Choreographer Chaitanya : కొరియోగ్రాఫర్ చైతన్య ఆత్మహత్య చేసుకోవడానికి అసలు కారణమేది…మల్లెమాల అండగా నిలబడలేదు..

Choreographer Chaitanya  : డి కొరియోగ్రాఫర్ చైతన్య ఆత్మహత్య ఒక్కసారిగా బుల్లితెరను కదిలించింది. అప్పుల బాధ తట్టుకోలేక చైతన్య నెల్లూరులోని ఓ క్లబ్ హోటల్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన అందర్నీ కంటతడి పెట్టిస్తుంది. అంతేకాక చనిపోయే ముందు చైతన్య తీసిన సెల్ఫీ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అప్పు ఇచ్చిన వాళ్ళు టార్చర్ పెడుతున్నారంటూ ఆ బాధలు తట్టుకోలేకనే ఇలా చేసుకోవాల్సి వచ్చిందంటూ,అతని తల్లిదండ్రులకు క్షమాపణలు చెప్పుకుంటూ బలాన్మరణానికి పాల్పడ్డాడు. అయితే ఆ […]

  • Published On:
Choreographer Chaitanya : కొరియోగ్రాఫర్ చైతన్య ఆత్మహత్య చేసుకోవడానికి అసలు కారణమేది…మల్లెమాల అండగా నిలబడలేదు..

Choreographer Chaitanya  : డి కొరియోగ్రాఫర్ చైతన్య ఆత్మహత్య ఒక్కసారిగా బుల్లితెరను కదిలించింది. అప్పుల బాధ తట్టుకోలేక చైతన్య నెల్లూరులోని ఓ క్లబ్ హోటల్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన అందర్నీ కంటతడి పెట్టిస్తుంది. అంతేకాక చనిపోయే ముందు చైతన్య తీసిన సెల్ఫీ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అప్పు ఇచ్చిన వాళ్ళు టార్చర్ పెడుతున్నారంటూ ఆ బాధలు తట్టుకోలేకనే ఇలా చేసుకోవాల్సి వచ్చిందంటూ,అతని తల్లిదండ్రులకు క్షమాపణలు చెప్పుకుంటూ బలాన్మరణానికి పాల్పడ్డాడు. అయితే ఆ వీడియో చివర్లో చైతన్య మాట్లాడిన మాటలు అందర్నీ కదిలించాయి.

Telugu Choreographer Chaitanya Dies by Suicide Due to Financial Burden: Apologises to Family in Emotional Video

డి అనేది పేరు ఇస్తుంది గుర్తింపునిస్తుంది కానీ సంపదను ఇవ్వదని , జబర్దస్త్ షోలో అయితే సంపాదన కూడా ఎక్కువే, అలాగే గుర్తింపు కూడా ఎక్కువే కానీ డీలో అలా ఉండదంటూ అయినా కూడా మేము డీలోని నిలబడ్డాము. కష్టపడ్డాం గుర్తుకు తెచ్చుకున్నాం కానీ సంపాదించుకోలేకపోయమంటూ కంటతడి పెట్టాడు. దీంతో ఈ వీడియో చూసిన నేటిజనులు మల్లెమాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కామెడీ పంచే వారి కంటే ఎంతో టాలెంట్ ఉన్న డాన్సర్లకు డబ్బులు ఇవ్వడం లేదా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇటు చైతన్య మృతితో జబర్దస్త్ మరియు డి అభిమానుల మధ్య కూడా వైరం మొదలైంది. జబర్దస్త్ లో కేవలం వల్గర్ కామెడీ ఉంటుంది. ఈ షోలో చేసేవారు చెమటోడ్చి ఫ్యాషన్ తో జడ్జిలను మెప్పించాలి .

అంత కష్టపడే వారికి నెలకు సరిపోయే డబ్బులు కూడా ఇవ్వడం లేదా అని ఆరోపిస్తున్నారు. కామెడీ చేయడం కూడా అంత తేలిక ఏమి కాదు కానీ ఆపదలో ఉన్న డీకంటెస్టెంట్స్ కి కూడా ఆదుకోవడం మల్లెమాల బాధ్యత అంటూ, కొరియోగ్రాఫర్ చైతన్యకు మల్లెమాల అండగా నిలిచి ఉంటే బాగుండేది అంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మల్లెమాల డీలో కంటెస్టెంట్స్ కంటే జబర్దస్త్ వారికి ఎక్కువ శాలరీలు ఇవ్వడం , డి కంటెస్టెంట్స్ చాలీచాలని జీతంతో అప్పులు చేసి అవి తీర్చలేక చైతన్య ఆత్మహత్య చేసుకున్నాడని అభిమానులు చెబుతున్నారు. ఏది ఏమైనా అప్పులు బాధ తట్టుకోలేక చైతన్య ఇలా ఆత్మహత్య చేసుకోవడం చాలా బాధాకరమని చెప్పాలి.

https://youtu.be/il_wEubrlxQ