Niharika Konidela : విడాకుల పై నోరు విప్పిన నిహారిక…నేను సింగల్ కాదంటూ…

Niharika Konidela  : మెగా డాటర్ నిహారిక గత ఏడాది జులైలో విడాకులు తీసుకున్న సంగతి అందరికి తెలిసిందే.అయితే ఉదయపూర్ లో చైతన్య జొన్నలగడ్డ మరియు నిహారిక వెడ్డింగ్ చాలా గ్రాండ్ గా జరిగింది. అప్పుడే ఇద్దరు క్యూట్ కపుల్ గా పేరు తెచ్చుకున్నారు. అలాగే పలు ఇంటర్వ్యూలు కూడా ఇచ్చారు. కానీ సడన్ గా విడాకులు తీసుకుంటూ ఇద్దరు పోస్టులు పెట్టారు. దీంతో అందరూ షాక్. అయితే వారి విడాకులకు కారణం ఏంటి అని విషయాలు […]

  • Published On:
Niharika Konidela : విడాకుల పై నోరు విప్పిన నిహారిక…నేను సింగల్ కాదంటూ…

Niharika Konidela  : మెగా డాటర్ నిహారిక గత ఏడాది జులైలో విడాకులు తీసుకున్న సంగతి అందరికి తెలిసిందే.అయితే ఉదయపూర్ లో చైతన్య జొన్నలగడ్డ మరియు నిహారిక వెడ్డింగ్ చాలా గ్రాండ్ గా జరిగింది. అప్పుడే ఇద్దరు క్యూట్ కపుల్ గా పేరు తెచ్చుకున్నారు. అలాగే పలు ఇంటర్వ్యూలు కూడా ఇచ్చారు. కానీ సడన్ గా విడాకులు తీసుకుంటూ ఇద్దరు పోస్టులు పెట్టారు. దీంతో అందరూ షాక్. అయితే వారి విడాకులకు కారణం ఏంటి అని విషయాలు మాత్రం ఎవరికి తెలియదు. ఇక దీని పై ఇద్దరు కూడా వారి నోరు విప్పలేదు. అయితే తాజాగా నిహారిక తాము ఇద్దరం విడాకులు ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందో తెలియజేసింది. అయితే నిహారిక పెళ్లి 2020 డిసెంబర్ 9న జరిగింది. ఉదయపూర్ లో పెద్దల సమక్షంలో చాలా గ్రాండ్ గా వీరి వివాహం జరిగింది. అయితే అప్పటికి నిహారిక సినిమాలు చేస్తున్నారు. పెళ్లయిన తర్వాత కూడా కొన్నాళ్లపాటు నిహారిక తన కెరియర్ ని కొనసాగించారు. అటు యాక్ట్ చేస్తూనే సినిమాలు సిరీస్ ప్రొడ్యూసర్ గా కూడా చేశారు.

niharika-konidela-responded-to-the-divorce

అలాంటి సమయంలోనే నిహారిక చైతన్య విడాకులు తీసుకోబోతున్నారు అంటూ వార్తలు చక్కర్లు కొట్టాయి. దీనిపై ఇద్దరు స్పందించి విడిపోతున్నా మంటూ పోస్టులు పెట్టారు. ఆ తర్వాత నిహారిక గాని చైతన్య గాని వారి విడాకుల గురించి స్పందించలేదు. అయితే తాజాగా నిఖిల్ అనే యూట్యూబ్ కార్యక్రమానికి నిహారిక అటెండ్ అయ్యారు. ఇక అక్కడ ఆమె తన విడాకుల గురించి స్పందించారు.ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ ఏ జంట కూడా విడిపోవాలని పెళ్లి చేసుకోరు. అది ఉదయపూర్ లో అయినా రిజిస్టర్ మ్యారేజ్ అయినా ఇద్దరు కలిసి ఉండాలని చేసుకుంటారు. నేను చాలా రోజులు ఏడ్చాను నా గురించి ఏవేవో రాస్తుంటే చాలా బాధపడ్డాను. ఆ సమయంలో నాకు నా ఫ్యామిలీ ఫ్రెండ్స్ బ్యాక్ బోన్ గా ఉన్నారు. చాలా సపోర్ట్ చేశారు. ఎవరు కూడా నన్ను ఒక్క మాట అనలేదు. ఒకరిని నమ్మడం అనేది చాలా పెద్ద విషయం కానీ ఎవరిని కూడా అంత ఈజీగా నమ్మకూడదు.

niharika-konidela-responded-to-the-divorce

పెళ్లి విడాకుల తర్వాత ఎవరిని నమ్మకూడదు అని అర్థమైంది. నన్ను నా కుటుంబాన్ని మాటలు అనే వారిని నేను పట్టించుకోను. నాకు నా ఫ్యామిలీ నా ఫ్రెండ్స్ నా గురించి ఏమనుకుంటున్నారు అనేది మాత్రమే ఇంపార్టెంట్ అది కాకుండా ఎవరి ఒపీనియన్స్ నేను పట్టించుకోను అని చెప్పారు. ఇక పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు అనే ప్రశ్నకి ఇప్పుడు నాకు 30 ఏళ్లు నా ఫోకస్ అంతా కెరియర్ పైనే ఉంది. అది కాకుండా ఇంకేమి ఆలోచించడం లేదు. సెల్ఫ్ కేరింగ్ ఎక్కువైంది ఫ్యూచర్ లో చాలా సాధించాలి అనే క్లారిటీ ఉంది. అవన్నీ పూర్తవ్వాలి ఆ తర్వాత ఏం జరిగితే అది జరుగుతుంది అని చెప్పుకొచ్చారు. అయితే నిహారిక మొదటి సారి ఓపెన్ అయ్యారు. తన పెళ్లి గురించి విడాకుల గురించి మాట్లాడారు. దీంతో ఇప్పుడు ఆమె ఒక స్ట్రాంగ్ ఉమెన్ గా ప్రతి ఒక్కరికి కనిపిస్తుంది. చాలా మెచ్యూరిటీతో మాట్లాడారు ఎవరిని కూడా దూషించకుండా చాలా స్మూత్ గా ముందుగా తాను ఏమనుకుంటున్నారో బయటపెట్టారు. దీంతో నేటిజనులు కూడా ఆమెకు సపోర్ట్ చేస్తున్నారు. ఫోకస్ ఆన్ యువర్ కెరియర్ అని కామెంట్స్ చేస్తున్నారు.