Eswara Rao : సినీ ఇండస్ట్రీలో విషాదం…సీనియర్ నటుడు మృతి…

Eswara Rao : తెలుగు సినీ ఇండస్ట్రీ సీనియర్ నటుడు ఈశ్వరరావు చనిపోయిన విషయం చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అమెరికాలోని మిచిగన్ లో ఉంటున్న తన కుమార్తె ఇంటికి వెళ్ళిన ఈశ్వరరావు అక్కడే తుది శ్వాస విడిచాను. అయితే ఈయన అక్టోబర్ 31వ తేదీన చనిపోయినప్పటికీ ఈ విషయం తెలుగు సినీ ఇండస్ట్రీ చాలా ఆలస్యంగా తెలిసింది. అయితే తెలుగు సినీ ఇండస్ట్రీలో దాదాపు 200 పైగా సినిమాలలో విభిన్నమైన పాత్రలో ఈశ్వరరావు నటించి మెప్పించారు. […]

  • Published On:
Eswara Rao : సినీ ఇండస్ట్రీలో విషాదం…సీనియర్ నటుడు మృతి…

Eswara Rao : తెలుగు సినీ ఇండస్ట్రీ సీనియర్ నటుడు ఈశ్వరరావు చనిపోయిన విషయం చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అమెరికాలోని మిచిగన్ లో ఉంటున్న తన కుమార్తె ఇంటికి వెళ్ళిన ఈశ్వరరావు అక్కడే తుది శ్వాస విడిచాను. అయితే ఈయన అక్టోబర్ 31వ తేదీన చనిపోయినప్పటికీ ఈ విషయం తెలుగు సినీ ఇండస్ట్రీ చాలా ఆలస్యంగా తెలిసింది. అయితే తెలుగు సినీ ఇండస్ట్రీలో దాదాపు 200 పైగా సినిమాలలో విభిన్నమైన పాత్రలో ఈశ్వరరావు నటించి మెప్పించారు. మొదట దాసరి నారాయణ తెరకేక్కించిన స్వర్గం – నరకం అనే సినిమా ద్వారా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈశ్వరరావు అనతి కాలంలోనే మంచి క్రేజ్ సంపాదించుకున్నారు.

టాలీవుడ్‌ సీనియర్‌ నటుడు ఈశ్వరరావు కన్నుమూత | Prajasakti

అంతేకాక ఆయన నటించిన మొదటి సినిమాకి నంది అవార్డు రావడంతో ఈశ్వర రావు కోసం సినిమా దర్శకులు మరియు ప్రొడ్యూసర్లు కూడా బ్రహ్మరథం పట్టారు. ఈ క్రమంలోనే ఈశ్వరరావు దేవతలారా దీవించండి, యుగ పురుషుడు , ప్రేమాభిషేకం , ప్రెసిడెంట్ గారి అబ్బాయి , దయామయుడు , జయం మనదే , శభాష్ గోపి , ఘరానా మొగుడు వంటి సినిమాలలో నటించి మంచి గుర్తింపు సాధించారు.

అయితే ఈశ్వరరావు చిట్ట చివరగా నటించిన సినిమా చిరంజీవి ఘరానమొగుడు. ఈ సినిమా తర్వాత ఆయన ఎలాంటి సినిమాలలో కనిపించలేదు.ఆ తర్వాత ఆయన పలు ధారావాహికలలో కనిపించారు. అయితే తెలుగు సినీ ఇండస్ట్రీలో సౌమ్యుడు మంచి నటుడుగా పేరుపొందిన ఈశ్వరరావు ఇటీవల కన్నుమూయడంతో తీవ్ర విషాదం నెలకొంది. ఈ క్రమంలోనే తెలుగు సినీ పరిశ్రమ తీవ్ర విచారం వ్యక్తం చేస్తుంది. వరుసగా సీనియర్ నటుల మరణ వార్తలతో సినీ ఇండస్ట్రీ కాస్త ఆందోళనలో పడింది.