VarunTej-Lavanya Engagement : ఎట్టకేలకు ఘనంగా నిశ్చితార్థం చేసుకున్న వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠి.. ఫొటోస్ వైరల్…

VarunTej-Lavanya Engagement  : మెగా బ్రదర్ నాగబాబు కొడుకు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే గత కొంతకాలంగా సోషల్ మీడియా వేదికగా ,వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠిని పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు అదే నిజమైంది. గత కొంత కాలం గా లావణ్య త్రిపాఠి తో ప్రేమాయణం నడిపిస్తున్న వరుణ్ తేజ్ ఇప్పుడు పెళ్లి పీటలేకబోతున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఓ ప్రకటన కూడా విడుదల […]

  • Published On:
VarunTej-Lavanya Engagement  : ఎట్టకేలకు ఘనంగా నిశ్చితార్థం చేసుకున్న వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠి.. ఫొటోస్ వైరల్…

VarunTej-Lavanya Engagement  : మెగా బ్రదర్ నాగబాబు కొడుకు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే గత కొంతకాలంగా సోషల్ మీడియా వేదికగా ,వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠిని పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు అదే నిజమైంది. గత కొంత కాలం గా లావణ్య త్రిపాఠి తో ప్రేమాయణం నడిపిస్తున్న వరుణ్ తేజ్ ఇప్పుడు పెళ్లి పీటలేకబోతున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఓ ప్రకటన కూడా విడుదల కాగా ..ఇటీవల వరుణ్ తేజ్ కి మరియు లావణ్య త్రిపాటికి వారి సన్నిహితుల సమక్షంలో ఎంగేజ్మెంట్ జరిగింది. ఇక దీనికి సంబంధించిన ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

varun-tej-lavanya-tripathi-finally-got-engaged-photos-viral

 

వీరి ఎంగేజ్మెంట్ శుక్రవారం రోజు జరిగింది. ఇక ఈ నిశ్చితార్థానికి కేవలం మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ మరియు లావణ్య కుటుంబాలు మాత్రమే హాజరు అవడం గమనార్హం. అయితే మొన్నటి వరకు సోషల్ మీడియా వేదికగా వీరిద్దరిపై తీవ్ర చర్చ జరిగిన విషయం తెలిసిందే. కానీ అలాంటి వార్తలకు ఎవరు స్పందించలేదు. ఇక ఇప్పుడు ఏకంగా ఎంగేజ్మెంట్ తో ముందుకు వచ్చి అందరి నోర్లు మూయించారు. ఎట్టకేలకు మరోసారి మెగా ఫ్యామిలీలో పెళ్లి భాజాలు మోగనున్నాయి.

varun-tej-lavanya-tripathi-finally-got-engaged-photos-viral

ఇదిలా ఉండగా మెగా ఫ్యామిలీలో మరో వార్త గత కొంతకాలంగా సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. వరుణ్ తేజ్ చెల్లి నిహారిక విడాకులు తీసుకోబోతుంది అన్న వార్తలు గత కొంతకాలంగా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. అయినా సరే ఇంతవరకు ఈ విషయంపై ఎవరు స్పందించలేదు. అంతేకాక నిహారికను తన మేన బావ సాయిధరమ్ తేజ్ కు ఇచ్చి పెళ్లి చేస్తున్నట్లు పుకార్లు వినిపిస్తున్నాయి. మరి దీనిలో ఎంత నిజం ఉందో తెలియదు కానీ నిహారిక విడాకుల వార్త మాత్రం ఇప్పటికీ నెట్టింట చెక్కర్లు కొడుతూనే ఉంది. ఇక ఈ విషయంపై స్పష్టత రావాల్సి ఉంది.