆకర్షణీయంగా కనిపించడం విశేషం. అయితే దాదాపు ఈ మెహందీ కార్యక్రమంలో 120 మంది అతిథులు పాల్గొన్నట్లు సమాచారం. తెలుగు సీనియర్ ఇండస్ట్రీకి చెందిన అతి కొంతమంది మాత్రమే వరుణ్ పెళ్లి వేడుకలను వీక్షించినందుకు ఇటలీ వెళ్లారు. ఇదిలా ఉండగా వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి ఈరోజు పెళ్లి బంధంతో ఒకటవబోతున్నారు.