Lavanya Tripathi : పేరుకే పెళ్లయింది వరుణ్ పై లావణ్య కామెంట్స్…

Lavanya Tripathi  : తెలుగు ఇండస్ట్రీలో లావణ్య త్రిపాఠి నటించిన అన్ని సినిమాలకు మంచి ఆదరణ లభించింది. అయితే వాటన్నిటికీ అంటే కూడా మెగా కోడలిగా ఆమెకు ప్రత్యేకమైన గౌరవం లభిస్తుంది. కొంతకాలంగా తన సినిమాల ప్రస్తావన తీసుకురాని ఈ భామ తాజాగా మిస్ పర్ఫెక్ట్ అనే వెబ్ సిరీస్ తో ఓటీటీలోకి అడుగు పెట్టింది. ప్రస్తుతం ఈ సిరీస్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది. అయితే ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్ల […]

  • Published On:
Lavanya Tripathi  : పేరుకే పెళ్లయింది వరుణ్ పై లావణ్య కామెంట్స్…

Lavanya Tripathi  : తెలుగు ఇండస్ట్రీలో లావణ్య త్రిపాఠి నటించిన అన్ని సినిమాలకు మంచి ఆదరణ లభించింది. అయితే వాటన్నిటికీ అంటే కూడా మెగా కోడలిగా ఆమెకు ప్రత్యేకమైన గౌరవం లభిస్తుంది. కొంతకాలంగా తన సినిమాల ప్రస్తావన తీసుకురాని ఈ భామ తాజాగా మిస్ పర్ఫెక్ట్ అనే వెబ్ సిరీస్ తో ఓటీటీలోకి అడుగు పెట్టింది. ప్రస్తుతం ఈ సిరీస్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది. అయితే ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్ల సమయంలో లావణ్య మీడియాతో మాట్లాడుతూ తాను తన సినిమాల ఎంపిక విషయంలో ఆచితూచి వ్యవహరిస్తూనే ఉంటాను అని ఎక్కువ సినిమాలు చేయాలి అని ఆరాటం లేదు అని తెలిపింది.అలాగే పెళ్లి తర్వాత తన కెరీర్ లో వచ్చిన మార్పు పై కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి ల వివాహం నవంబర్ 1న కుటుంబ సభ్యుల సమక్షంలో ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. కొత్త కాలం తన భర్తతో సమయం గడిపిన తర్వాత తిరిగి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుత మిస్ పర్ఫెక్ట్ అనే వెబ్ సిరీస్ తో ఆడియన్స్ ముందుకు వచ్చింది.

ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్ లో భాగంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ తాను సినిమాల గురించి మాట్లాడుతూ తాను చేసిన కొన్ని సినిమాలు అయినా మంచి పేరు తెచ్చుకోవాలి అని ప్రయత్నిస్తున్నట్లు చెప్పుకొచ్చింది. ఇప్పటివరకు తాను చేసిన సినిమాలు తనకు అయితే గుర్తింపు తీసుకువచ్చాయని తెలిపింది. అలాగే పెళ్లి తర్వాత తన కెరీర్ గురించి మాట్లాడుతూ ఇలా ప్రస్తావించింది పెళ్లి తర్వాత కెరియర్ పరంగా లైఫ్ ఏమీ మారలేదు. మెగా కుటుంబంలోకి వచ్చావు కాబట్టి నువ్వు అలా చేయాలి ఇలా చేయాలి అని నాకు ఎవరు పరిమితులు పెట్టడం లేదు.కెరియర్ పరంగా నాకు కావాల్సినంత స్వేచ్ఛ ఉంది. వరుణ్ తేజ్ ప్రతి విషయాన్ని అర్థం చేసుకుంటారు.అలాంటి వ్యక్తి జీవిత భాగస్వామిగా వచ్చారు ఇంతకంటే ఏం కావాలి గతంలో ఎలా ఉండే వాళ్ళము ఇప్పుడు కూడా అలానే ఉన్నాము. నా ప్రాజెక్ట్ విషయంలో వారూ పెద్దగా ఇన్వాల్వ్ అవ్వరు. ఎప్పుడైనా నేను సెలెక్ట్ చేసిన స్క్రిప్ట్ గురించి చెప్తే వింటారు.

మిస్ పర్ఫెక్ట్ సిరీస్ చూసి బాగుందని ప్రశంసించారు అంటూ చెప్పుకొచ్చింది.ఇక మిస్ పర్ఫెక్ట్ సిరీస్ కి వస్తే ఏ సిరీస్ ని విశ్వకండే రావు దర్శకత్వం వహించారు. కాగ సుప్రియ నిర్మాతగా వ్యవహరించారు. ఇందులో బిగ్ బాస్ ఫేమ్ హీరోగా కనిపించారు.ఈ మధ్యకాలంలో వచ్చిన క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ సిరీస్ ఆడియన్స్ ని ఆకట్టుకుంటుంది. ఇక ప్రస్తుతం పీపుల్ మీడియా ఫ్యాక్టరీలో ఒక సినిమా చేస్తున్నాను ఈ చిత్రాన్ని కొత్త డైరెక్టర్ తెరకెక్కిస్తున్నారని తెలియజేశారు. ఈ చిత్రం ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ అయిందని త్వరలోనే రిలీజ్ డేట్ ని ప్రకటిస్తారని చెప్పుకొచ్చారు .అంతేకాకుండా తెలుగులో పాటు తమిళంలో నువ్వు ఓ సినిమా చేస్తున్నారని తెలిపారు.ఇక మెగా వారి ఇంటి కోడలు లావణ్య త్రిపాఠి పెళ్లి తర్వాత కెరియర్ పై తాను చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.