Shivani Rajashekar : మెగా హీరో సరసన జీవిత రాజశేఖర్ పెద్ద కూతురు…ఇది జరిగేపనేనా…?

Shivani Rajashekar  : తెలుగు సినీ ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్స్ ఊహాలకి అందనిస్థాయిలో ఉంటాయి. అసలు ఏమాత్రం జోడి కట్టే ఛాన్స్ లేదు అనుకున్న వారే హీరో హీరోయిన్లుగా నటిస్తూ కనిపిస్తారు. అలాగే వీరిద్దరూ జంటగా నటిస్తే బాగుండు అనుకున్న హీరో హీరోయిన్లు మాత్రం ఎప్పటికీ కలిసి సినిమాలు చేయరు. అయితే అలాంటి వారిలో పవన్ కళ్యాణ్ అనుష్క మరియు పవన్ కళ్యాణ్ అనుష్క జంటగా ఒక్క సినిమా కూడా రాలేదు. అలాగే యంగ్ టైగర్ ఎన్టీఆర్ […]

  • Published On:
Shivani Rajashekar : మెగా హీరో సరసన జీవిత రాజశేఖర్ పెద్ద కూతురు…ఇది జరిగేపనేనా…?

Shivani Rajashekar  : తెలుగు సినీ ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్స్ ఊహాలకి అందనిస్థాయిలో ఉంటాయి. అసలు ఏమాత్రం జోడి కట్టే ఛాన్స్ లేదు అనుకున్న వారే హీరో హీరోయిన్లుగా నటిస్తూ కనిపిస్తారు. అలాగే వీరిద్దరూ జంటగా నటిస్తే బాగుండు అనుకున్న హీరో హీరోయిన్లు మాత్రం ఎప్పటికీ కలిసి సినిమాలు చేయరు. అయితే అలాంటి వారిలో పవన్ కళ్యాణ్ అనుష్క మరియు పవన్ కళ్యాణ్ అనుష్క జంటగా ఒక్క సినిమా కూడా రాలేదు. అలాగే యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు అనుష్క కాంబినేషన్లో కూడా ఒక్క సినిమా రాకపోవడం గమనార్హం. అయితే దీని వెనక కారణాలు ఏంటి అనేవి ఎవరికీ తెలియదు.ఇకపోతే తెలుగు సినీ ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీకి మరియు నటుడు జీవిత రాజశేఖర్ ఫ్యామిలీకి గత కొన్నేళ్లుగా వైరం ఉందన్న సంగతి అందరికీ తెలిసిందే.

jeetha-rajasekhars-elder-daughter-is-going-to-act-by-mega-hero

రాజకీయాలతో మొదలైన వీరి వైరం సినిమాల వరకు వచ్చింది.ఈ క్రమంలోనే మెగా హీరోతో జీవిత రాజశేఖర్ కూతురు నటించే అవకాశం ఎప్పటికీ ఉండదని అందరూ అనుకున్నారు. కానీ తాజాగా ఎవరు ఊహించని విధంగా సోషల్ మీడియాలో ఓ వార్త ప్రచారం జరుగుతుంది. మెగా ఫ్యామిలీకి చెందిన యంగ్ హీరోతో జీవిత రాజశేఖర్ పెద్ద కుమార్తె శివాని రాజశేఖర్ జంటగా నటించబోతుందని వార్తలు వస్తున్నాయి . అయితే ఈ వార్తలు నిజమే అన్న విషయం ఇండస్ట్రి లో కూడా ఎక్కువగా వినిపిస్తుంది. నిజంగా వీరిద్దరూ కలిసి జంటగా నటిస్తే మాత్రం తెలుగు సినీ ఇండస్ట్రీలో సరికొత్త ట్రెండ్ సెట్ అవుతుందని అనడంలో ఎలాంటి సందేహం లేదు.

jeetha-rajasekhars-elder-daughter-is-going-to-act-by-mega-hero

అయితే ఇప్పటికే శివాని రాజశేఖర్ గీత ఆర్ట్స్2 లో కోటబొమ్మాలి పీఎస్ సినిమాలో హీరోయిన్ గా నడుస్తోంది. అయితే తాజాగా శివాని కూడా ఇరు కుటుంబ సభ్యుల విభేదాలపై స్పందిస్తూ ఏదో ఒక సమయంలో అపార్ధాలు తలెత్తి ఉండవచ్చు కానీ సినిమా పరంగా మేమంతా ఒకటే కుటుంబం అని చెప్పుకొచ్చింది. ఈ క్రమంలోనే మెగా హీరో సాయిధరమ్ తేజ్ తో శివాని రాజశేఖర్ ఓ సినిమాలో నటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ వీరిద్దరి కాంబినేషన్లో సినిమా ప్లాన్ చేస్తున్నట్లుగా సమాచారం. మరి ఈ వార్తలలో ఎంత నిజం ఉందొ తెలియాలంటే వేచి చూడాల్సిందే..