Niharika Konidela : మెగా డాటర్ నిహారిక లవ్ లెటర్ వైరల్…
Niharika Konidela : మెగా డాటర్ నిహారిక కొనిదల గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బుల్లితెరపై యాంకర్ గా తన కెరీర్ ను మొదలుపెట్టిన నిహారిక ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సాధించింది. హీరోయిన్ గా ఇండస్ట్రీలో సక్సెస్ కాకపోయినప్పటికీ నిర్మాతగా వ్యవహరిస్తూ ఇండస్ట్రీలో కొనసాగుతుంది. ఇక ఇటీవల తన అన్న వరుణ్ తేజ్ పెళ్లిలో కూడా నిహారిక సందడి చేసింది. లావణ్య త్రిపాఠి వరుణ్ తేజ్ పెళ్లిలో అదిరిపోయే డ్యాన్స్ […]
Niharika Konidela : మెగా డాటర్ నిహారిక కొనిదల గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బుల్లితెరపై యాంకర్ గా తన కెరీర్ ను మొదలుపెట్టిన నిహారిక ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సాధించింది. హీరోయిన్ గా ఇండస్ట్రీలో సక్సెస్ కాకపోయినప్పటికీ నిర్మాతగా వ్యవహరిస్తూ ఇండస్ట్రీలో కొనసాగుతుంది. ఇక ఇటీవల తన అన్న వరుణ్ తేజ్ పెళ్లిలో కూడా నిహారిక సందడి చేసింది. లావణ్య త్రిపాఠి వరుణ్ తేజ్ పెళ్లిలో అదిరిపోయే డ్యాన్స్ తో అందర్నీ ఎట్రాక్ట్ చేసింది. తన అన్న పెళ్లి వేడుకలను తన కనుసన్నల్లో జరిగేలా చేసి బాధ్యతలు చేపట్టింది.
ఇక పెళ్లి తంతు అనంతరం నిహారిక ప్రస్తుతం 15 మంది కొత్త నటీనటులతో ఓ సినిమాను తెరకెక్కిస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ సినిమా షూటింగ్ ప్రారంభోత్సవానికి నవ దంపతులు వరుణ్ లావణ్య కూడా విచ్చేశారు. అయితే నిహారిక ఇప్పటికే బుల్లితెర ఓటీటీ లలో షోలను వెబ్ సిరీస్ లో నిర్మించగా , ఇప్పుడు ఏకంగా వెండితెరపై నిర్మాతగా మారింది. ఇదిలా ఉండగా నిహారిక సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలను ప్రేక్షకులతో పంచుకుంటూ సందడి చేస్తూ ఉంటుంది. అయితే తాజాగా తన ఇంస్టాగ్రామ్ నుండి నిహారిక ఓ వీడియోని విడుదల చేసింది.
View this post on Instagram
ఇంకా ఆ వీడియోలో క్యాప్షన్ గా లవ్ లెటర్ అంటూ రాసుకోవచ్చు. ఇక ఆ వీడియో ద్వారా తనకు అత్యంత ఇష్టమైన తన జీవితంలో స్ఫూర్తిగా నిలిచిన వారందరికీ సర్ప్రైజ్ ఇచ్చింది. వీడియోలో తాను ప్రేమిస్తున్న వారందరూ వచ్చేలా లవ్ లెటర్ టు ఆల్ మై ఏంజెల్స్ అంటూ క్యాప్షన్ పెట్టి ఇంస్టాగ్రామ్ లో విడుదల చేసింది. ఇక ఈ వీడియోలో లావణ్య త్రిపాఠి , శ్రీజ కొనగల , జ్యోతిక సందీప్ నిహారిక తల్లి కూడా కనిపించారు. ఇక ఈ వీడియోలో వాయిస్ ఓవర్ తో అందరికీ కృతజ్ఞతలు తెలియజేసింది నిహారిక . మీతో గడిపిన క్షణాలు మధురమైనవి అంటూ మర్చిపోలేనివి అంటూ ప్రస్తావించింది. దీంతో ప్రస్తుతం దీనికి సంబంధించిన న్యూస్ వైరల్ గా మారింది.