Mega Family : కూతుర్లు ఇలా.. కోడళ్ళు ఇలా…పిల్లల విషయంలో మెగా కొత్త కోడలు లావణ్య సంచలన నిర్ణయం ..!!

Mega Family : ‘ అందాల రాక్షసి ‘ సినిమాతో ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా కంటే ఎక్కువగా ఇప్పుడు మెగా కోడలుగా ఫుల్ పాపులర్ అవుతున్నారు. నిత్యం ఆమె గురించి సోషల్ మీడియాలో ఏదో ఒక వార్త వస్తూనే ఉంది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే. ఇక వీరి పెళ్లి ఇటలీలో ఎంత గ్రాండ్గా జరిగిందో అందరికీ తెలుసు. అందుకు సంబంధించిన […]

  • Published On:
Mega Family : కూతుర్లు ఇలా.. కోడళ్ళు ఇలా…పిల్లల విషయంలో మెగా కొత్త కోడలు లావణ్య సంచలన నిర్ణయం ..!!

Mega Family : ‘ అందాల రాక్షసి ‘ సినిమాతో ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా కంటే ఎక్కువగా ఇప్పుడు మెగా కోడలుగా ఫుల్ పాపులర్ అవుతున్నారు. నిత్యం ఆమె గురించి సోషల్ మీడియాలో ఏదో ఒక వార్త వస్తూనే ఉంది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే. ఇక వీరి పెళ్లి ఇటలీలో ఎంత గ్రాండ్గా జరిగిందో అందరికీ తెలుసు. అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి కూడా. ఇదిలా ఉండగా తాజాగా లావణ్య త్రిపాఠి గురించి ఓ న్యూస్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. అక్కలాగే చెల్లి కూడా పిల్లల విషయంలో ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు ఏంటి అని జనాలు చర్చించుకుంటున్నారు.

lavanya-tripaathi-sensational-decision-about-regarding-children

మనకు తెలిసిందే మెగా కోడలు ఉపాసన ఏకంగా పదేళ్లు గ్యాప్ తీసుకొని పిల్లలను ప్లాన్ చేసుకున్నారు. అయితే ఇప్పుడు అదే పనిని లావణ్య త్రిపాఠి కూడా చేయబోతుంది అని ఓ న్యూస్ వైరల్ అవుతుంది. మీడియా కథనాల ప్రకారం లావణ్య త్రిపాఠి కొన్ని సంవత్సరాల పాటు పిల్లలను వద్దనుకుంటున్నారట. అంతేకాదు ఆమె మళ్ళీ సినిమాలలో నటించాలని అనుకుంటున్నారట. అలాగే ఒక ప్రొడక్షన్ హౌస్ ని స్టార్ట్ చేయాలని ఫిక్స్ అయ్యారట. అలాగే ఓ బ్రాండెడ్ డిజైనర్ షోరూమ్ కూడా ఓపెన్ చేయాలని, సెలబ్రిటీస్ లైఫ్ స్టైల్ కి సంబంధించిన దుస్తులను సామాన్యులకు కూడా అందుబాటులోకి తెచ్చే విధంగా ఓ వెబ్సైట్ను రన్ చేయాలని అనుకుంటున్నారట.

lavanya-tripaathi-sensational-decision-about-regarding-children

ఇలా తన లైఫ్ లో చాలా డ్రీమ్స్ ఉన్నాయని, పిల్లలను కంటే ఈ డ్రీమ్స్ అన్ని చేయలేను అని, ఇవన్నీ పూర్తయ్యాకే పిల్లలను ప్లాన్ చేసుకోవాలని లావణ్య అనుకుంటున్నారట. దీంతో మెగా యాంటీ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో మెగా ఫ్యామిలీని ఓ రేంజ్ లో ఆడేసుకుంటున్నారు. మెగా ఆడబిడ్డలు అలా, మెగా కోడలు ఇలా అంటూ కొందరు వ్యంగ్యంగా కామెంట్ చేశారు. ఉపాసన పిల్లల కోసం పదేళ్లు టైం తీసుకుంది.. నువ్వు ఇంకో 20 ఏళ్లు టైం తీసుకో.. అంటూ దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.