Tiger Nageswara Rao : సోషల్ మీడియాని షేక్ చేస్తున్న టైగర్ నాగేశ్వరరావు ట్రైలర్….

Tiger Nageswara Rao : మాస్ మహారాజ రవితేజ దర్శకుడు వంశీ ,అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ కాంబినేషన్ లో పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిన కేజీ ప్రాజెక్ట్ టైగర్ నాగేశ్వరరావు. ఇక ఈ సినిమాను 1970 కాలంలో గజదొంగ అయిన టైగర్ నాగేశ్వరరావు నిజ జీవిత సంఘటనలను ఆధారంగా చేసుకొని బయోపిక్ రూపొందించారు. భారీ బడ్జెట్ తో రూపొందించిన ఈ సినిమాలో నుపూర్ సనన్ ,గాయత్రి భరద్వాజ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమాకు […]

  • Published On:
Tiger Nageswara Rao : సోషల్ మీడియాని షేక్ చేస్తున్న టైగర్ నాగేశ్వరరావు ట్రైలర్….

Tiger Nageswara Rao : మాస్ మహారాజ రవితేజ దర్శకుడు వంశీ ,అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ కాంబినేషన్ లో పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిన కేజీ ప్రాజెక్ట్ టైగర్ నాగేశ్వరరావు. ఇక ఈ సినిమాను 1970 కాలంలో గజదొంగ అయిన టైగర్ నాగేశ్వరరావు నిజ జీవిత సంఘటనలను ఆధారంగా చేసుకొని బయోపిక్ రూపొందించారు. భారీ బడ్జెట్ తో రూపొందించిన ఈ సినిమాలో నుపూర్ సనన్ ,గాయత్రి భరద్వాజ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి టీజర్ మరియు సాంగ్స్ విడుదల కాగా ప్రేక్షకులలో భారీ అంచనాలను నెలకొల్పాయి.

tiger-nageswara-rao-trailer-shaking-social-media

ఇక ఈ సినిమాలోని పాటలతో నేషనల్ వైడ్ గా ఫ్యూజ్ బజ్ క్రియేట్ అయింది. దీంతో ఎప్పుడెప్పుడా అని ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఈ సినిమాను దసరా కానుకగా విడుదల చేయాలని సిని మేకర్స్ నిర్ణయించారు. కాగా విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో ఇటీవల సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను మేకర్స్ విడుదల చేయడం జరిగింది. దీంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో టైగర్ నాగేశ్వరరావు ట్రైలర్ ట్రెండింగ్ గా మారింది. ఇటీవల ముంబైలో గ్రాండ్ గా విడుదల చేసిన ట్రైలర్ ప్రేక్షకులలో భారీ క్రేజ్ ను రాబట్టింది.

tiger-nageswara-rao-trailer-shaking-social-media

దీంతో ఈసారి రవితేజ కు భారీ బ్లాక్ బాస్టర్ ఖాయం అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఇక ట్రైలర్ లో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ గమనిస్తే చాలా అద్భుతంగా అనిపించింది. ట్రైలర్ లో కనిపించిన ప్రతి పాత్ర ఆకర్షణీయంగా ఉంది. కాగా జీవి ప్రకాష్ కుమార్ సంగీత దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను అక్టోబర్ 20న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. అంతేకాక ఈ సినిమాతో రవితేజ పాన్ ఇండియా స్టార్ గా మారే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.