Lavanya Tripathi :నాకు అలాంటి కండిషన్స్ ఏమీ లేవు…మెగా కోడలు లావణ్య త్రిపాఠి

Lavanya Tripathi : ఏది ఏమైనప్పటికీ పెళ్లి తర్వాత ఒక అమ్మాయికి అత్తారింటి నుండి ఆంక్షలు రావడం అనేది సర్వసాధారణం. పెళ్లయిన అమ్మాయిలకి కొత్త కొత్త కండిషన్స్ తయారవుతుంటాయి. కానీ నాకు మాత్రం అలాంటిది ఏమీ లేవంటూ ఇటీవల పెళ్లి చేసుకున్న స్టార్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి అంటుంది. అనడమే కాదు మెగా ఫ్యామిలీ గురించి ఆమె మాట్లాడుతూ ఎంతో గొప్పగా పొంగిపోతున్నారు. ఇక పనిలో పనిగా తన నయా వెబ్ సిరీస్ ని కూడా లావణ్య […]

  • Published On:
Lavanya Tripathi :నాకు అలాంటి కండిషన్స్ ఏమీ లేవు…మెగా కోడలు లావణ్య త్రిపాఠి

Lavanya Tripathi : ఏది ఏమైనప్పటికీ పెళ్లి తర్వాత ఒక అమ్మాయికి అత్తారింటి నుండి ఆంక్షలు రావడం అనేది సర్వసాధారణం. పెళ్లయిన అమ్మాయిలకి కొత్త కొత్త కండిషన్స్ తయారవుతుంటాయి. కానీ నాకు మాత్రం అలాంటిది ఏమీ లేవంటూ ఇటీవల పెళ్లి చేసుకున్న స్టార్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి అంటుంది. అనడమే కాదు మెగా ఫ్యామిలీ గురించి ఆమె మాట్లాడుతూ ఎంతో గొప్పగా పొంగిపోతున్నారు. ఇక పనిలో పనిగా తన నయా వెబ్ సిరీస్ ని కూడా లావణ్య ప్రమోట్ చేసుకుంటున్నారని చెప్పాలి. అయితే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తో పెళ్లి తర్వాత మొదటిసారి లావణ్య త్రిపాఠి ఓ వెబ్ సిరీస్ లో నటించనున్నారు. మిస్ పర్ఫెక్ట్ పేరుతో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కు రెడీ అవుతున్న ఈ సినిమా ట్రైలర్ లాంచ్ రీసెంట్ గానే జరిగింది.ఇక ఈ ఈవెంట్ లోనే లావణ్య త్రిపాఠి మాట్లాడుతూ…తన మ్యారేజ్ లైఫ్ గురించి ప్రస్తావించారు. అంతేకాక మెగా ఫ్యామిలీ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

i-have-no-such-conditions-lavanya-tripathi

అయితే మెగా కోడలు ఏం చెప్పిందంటే…నాకు సినిమాలు వెబ్ సిరీస్ అని తేడా లేదు నచ్చిన కథలను ఎంచుకుంటూ సినిమాలు సిరీస్ లు చేసుకుంటూ పోతా. మిస్ పర్ఫెక్ట్ వెబ్ సిరీస్ తో పాటు ఇప్పుడు నేను మరో రెండు సినిమాల్లో కూడా నటిస్తున్నాను. ఇక ఇప్పుడు మెగా కోడలు అనే టాగ్ తో మరింత బాధ్యతలు పెరిగాయని ఆమె చెప్పుకొచ్చింది. ఇక సినిమా పరంగా ఆమెకు ఎలాంటి హద్దులు లేవని నా ఫ్యామిలీ అంతా నాకు సపోర్ట్ గా ఉన్నారంటూ ఆమె చెప్పుకొచ్చింది. దీంతో లావణ్య చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక మెగా అభిమానులైతే ఎంతగానో సంతోషిస్తున్నారు. అయితే మ్యారేజ్ అయినప్పటికీ తాను మాత్రం సినిమాల్లో కంటిన్యూ అవుతాను అని చెప్పడం లావణ్య అభిమానులకు శుభవార్త చెప్పినట్టు అయింది అని చెప్పాలి.